ఆయన అందరి దర్శకుల్లా కాదు! | Sukumar wanted to remake Oka Romantic Crime Katha | Sakshi
Sakshi News home page

ఆయన అందరి దర్శకుల్లా కాదు!

Published Sat, Apr 1 2017 11:37 PM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM

ఆయన అందరి దర్శకుల్లా కాదు!

ఆయన అందరి దర్శకుల్లా కాదు!

‘‘ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ’ చిత్రం ద్వారా నాకు సునీల్‌ కుమార్‌ రెడ్డి పరిచయం. ఆయన డైరెక్ట్‌ చేసిన ‘గంగపుత్రులు’ చుశాను. ‘ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ’ చిత్రం చూసి ఆశ్యర్యపోయాను. ఈ మూవీని హిందీలో ఆయన డైరెక్ట్‌ చేయకపోతే నేను రీమేక్‌ చేయాలనుకున్నాను. సునీల్‌ అందరి దర్శకుల్లా కాదు. గల్ఫ్‌లో ఉన్న పాతిక లక్షల మంది తెలుగువారి జీవితాలపై పరిశోధన చేసి, ఈ ‘గల్ఫ్‌’ తీశారు. ఈ సినిమా మంచి హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ అన్నారు. సునీల్‌ కుమార్‌ దర్శకత్వంలో రవీంద్రబాబు నిర్మించిన ‘గల్ఫ్‌’ టైటిల్‌ లోగోను సుకుమార్‌ ఆవిష్కరించారు. ‘‘సోషల్‌ ఇష్యూలకు వినోదం కలిపి ఈ సినిమా తీశాం’’ అని సునీల్‌ కుమార్‌ అన్నారు. ఈ చిత్రానికి పులగం చిన్నారాయణ మాటల రచయిత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement