లీలావతి కథేంటి? | Miss Leelavathi Movie story ? | Sakshi
Sakshi News home page

లీలావతి కథేంటి?

Published Fri, Feb 13 2015 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM

లీలావతి కథేంటి?

లీలావతి కథేంటి?

 హుద్ హుద్ రాకముందు, వచ్చిన తర్వాత పరిణామాలను ప్రధానాంశంగా చేసుకుని పి. సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్ లీలావతి’. కీ ప్రొడక్షన్స్ సమర్పణలో రాజాజీ ఎంటెర్‌టైన్‌మెంట్స్ సారథ్యంలో శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై యెక్కలి రవీంద్రబాబు నిర్మిస్తున్నారు. కార్తీక్, లీలావతి, మహేశ్, ఎఫ్.ఎమ్.బాబాయ్, దివ్య, గీత, మల్లిక, బుగతా సత్యనారాయణ, సముద్రం వెంకటే శ్ తదితరులు ముఖ్య తారలు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
 
  ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఒకసారి చరిత్రను తిరగేస్తే, ఎన్నో యుద్ధాలు, అధిక శాతం ప్రళయాలు.. ఇవి మనిషి తనకు తానుగా తెచ్చుకున్న ఉపద్రవాలే కానీ, సహజమైనవి కావు. స్త్రీ, పురుష సంబంధాల్లో ఇదే తరహా సూత్రం వర్తిస్తుందన్న కథాంశంతో రూపొందిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది’’ అని చెప్పారు. ఈ నెలలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, కెమెరా: శివరాం, ఎడిటర్: శివ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి. బాపిరాజు, సహనిర్మాతలు: కుర్రా విజయ్‌కుమార్, శాంతయ్య.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement