అదే ముసుగుల కాన్సెప్ట్‌ | Romantic Criminals Press Meet | Sakshi
Sakshi News home page

అదే ముసుగుల కాన్సెప్ట్‌

Published Fri, May 17 2019 12:09 AM | Last Updated on Fri, May 17 2019 12:09 AM

Romantic Criminals Press Meet - Sakshi

పి. సునీల్‌కుమార్‌ రెడ్డి

‘‘యువత చెడిపోవడానికి వారి తల్లిదండ్రులు కూడా ఓ కారణం. సరైన గైడెన్స్‌ లేకనే యువత చెడు మార్గాల్లోకి వెళ్తున్నారు. ఆ రకంగా తల్లిదండ్రులకు రొమాంటిక్‌ క్రిమినల్స్‌ ఒక చెంపపెట్టులాంటి చిత్రం అవుతుంది’’అన్నారు దర్శకులు పి. సునీల్‌కుమార్‌ రెడ్డి. మనోజ్‌ నందం ప్రధాన పాత్రలో సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రొమాంటిక్‌ క్రిమినల్స్‌’. రొమాంటిక్‌ క్రైమ్‌ కథ, ఓ క్రిమినల్‌ ప్రేమ కథ చిత్రాలకు సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం నేడు విడుదల కానుంది.

సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ– ‘‘రెండేళ్లకొకసారి ఈ రొమాంటిక్‌ చిత్రాలను తెరకెక్కించాలని ప్లాన్‌ చేశాం. కాకపోతే గ్యాప్‌ వచ్చింది. ఓ జర్నలిస్టుగా స్టడీ చేసి ఈ కథలను రాసుకుంటున్నా. యువత వ్యసనాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నాం. సినిమా పోస్టర్‌లో ముగ్గురు అమ్మాయిలకు ముసుగులు వేశాం. వారు మూడు కాలాలను ప్రతిబింబిస్తారు. గతంలో చేసిన తప్పులకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇప్పుడు ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారు? రేపు ఎలా ఉండబోతున్నారన్నది ఈ ముసుగుల కాన్సెప్ట్‌. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది’’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement