
మనోజ్ నందం, శ్వేత సాలూరు జంటగా రామ్ లొడగల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్లాక్డ్’. రామారావు లెంక, పద్మ లెంక నిర్మించిన ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ టైటిల్ లోగోని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్ లొడగల మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. థ్రిల్లింగ్ అంశాలు ఉంటూనే హారర్ కామెడీ జోనర్‌లో అందర్నీ ఆకట్టుకునేలా తెరకెక్కించాం. పాటలను త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకటేష్. కె, సంగీతం: ప్రదీప్ చంద్ర.
Comments
Please login to add a commentAdd a comment