ఉపాధి వ్యథల ‘గల్ఫ్’ | Employment affliction 'Gulf' | Sakshi
Sakshi News home page

ఉపాధి వ్యథల ‘గల్ఫ్’

Published Sun, Jul 24 2016 11:47 PM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM

ఉపాధి  వ్యథల ‘గల్ఫ్’ - Sakshi

ఉపాధి వ్యథల ‘గల్ఫ్’

సామాజిక సమస్యలే ఇతివృత్తాలుగా సినిమాలు తెరకెక్కిస్తున్న దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి. ‘సొంత ఊరు’, ‘గంగపుత్రులు’ లాంటి సినిమాలు ఈ దర్శకుడిలోని సామాజిక బాధ్యతను చూపిస్తాయి. ప్రస్తుతం ఆయన మరో సోషల్ ఇష్యూతో ‘గల్ఫ్’ రూపొందిస్తున్నారు. శ్రావ్య ఫిలింస్ బ్యానర్‌పై యెక్కలి రవీంద్రబాబు, మద్దినేని రమణకుమారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చేతన్ మద్దినేని, సంతోష్ పవన్, అనిల్ కళ్యాణ్, డింపుల్ ముఖ్య తారలు. ప్రస్తుతం కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సునీల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ - ‘‘పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారి కష్టాలను ఇందులో చూపిస్తున్నాం. ఈ వ్యథలో ఓ స్వచ్ఛమైన ప్రేమకథను చెప్పబోతు న్నాం. సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలను కుంటున్నాం’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement