Oka Criminal Prema Katha
-
అది సవాల్‌తో కూడుకున్న పని : డా.డి.రామానాయుడు
‘‘సమాజాన్ని ఆలోచింపజేసేలా సునిల్‌కుమార్‌రెడ్డి సినిమాలుంటాయి. తాను దర్శకత్వం వహించే ప్రతి సినిమాతోనూ కొత్తవాళ్లను పరిచయం చేయడం అభినందనీయం. కొత్త ప్రతిభను పరిశ్రమకు పరిచయం చేయడం తేలికైన విషయం కాదు. సవాల్‌తో కూడుకున్న పని. ఈ నెల 18న విడుదల కానున్న ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని డా.డి.రామానాయుడు అకాంక్షించారు. పి.సునిల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’. మనోజ్ నందం, అనిల్ కల్యాణి, ప్రియాంక పల్లవి, దివ్య ఇందులో ప్రధాన పాత్రధారులు. శ్రావ్య ఫిలింస్ పతాకంపై కృష్ణమూర్తి సమర్పణలో యక్కలి రవీంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రవీణ్ ఇమ్మడి స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో రామానాయుడు చేతుల మీదుగా విడుదల చేశారు. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సునిల్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సమాజంలో జరుగుతున్న తప్పుల్ని వేలెత్తి చూపించే అతి కొద్ది మంది దర్శకుల్లో సునిల్‌కుమార్‌రెడ్డి ఒకరని ఆర్పీ పట్నాయక్ అన్నారు. ఇంకా యూనిట్ సభ్యులతో పాటు ఎం.ఎం.శ్రీలేఖ, జయచంద్రారెడ్డి తదితరులు కూడా మాట్లాడారు. -
క్రిమినల్ ప్రేమకథ
డెంకాడ: సమాజంలో యువతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాన ఇతివృత్తంగా క్రిమినల్ ప్రేమకథ చిత్రాన్ని తీస్తున్నామని సినీదర్శకుడు సునీల్‌కుమార్ రెడ్డి చెప్పారు. జొన్నాడ వద్ద ఉన్న లెండి ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతులు సమాజంలో అనేక మంది ఉన్మాదులు, శాడిస్టులు వంటి రకరకాల వ్యక్తులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇలాంటి అంశాలను ఆధారంగా చేసుకుని, కళాశాలల్లో తాను వెళ్లేటప్పుడు విద్యార్థినుల వద్ద సేకరించిన అంశాలనే ఆధారంగా తీసుకుని క్రిమినల్ ప్రేమకథ సినిమా తీయటం జరిగిందన్నారు. ఈ సినిమాల్లో లెండి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన అనణ్య, ప్రత్యూష, రమణి, కౌషిక్లకు పాట పాడే అవకాశం కల్పించామన్నారు. కళాశాల ప్రిన్స్‌పాల్ డాక్టర్ వీవీ రామారెడ్డి మాట్లాడుతూ లెండి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించటం హర్షనీయమన్నారు. మ్యూజిక్ డెరైక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఆర్తిని ఈ సినిమా పాటల్లో చూపించటం జరుగుతుందన్నారు. సమావేశంలో ఎన్ఎస్ఎస్ పీఓ టి.హరిబాబు, చిత్ర నటులు మనోజ్, అనిల్, ప్రియాంక, పల్లవి, దివ్య, మనోప్రియ తదితరులు పాల్గొన్నారు. -
ఒక క్రిమినల్ ప్రేమ కథ మూవీ పోస్టర్స్, స్టిల్స్
-
సుదీర్ఘ అధర చుంబనం!
ప్రస్తుతం లిప్ లాక్‌ల సీజన్ నడుస్తోంది. యువతరం ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం చాలామంది లిప్ లాక్‌ల సన్నివేశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. సొంతవూరు, గంగపుత్రులు తదితర చిత్రాలతో ఎన్నో పురస్కారాలు గెలుచుకున్న సునీల్‌కుమార్ రెడ్డి తాజాగా తను తీసిన ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’లో కథానుసారం ఓ లిప్ లాక్ సీన్ పొందుపరిచారు. ఓ బలమైన కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో సన్నివేశాలన్నీ దాదాపు బలంగానే ఉన్నాయట. వాటిలో ఈ పెదవి ముద్దు సన్నివేశం ఒకటి. హీరోహీరోయిన్లు మనోజ్, ప్రియాంకా పల్లవి పాల్గొనగా ఇటీవల ఈ సన్నివేశం తీశారు. ఇలాంటి సీన్స్‌లో నటించడం అంత సులువైన విషయం కాదు. నటీనటులు మానసికంగా సమాయత్తం కావాలి. మనోజ్, ప్రియాంక అలానే అయ్యారు. కానీ, సునీల్‌కుమార్ రెడ్డి ‘స్టార్ట్ కెమెరా..’ అనగానే అదరాలు వణకడం మొదలుపెట్టాయి. ఇక, చుంబనం సంగతి దేవుడెరుగు. మొత్తానికి టేక్స్ మీద టేక్స్ తీసుకున్నారట. ఫలితంగా ఈ ఒక్క సన్నివేశం చిత్రీకరణకు పట్టిన సమయం ఎనిమిది గంటలు. అది ఓకే.. కానీ, చిత్రీకరణకు అయిన నిడివి ఆ సినిమా మొత్తం నిడివి అంత అట. పెదవి ముద్దు సన్నివేశం నిడివి 90 సెకన్లకు పైగా ఉంటుందట. ఇప్పటివరకు తెలుగు తెరపై ఇంత నిడివి గల చుంబనం రాలేదని నిర్మాత రవీంద్రబాబు పేర్కొన్నారు. ఈ చిత్రం త్వరలోనే రానుంది.