
హృతిక్ శౌర్య, తన్వి నేగి జంటగా రవి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓటు’. ఫ్లిక్ నైన్ స్టూడియోస్‌పై ఫ్లిక్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని నటుడు, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ విడుదల చేసి, సినిమా హిట్ కావాలని ఆకాంక్షించారు.
‘‘మన దేశంలో కుల, మత, ప్రాంతీయ అభిప్రాయ బేధాలు లేకుండా జరుపుకునే ఏకైక పండగ.. ఎన్నికల పండగ’ అనే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది.
‘‘మందుకు, నోటుకు ఓటు అమ్మకోవడం కరెక్ట్ కాదు కదా?’, ‘ఓటు అనేది హక్కు కాదు.. మన బాధ్యత’’ వంటి డైలాగులు టీజర్‌లో ఉన్నాయి. హృతిక్ శౌర్య మాట్లాడుతూ–
‘‘ఫ్యామిలీ, లవ్ ఎమోషన్స్తో పాటు చాలా ముఖ్యమైన కథతో ‘ఓటు’ రూపొందింది’’ అన్నారు. ‘‘మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు తన్వి నేగి. నటుడు గోపరాజు రమణ మాట్లా్లడారు. ఈ చిత్రానికి సంగీతం: అగస్త్య, కెమెరా: ఎస్. రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ.
Comments
Please login to add a commentAdd a comment