అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి సినిమాలో మూడో పోస్టర్ను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ సినిమాలో 'శివగామి' పాత్ర పోషించిన రమ్యకృష్ణ నిలువెత్తు పోస్టర్ను తాజాగా రాజమౌళి తన ట్విట్టర్, ఫేస్బుక్ పేజీల ద్వారా విడుదల చేశారు. ఇప్పటికే ప్రభాస్, అనుష్కల పోస్టర్లు విడుదల చేసిన రాజమౌళి.. వరుసగా మూడో పోస్టర్లో రమ్యకృష్ణను పరిచయం చేశారు.
ఇంతకు ముందు ఎప్పుడూ తాను ఇంత డెప్త్ ఉన్న పాత్రను డీల్ చేయలేదని, అలాగే ఇంత సామర్థ్యం ఉన్న నటులతో కూడా చేయలేదని రాజమౌళి ఆ ట్వీట్లో చెప్పారు. గడిచిన రెండున్నరేళ్లుగా తమ యూనిట్ మొత్తానికి ఆమె 'డ్రైవింగ్ ఫోర్స్'గా ఉన్నారంటూ అభినందనలతో ముంచెత్తారు.
Sivagami is played by Ramya Krishna garu.. #Baahubali the beginning #LiveTheEpic
— rajamouli ss (@ssrajamouli) May 6, 2015
Never before have I dealt with a character so intense and an actor so capable. She is the driving force4 our whole unit these past 2.5 years
— rajamouli ss (@ssrajamouli) May 8, 2015