‘‘రంగమార్తాండ’ సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత ఒక చిన్నారి నా వద్దకు వచ్చి, ‘నేను మా అమ్మానాన్నలను బాగా చూసుకుంటాను’ అని చెప్పడం విశేషం. ప్రతిఒక్కరూ తమ తల్లితండ్రులతో కలిసి ఈ సినిమాను చూడాలి’’ అని డైరెక్టర్ కృష్ణవంశీ అన్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక జంటగా నటించిన చిత్రం ‘రంగమార్తాండ’. హౌస్‌ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఉగాది కానుకగా ఈ నెల 22న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో చిత్ర దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ–‘‘రంగమార్తాండ’ సినిమాకి ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణల అద్భుతమైన నటన, ఇళయరాజాగారి సంగీతం, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి సాహిత్యం.. ఇలా అన్నీ అద్భుతంగా కుదిరాయి. రమ్యకృష్ణ కళ్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. దీంతో ఎలాంటి పెద్ద డైలాగులు లేకుండా కళ్లతోనే నటించాలని చెప్పినప్పుడు తను సరేనంది. ఈ మూవీ క్లైమాక్స్‌లో రమ్యకృష్ణపై సన్నివేశాలు తీసేటప్పుడు చాలా బాధపడ్డాను. దాదాపు 36 గంటల పాటు ఈ సీన్స్ తీశాను. అప్పుడు నాకు సెంటిమెంట్ అడ్డొచ్చింది.. చిత్రీకరిస్తుంటే కంట్లో నుంచి నాకు నీళ్లు వస్తూనే ఉన్నాయి’’ అన్నారు. ‘‘కృష్ణవంశీగారి దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ వంటి మంచి సినిమా చేయడం నా అదృష్టం’’ అన్నారు సింగర్, నటుడు రాహుల్ సిప్లిగంజ్.
Comments
Please login to add a commentAdd a comment