
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ నటుడు రజనీకాంత్ తమిళనాట కొత్తగా పెట్టబోయే రాజకీయ పార్టీలో ఆయన కుటుంబసభ్యులు చేరనున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్యతోపాటు పెద్ద కుమార్తె ఐశ్వర్య భర్త, నటుడు ధనుష్‌లు పార్టీలో చేరతారని సమాచారం.
రజనీకాంత్ ప్రస్తుతం హిమాలయాల్లో ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. కాగా, రాజకీయాల్లోకి వచ్చిన వారు త్యాగాలకు సిద్ధం కావాలని, తాను సైతం అందుకు సిద్ధంగా ఉన్నానని రజనీకాంత్ అన్నారు. రిషీకేశ్‌లో ఓ ఇంగ్లిష్ చానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. ‘రాజకీయ నాయకుడిగా కొత్త పాత్రను దేవుడిచ్చాడు. ఈ పాత్రకూ 100 శాతం న్యాయం చేయగలను’ అని చెప్పారు.