
‘పాలిటిక్స్‌లో నాన్న రజనీ టైమింగ్ సూపర్’!
గత నెలలో అభిమానులతో ప్రత్యేక భేటీలు అయిన రజనీకాంత్ ఆసందర్బంలో రాజకీయాల్లో చేరే విషయంపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. దైవం కోరితే తాను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని, ప్రస్తుతం ఆయా రాజకీయ నాయకులతో చర్చల్లో ఉన్నానని చెప్పారు. ‘వారితో సమావేశాలు అవుతున్న విషయాన్ని నేను కాదనలేను. మేమంతా చర్చల్లో ఉన్నాం’ అంటూ ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ముంబయిలో ఓ చానెల్‌తో మాట్లాడిన ఆయన కూతురు సౌందర్య నాన్న సరైన సమయంలో సరైన పనిచేస్తారని, ఇప్పటి వరకు అలాగే చేశారని, ఇక ముందు కూడా అలాగే చేస్తారని చెప్పారు.