
సీనియర్ నటి ఆమని తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకం పరిచయం అక్కర్లేని పేరు. 'జంబలకిడిపంబ’ ,‘మిస్టర్ పెళ్లాం’, ‘శుభలగ్నం’ వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ఆమని ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో తల్లి, అత్త పాత్రల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఇక దివంగత హీరోయిన్ సౌందర్యకు ఆమని బెస్ట్‌ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆమె సౌందర్యపై తనకున్న ప్రేమను మరోసారి బయటపెట్టింది.
'సౌందర్య చనిపోయింది అని విన్నప్పుడు నా గుండె ముక్కలైపోయింది. దేవుడ్ని చాలా తిట్టుకున్నా. ఆమె స్థానంలో నేను చనిపోయినా బాగుండేది అని అనుకున్నాను. ఎందుకంటే, అప్పటికి నాకు పిల్లలు లేరు.. జీవితం చూసేశాను. సౌందర్యకు అప్పుడే పెళ్లయి ఏడాదే అయ్యింది. అప్పుడప్పుడే లైఫ్ స్టార్ట్ చేసింది. అందుకే ఆమె స్థానంలో నేను పోయినా బాగుండు అనుకున్నాను.
ఇక యాక్సిడెంట్ సమయానికి సౌందర్యప్రెగ్నెంట్ అని వార్తలు రాశారు. కానీ అందులో నిజం లేదని స్వయంగా సౌందర్య అమ్మ చెప్పింది. ఒకనొక సమయంలో సౌందర్య అన్నయ్య అమర్‌ను పెళ్లి చేసుకోవాలనే ప్రపోజల్ వచ్చింది. కానీ అప్పటికీ నా ఫోకస్ అంతా కేవలం సినిమాలపైనే ఉండేది. ఒకవేళ అమర్‌ని పెళ్లి చేసుకుంటే, ఎలాగూ సౌందర్య కూడా వెళ్తోందిగా నేను వస్తాను అని ఫ్లైట్ ఎక్కేదాన్ని లేదా అతని జ్ఞాపకాలతో మిగిలిపోయేదాన్నేమో. అంతా విధి. ఎవరికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది' అంటూ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment