![Jagapathi Babu Clarity On His Relationship With Late Actress Soundarya - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/24/soundarya.jpg.webp?itok=xNXsx8pC)
లెజెండరి నటుడు జగపతి బాబుకు పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో స్టార్ హీరోలకు విలన్‌గా నటిస్తూ వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ‘మావిడాకులు, శుభలగ్నం, సర్దుకుపోదాం రండి, ఫ్యామిలీ సర్కస్’ కుటుంబ కథా చిత్రాలతో జగపతి బాబు ఎంతో గుర్తింపు పొందారు. అయితే అప్పట్లో జగపతి బాబు, దివంగత నటి సౌందర్యలది హిట్ పెయిర్ అనే విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలన్ని మంచి విజయం సాధించాయి.
చదవండి: పెళ్లిపై ఆసక్తి లేదు.. కానీ బాయ్‌ఫ్రెండ్ కావాలి: సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్
దాదాపు తెరపై భార్యభర్తలుగా నటించిన వీరిద్దరిపై అప్పట్లో రూమర్స్ కూడా బాగానే వచ్చేవి. అయితే సౌందర్య పెళ్లి అనంతరం వాటికి చెక్ పడింది. కానీ పెళ్లికి ముందు మాత్రం వీరిద్దరి పెయిర్, ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చూసి సౌందర్య, జగపతి బాబు మధ్య ఏదో స్పెషల్ బాండింగ్ ఉందంటూ అప్పట్లో అందరూ చెవులు కొరుక్కునేవారు. అంతేకాదు తరచూ సౌందర్య ఇంటికి జగపతి బాబు, ఆయన తన ఇంటికి వెళ్లడం చూసి వారిద్దరి రిలేషన్ గురించి పుకార్లు షికారు చేస్తుండేవనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న జగపతి బాబుకు దీనిపై ప్రశ్న ఎదురైంది. ఆయన స్పందిస్తూ.. తనకు, సౌందర్యకు మధ్య రిలేషన్ ఉన్నమాట నిజమే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చదవండి: తారక్ వల్లే నా పెళ్లి జరిగింది: ప్రముఖ నిర్మాత కూతురు
‘కానీ అది మీరు అనుకున్నది కాదు. మేమిద్దరం మంచి స్నేహితులం. ఆమె అన్యయ్య కూడా నాకు మంచి ఫ్రెండ్. సౌందర్య వ్యక్తిగతంగా చాలా మంచి అమ్మాయి. మేము మాత్రమే కాదు మా ఫ్యామిలీలు కూడా చాలా క్లోజ్. ఎవరింట్లో ఏ ఫంక్షన్ అయినా కుటుంబ సమేతంగా హాజరయ్యేవాళ్లం. ఈ క్రమంలో సౌందర్య తరచూ మా ఇంటికి వస్తుండేవారు. నేను వాళ్ల ఇంటికి వెళ్తుండేవాడిని. అది చూసి జనాలు తప్పుగా అర్ధం చేసుకున్నారు. సౌందర్య అలాంటిది కాదు. మా ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని వచ్చిన వార్తలు నేను కూడా విన్నా. కానీ వాటిని నేను పెద్దగా పట్టించుకోలేదు’ అంటూ ఆయన వివరించారు. కాగా ప్రస్తుతం జగపతి బాబు ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment