అసలు ఆ ఆలోచనే రాలేదు: రజనీ కూతురు | Whatever the script demands, the director has to do that: soundarya | Sakshi
Sakshi News home page

అసలు ఆ ఆలోచనే రాలేదు: రజనీ కూతురు

Published Mon, Jun 26 2017 11:18 AM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM

అసలు ఆ ఆలోచనే రాలేదు: రజనీ కూతురు

అసలు ఆ ఆలోచనే రాలేదు: రజనీ కూతురు

ముంబై: ధనుష్‌ నటించిన వీఐపీ(రఘువరణ్‌ బీటెక్‌) చిత్రం ఎంత విజయం సాధించిందో తెలుసుకదా. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన వీఐపీ-2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం సాయంత్రం వీఐపీ-2 ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమాన్ని ముంబైలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకురాలు సౌందర్యను పాత్రికేయులు.. ఈ చిత్రంలో రజనీ ఉన్నారా అని ప్రశ్నించారు. దీనిపై ఆమె బదులిస్తూ.. స్క్రిప్ట్‌ ఏదైతే డిమాండ్‌ చేస్తుందో దర్శకుడు అంతవరకే చెయ్యాలి. వీఐపీ-2 స్క్రిప్ట్‌ అలాంటిదేమీ డిమాండ్‌ చేయలేదు. ఈ చిత్రంలో స్పెషల్‌ అప్పీయరెన్స్‌గా రజనీ ఉండాలనే ఆలోచనే మాకు రాలేదని స్పష్టం చేశారు. వీఐపీ-2లో ధనుష్‌ సరసన అమలాపాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్‌ నటి కాజోల్‌ ఓ ముఖ్యపాత్రలో కనిపిస్తారు. సౌందర్య దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రం ఇది కాగా.. మొదటిది కొచ్చాడయన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement