హీరో ధనుష్‌ అబద్ధం చెప్పారు | Actor Dhanush told me that he had spoken dialogues in Tamil. | Sakshi
Sakshi News home page

హీరో ధనుష్‌ అబద్ధం చెప్పారు

Published Wed, Jun 28 2017 7:57 AM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM

హీరో ధనుష్‌ అబద్ధం చెప్పారు

హీరో ధనుష్‌ అబద్ధం చెప్పారు

చెన్నై: హీరో ధనుష్‌ అబద్ధం చెప్పారని అన్నారు బాలీవుడ్‌ భామ కాజోల్‌. హిందీలో క్రేజీ కథానాయికిగా వెలుగొందుతున్న సమయంలోనే ఈ బ్యూటీ మిన్సార కణవు చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం విజయాన్ని సాధించినా మళ్లీ తమిళ చిత్రాల్లో నటించలేదు. కాగా చాలా కాలం తరువాత ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తున్న వీఐపీ–2 చిత్రంతో మరోసారి కోలీవుడ్‌లో మెరవడానికి రెడీ అవుతున్నారు. ఇందులో కాజోల్‌ ప్రతినాయకిగా నటిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

అయితే అది నిజం కాదని ఆదివారం జరిగిన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ధనుష్‌ స్పష్టం చేశారు. ఇందులో కాజల్‌ది తన పాత్రతో సమాంతరంగా సాగే ప్రధాన పాత్ర అని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాజోల్‌ మాట్లాడుతూ తాను ఇతర భాషా చిత్రాల్లో నటించడానికి సాహసించడం లేదన్నారు. అప్పుడెప్పుడో మిన్సారకణవు చిత్రంలో నటించానని, దీంతో వీఐపీ–2 చిత్రంలో నటించడానికి తాను నెర్వస్‌గా ఫీలయ్యానన్నారు. భాష తెలియకపోవడమే అందుకు కారణం అని అన్నారు. ఈ చిత్రం కోసం ధనుష్, సౌందర్యరజనీకాంత్‌లు తన ఇంటికి వచ్చి తమిళంలో మాట్లాడటం గురించి చాలా నేర్పించారన్నారు.

తమిళ భాష ఫోబియా నుంచి వారే తనను తప్పించారని అన్నారు. అయినా తమిళంలో సంభాషణలు చెప్పడానికి బుర్ర బద్దలు కొట్టుకున్నానని అన్నారు. కొంచెం తమిళం, ఎక్కువ ఆంగ్ల భాషల్లో డైలాగులు చెప్పేశానని అన్నారు. అయితే తాను తమిళంలో డైలాగులు బాగా చెప్పానని ధనుష్, సౌందర్య రజనీకాంత్‌లు అబద్ధం చెప్పారని వ్యాఖ్యానించారు. ఏదేమైనా వీఐపీ–2 చిత్రంలో నటించడం మంచి అనుభవం అని, ధనుష్‌ ఎక్స్‌ట్రార్డినరీ యాక్టర్‌ అని ప్రశంసించారు.

సౌందర్య రజనీకాంత్‌ స్క్రిప్ట్‌ విషయంలో చాలా క్లియర్‌గా ఉండేవారని కాజోల్‌ పేర్కొన్నారు. ఇందులో ఆమె కార్పొరేట్‌ సంస్థ అధికారిణి వసుంధర పాత్రలో నటించారు. కాగా ఈ చిత్ర హిందీ వెర్షన్‌ కోసం ధనుష్, కాజోల్‌పై ప్రమోషన్‌ గీతాన్ని ప్రత్యేకంగా చిత్రీకరించడం విశేషం. ఈ పాట అదనపు ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement