తండ్రి ఆశ నెరవేరింది! | Soundarya Rajinikanth is pregnant | Sakshi
Sakshi News home page

తండ్రి ఆశ నెరవేరింది!

Published Wed, Dec 17 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

తండ్రి ఆశ నెరవేరింది!

తండ్రి ఆశ నెరవేరింది!

 ‘‘సినిమా పరిశ్రమలో కొనసాగాలంటే నాకేం అభ్యంతరం లేదు. ప్రతిభ నిరూపించుకునే అవకాశం వస్తే, సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ, దానికన్నా ముందు తల్లి కావడం ముఖ్యం. ఆ పిల్లలను పెంచుకుంటూ వృత్తిని కొనసాగించవచ్చు’’.... ‘కోచడయాన్’ చిత్రం ఆడియో వేడుకలో తన చిన్న కుమార్తె సౌందర్యను ఉద్దేశించి రజనీకాంత్ అన్న మాటలివి. త్వరలో ఆయన ఆశను సౌందర్య నెరవేర్చనున్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి. 2010లో అశ్విన్‌తో సౌందర్య వివాహం జరిగింది. ఆ తర్వాత సౌందర్య స్వీయ దర్శకత్వంలో ‘కోచడయాన్’ చిత్రం ఆరంభించడం, రెండు, మూడేళ్లు ఈ చిత్రానికే పరిమితం కావడం జరిగాయి. ఈ చిత్రం విడుదల తర్వాత సౌందర్య వేరే చిత్రాలేవీ మొదలుపెట్టలేదు. ఈలోపు ఈ తీపి కబురు చెప్పారు. ఇదిలా ఉంటే.. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యకు ఇద్దరు కొడుకులున్నారు.  ఇప్పుడు మరో సారి రజనీ తాత కానున్నారన్న మాట!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement