
పాప్ ప్రపంచంలో మైఖేల్ జాక్సన్ ఓ సంచలనం.ఆయన ఈ లోకాన్ని విడిచి ఎన్నో ఏళ్లు గడిచిపోయింది. అయినా కూడా క్రేజ్ తగ్గలేదు సరికదా, ఏ తరానికి చెందినవారికైనా మైఖెల్ వదిలి వెళ్లిన స్టెప్పులు, స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాయి. స్టేజ్ పై అతను కనిపించే తీరు, వీడియోస్ అతని స్టైల్, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని అభిమానుల్ని సంపాదించి పెట్టింది. తన కెరీర్ లోనే ఎన్నో కళ్లు చెదిరే స్టెప్పులు వేశాడు. వాటిల్లో మూన్ వాక్ అతనికి ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.
అయితే మైఖేల్ వ్యక్తిగత జీవితంలో చాలా రహస్యాలు ఉన్నాయి. ఇటు స్టార్ డమ్, అటు కాంట్రవర్సీస్ వీటన్నిటినీ ఇప్పుడు తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హాలీవుడ్ కు చెందిన లయన్స్ గేట్ ఎంటర్ టైన్ మెంట్ కార్పోరేషన్ ఇప్పుడు మైఖెల్ జాక్సన్ జీవితం పై బయోపిక్ తెరకెక్కించబోతోంది.
మైఖెల్ పేరుతో తెరకెక్కే ఈ చిత్రాన్ని అమెరికన్ ఫిల్మ్ మేకర్ ఆంటోనీ తెరకెక్కించనున్నాడు. 1998 నుంచి ఇతను సినిమాలు తీస్తూ వస్తున్నాడు. 2001లో వచ్చిన ట్రైనింగ్ డే సినిమా ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు పాప్ కింగ్ లైఫ్ ను వెండితెరకెక్కించాలనుకుంటున్నాడు. మైఖెల్ జాక్సన్ గా ఎవరు నటించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment