తమిళ సినిమా: సినిమా ఎల్లలు దాటి చాలాకాలం అయ్యింది. అలాగే బయోపిక్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అలా స్వసక్తితో ఉన్నత స్థాయికి ఎదిగిన ఒక వ్యాపారవేత్త బయోపిక్‌తో రపొందిన చిత్రం విజయానంద్. కర్ణాటకలో ఒక మారుమూల గ్రామానికి చెందిన విజయ్ సంగేశ్వర అనే వ్యక్తి చిన్న ట్రక్కుతో తన జీవిత పయనాన్ని ప్రారంభించి 4300 వాహనాలకు అధిపతిగా దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆయన జీవిత చరిత్రతో రపొందించిన చిత్రం విజయానంద్. దర్శకుడు రిషికా శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో టైటిల్ పాత్రను నటుడు నిహాల్ పోషించా రు.
ఆయనతోపాటు అనంతనాగ్, రవిచంద్రన్, భారత్ బొపన్న, ప్రకాశ్ బొల్లాడి, శ్రీ ప్రహ్లాద్, వినయ ప్రసాద్, అర్చన, హనీష్ గురివిల్ల తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కీర్తన పూజారి చాయాగ్రహణం, గోపీ సుందర్ సంగీతాన్ని అందింన ఈ బారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, డిసెంబర్ 9వ తేదీన తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదలకు సిద్ధమవుతోంది. భావితరాల్లో నమ్మకాన్ని పెంచే గొప్ప సాధికుడి పాత్రలో మరణించడం గర్వంగా భావిస్తున్నట్లు నటుడు నిహాల్ పేర్కొన్నారు. ఎంత సాధించిన వాళ్లైనా విశ్రాంతి తీసుకుంటారని, అయితే ఆయన అవిశ్రాంతంగా శ్రమించారని పేర్కొన్నారు. ఆయన జీవితం విజయం సాధించాలనే వారందరికీ ఒక పాఠమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment