మైఖేల్‌జాక్సన్ , శ్రీదేవి లాంటి వారు కూడా... | no side effects with plastic surgery | Sakshi
Sakshi News home page

మైఖేల్‌జాక్సన్ , శ్రీదేవి లాంటి వారు కూడా...

Published Fri, Sep 19 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM

మైఖేల్‌జాక్సన్ , శ్రీదేవి లాంటి వారు  కూడా...

మైఖేల్‌జాక్సన్ , శ్రీదేవి లాంటి వారు కూడా...

అప్పియరెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ..  రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా!
అందుకే మైఖేల్‌జాక్సన్ లాంటి పాప్‌స్టార్ మొదలు శ్రీదేవి లాంటి సినిమాస్టార్స్ దాకా అందరూ తమ రూపాలను చెక్కుకున్నవారే..
మేకప్‌తో కాదు ప్లాస్టిక్ సర్జరీతో అంటారు మరి! ఆ సర్జరీలకు డిమాండ్ ఏ రేంజ్‌లో పెరిగిందంటే.. స్టార్స్‌నుంచి సామాన్యులకు అందేంత!
అలా పుట్టుకతో వచ్చిన రూపాన్ని నచ్చినట్టు మార్చుకోవడానికి ఇప్పుడు నో సర్జికల్ ట్రీట్‌మెంట్స్.. ఓన్లీ  ఈస్థటిక్ ట్రీట్‌మెంట్సే! సిటీలో ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ జోరందుకుంది.

చప్పిడి ముక్కును కోటేరు ముక్కులా మార్చడానికి మొన్నటిదాకా రైనోపాస్టీ అందుబాటులో ఉండేది. అదిప్పుడు నోజ్‌జాబ్, నోస్ కరెక్షన్‌గా మారింది. ముక్కుమీద చిన్నపాటి కత్తిగాటు లేకుండా కేవలం ఒకేఒక ఇంజక్షన్‌తో ముక్కును కోటేరులా చేస్తారు. దీన్ని ఫిల్లర్‌ట్రీట్‌మెంట్ అని పిలుస్తున్నారు. ఒక్క ముక్కేకాదు కనుబొమ్మల షేప్ నుంచి అధరాల ఆకారం దాకా దేన్నయినా చిటికెలో మార్చేస్తారు. నుదిటి మీది ముడతల నుంచి కంటి చివర రేఖల వరకు బిగుతుచేసి వడలిన వర్చస్సుకు మునుపటి మెరుపును తెస్తారు. సత్వర
 
సౌందర్యాన్నిచ్చే ఆ చికిత్సల వివరాలివీ...

కాంప్లెక్షన్ కోషర్
మేనిఛాయలోని హెచ్చుతగ్గులను సరిచేసే చికిత్స ఇది. చర్మంలో ఒక్కోచోట మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువగా చేరడంతో అక్కడ రంగు కాసింత నల్లగా మారుతుంది. మిగిలిన భాగంలో సాధారణ ఛాయ ఉంటుంది. ఇలాంటి వ్యత్యాసాలనే కాదు, మొటిమలు మిగిల్చిన మచ్చలు సహా ట్యాన్‌నూ ఈ చికిత్సతో  మటుమాయం చేసేసుకోవచ్చు. అంతేకాదు ఈ ట్రీట్‌మెంట్‌తో  రెండు మూడు వారాల్లోనే మేని ఛాయను దాదాపు నాలుగు రెట్లు మెరుగుపరచుకోవచ్చు. ఒక్కో సెషన్‌కు అరగంట సమయం వెచ్చిస్తే చాలు కోరుకున్న మేలిమిఛాయను సొంతంచేసుకోవచ్చు. దీనికోసం ఒక్కో సెషన్‌కి పదినుంచి పన్నెండువేల రూపాయలు ఖర్చు మీది కాదనుకోవాలి.
 
యాంటీ-ఏజ్ మంత్ర
35 ఏళ్లు దాటాక వచ్చే ముఖంపై ముడుతలు, కళ్ల కింద క్యారీబ్యాగ్‌లను చిటికెలో తరిమికొట్టే చికిత్స ఇది. పట్టుమని పదిహేను నిమిషాల్లోనే ముఖంపై ముడుతలు మటుమాయమవుతాయి. పెళ్లిళ్ల సీజన్‌లో ఈ ట్రీట్‌మెంట్‌కి గిరాకీ ఎక్కువ. వధూవరుల తల్లిదండ్రులు సైతం ఇప్పుడీ చికిత్సలతో తమ ఏజ్‌ను లెస్‌చేసుకుంటున్నారు. ఇలా యంగ్‌లుక్స్‌తో బంధుమిత్రులకు షాక్ ఇవ్వాలంటే సెషన్‌కి 15 నుంచి 20వేల రూపాయలు మనవి కావనుకోవాలి.
 
ఐ-బ్లింక్ మిరాకిల్
జారిపోయిన బుగ్గల్లో బిగి తేవచ్చు. నాసికను సంపెంగకు దీటుగా తీర్చిదిద్దుకోవచ్చు. పెదవులను ముఖాకృతికి అనుగుణంగా రూపొందించుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే... మీ ముఖంలోని లోపాలన్నింటినీ ఈ చికిత్సతో తొలగించుకుని, నిండు చందమామలా వెలిగిపోవచ్చు. ఈ కాంతికోసం ఎలాంటి మందులు, పథ్యాలు అవసరంలేదు. 20 నుంచి 70 ఏళ్ల వయసువాళ్లందరూ ఈ ట్రీట్‌మెంట్‌కి అర్హులు. 14 నుంచి 16 నెలల వరకు ఫలితం ఉంటుంది.
 
‘ఈ అడ్వాన్స్‌డ్ స్కిన్ ట్రీట్‌మెంట్స్, అల్ట్రా లిపో నాన్‌సర్జికల్ స్లిమ్మింగ్ ట్రీట్‌మెంట్స్, లేజర్ ట్రీట్‌మెంట్స్, లేజర్ హెయిర్ రిమూవల్, హెయిర్ గ్రోత్ ట్రీట్‌మెంట్, స్కిన్ రిజువనేషన్, కెమికల్ పీల్స్, మైక్రోడెర్మాబ్రేషన్, బోటాక్స్, ఫిల్లర్స్ వంటి చికిత్సలకు ఎలాంటి దుష్ర్పభావాలు ఉండవు. పైగా షార్ట్‌టైమ్‌లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ ట్రీట్‌మెంట్స్ పట్ల ఆడవాళ్లే కాదు మగవాళ్లూ ఆసక్తిచూపిస్తున్నారు.

వండర్ ఏంటంటే మొన్న ఎన్నికలసీజన్‌లో పొలిటికల్ లీడర్స్ ఈ ట్రీట్‌మెంట్‌కోసం రావడం.  పెళ్లిళ్ల సీజన్‌లో అయితే యూత్ ఎక్కువ మక్కువ చూపిస్తోంది.  ఎలాంటి విశ్రాంతి అవసరం లేకుండానే ట్రీట్‌మెంట్ చేయించుకునే వీలుండటంతో ఈ నాన్ సర్జికల్‌ట్రీట్‌మెంట్స్ వైపు ఎక్కువమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల ‘యమలీల-2’ హీరోయిన్ డయా నికోలస్ మా క్లినిక్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంది. ఆమెలా బిజీ షెడ్యూల్ ఉన్నవాళ్లకు ఇలాంటి ట్రీట్‌మెంట్స్ చాలా యూజ్‌ఫులే కాదు కాన్ఫిడెన్స్‌నూ ఇస్తాయ’ని చెప్తున్నారు బ్లూ స్కిన్ అండ్ కాస్మొటాలజీ క్లినిక్ అధినేత డాక్టర్ నిలయిని.
 
నో సైడ్ ఎఫెక్ట్స్

సర్జికల్ ట్రీట్‌మెంట్ కంటే ఇదే బెటర్. ఈ నాన్ సర్జికల్ ట్రీట్‌మెంట్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ట్రీట్‌మెంట్ తర్వాత రెస్ట్ తీసుకునే పని కూడా లేదు. పైగా ఈ పద్ధతితో మోర్ రిజల్ట్ పొందే అవకాశం కూడా ఉంది.
 
- ప్రీతీరాణా, నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement