
మా డాడ్స్ వైఫ్!
స్టెప్ మదర్ శ్రీదేవి గురించి ఇప్పటి వరకూ ఎక్కడా మాట్లాడని హీరో అర్జున్‌కపూర్ తొలిసారి పెదవి విప్పాడు. ‘కాఫీ విత్ కరణ్ జోహార్’లో అటుతిరిగి ఇటు తిరిగి టాపిక్ అతని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. శ్రీదేవితో తన పంథా ఎప్పటికీ మారదన్నాడు.
ఆమె ఎప్పటికీ తన తండ్రి భార్యేనని... తనకు తల్లి కాబోదని తెగేసి చెప్పేశాడు. వారితో కలసి జీవించే ప్రసక్తే లేదన్నాడు. ‘మా అమ్మ మోనా ఎవర్నీ కించపరిచేలా ప్రవర్తించవద్దని ఎప్పుడూ చెబుతూ ఉండేది. అందుకే శ్రీదేవిని ఎప్పుడూ అగౌరవ పరచేలా మాట్లాడలేదు’ అన్నాడు అర్జున్. అలాగని శ్రీతో తనకెలాంటీ విభేదాలూ లేవన్నాడు.