ఆశలపై నీళ్లు! | poured water on hopes! | Sakshi
Sakshi News home page

ఆశలపై నీళ్లు!

Feb 25 2015 11:42 PM | Updated on Sep 2 2017 9:54 PM

ఆశలపై నీళ్లు!

ఆశలపై నీళ్లు!

అతిలోక సుందరి శ్రీదేవి మళ్లీ బిగ్‌స్క్రీన్‌పై కనిపిస్తుందంటేనే అభిమానులకు ఓ పెద్ద పండుగ. అలాంటిది అమ్మడు కెపైక్కించే లిప్‌లాక్ చేస్తుందంటే..!

అతిలోక సుందరి శ్రీదేవి మళ్లీ బిగ్‌స్క్రీన్‌పై కనిపిస్తుందంటేనే అభిమానులకు ఓ పెద్ద పండుగ. అలాంటిది అమ్మడు కెపైక్కించే లిప్‌లాక్ చేస్తుందంటే..! చింబు దేవన్ దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘పులి'లో కన్నడ స్టార్ సుదీప్‌తో శ్రీదేవి లిప్‌లాక్ వేయనుందనే వార్తలు దేశమంతా వ్యాపించి షేక్ చేస్తున్నాయి. వయసులకు అతీతంగా ఫ్యాన్స్ అప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేశారు. పైగా శ్రీదేవి కూడా ఇందుకు ఓకే చెప్పిందనేది ఆ వార్తల సారాంశం. అయితే వీరి ఆశలపై నీళ్లు జల్లాడు సుదీప్. అవన్నీ రూమర్లేనని సింపుల్‌గా కొట్టిపారేశాడు. అసలిలాంటివన్నీ ఎలా పుడతాయంటూ ఎదురు ప్రశ్నించాడు. ఇలాంటి సన్నివేశంపై నన్నెవరూ సంప్రదించలేదన్నాడు. యాక్షన్ ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హన్సిక, శృతిహాసన్, తమిళ స్టార్ హీరో విజయ్‌లు కూడా నటిస్తున్నారన్నది టైమ్స్ కథనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement