stepmother
-
దారుణానికి పాల్పడ్డ మొదటి భార్య
సాక్షి, నల్లగొండ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల నేపధ్యంలో సవతి పిల్లల్ని హత్య చేసి, తాను ఆత్మహత్యకు పాల్పడింది ఓ మహిళ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణానికి చెందిన ప్రదీప్ కొన్నేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ప్రదీప్, శాంతి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, ఇటీవల ప్రదీప్‌కు, మొదటి భార్యకు ఆస్తి తగాదాలు తలెత్తాయి. దీంతో రెండో భార్య కుటుంబంపై కక్ష కట్టుకున్న ఆమె.. గురువారం శాంతికి పుట్టిన ఇద్దరు పిల్లల్ని హత్య చేసి, అనంతరం అదే ఇంట్లో ఆమె ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కొరకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. -
పది రోజుల్లో పెళ్లి.. యువకుడి ఆత్మహత్య
పలమనేరు: మరో పదిరోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన ఆ యువకుడు విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి సరుకులు తీసుకొస్తానని బుధవారం వెళ్లిన ఆ యువకుడు యోగేశ్ ఆదివారం అటవీ ప్రాంతంలో శవమై కనిపించడం చిత్తూరు జిల్లా పలమనేరు మండలం టి.వడ్డూరులో విషాదం నింపింది. గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ వేమన్నకు అశోక్, యోగేశ్ కుమారులు. పదేళ్ల కిందట అశోక్ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని తట్టుకోలేని అతడి తల్లి రాజమ్మ కూడా అదేరోజు పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకుంది. తరువాత వేమన్న రెండో వివాహం చేసుకున్నారు. అన్న, తల్లి మృతితో మానసికంగా ఇబ్బందిపడిన యోగేశ్.. తరువాత బెంగుళూరు వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇటీవల అతడికి వి.కోట మండలం తోటకనుమ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఇంటికి వచ్చి పెళ్లిపనుల్లో నిమగ్నమైన యోగేశ్‌కు, అతడి సవతితల్లికి ఇంటి పెయింటింగ్ విషయమై గత బుధవారం వివాదం జరిగింది. దీంతో తీవ్రంగా కలత చెందిన అతడు అదేరోజు తన తండ్రితో బెంగళూరులో పని ఉందని చెప్పి కొత్తగా కొన్న బుల్లెట్ మీద వెళ్లాడు. గ్రామానికి సమీపంలోని కొత్త చెరువు వద్ద నల్లక్కబాయి అటవీ ప్రాంతంలో బుల్లెట్‌ను, విషపుగుళికలను ఆదివారం గుర్తించిన పెంగరగుంట వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు పరిశీలించి సమీపంలో యోగేశ్ మృతదేహాన్ని గుర్తించారు. అతడు నాలుగు రోజుల కిందటే ప్రాణాలు తీసుకున్నట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సవతి తల్లి వేధింపులు తాళలేక..
- ఇంటి నుంచి పారిపోయి వచ్చిన బాలుడు - సంరక్షణ సిబ్బందికి అప్పగించిన పోలీసులు మద్దికెర : కన్నతల్లి ప్రేమకు దూరమైన ఓ బాలుడు సవతి తల్లి వేధింపులను భరించలేక ఇంటి నుంచి పారిపోయి వచ్చాడు. బాలున్ని గమనించిన మద్దికెర పోలీసులు కర్నూలు చైల్డ్ లైన్ వారికి అప్పగించారు. మద్దికెరకు చెందిన ఎరుకల దుర్గన్న ఈ నెల 26న కర్నూలు- గుంతకల్లు రైలులో కర్నూలు నుంచి గ్రామానికి బయలుదేరాడు. రాత్రి 12:00 గంటలకు రైలు మద్దికెరకు చేరుకుంది. తన పక్క సీటులో ఓ బాలుడు ఒంటరిగా ఉండడాన్ని గమనించి వివరాలు ఆరా తీశాడు. తన పేరు సురేష్‌గా చెప్పిన బాలుడు మిగతా వివరాలు కూడా తెలియజేశాడు. దీంతో ఇంటికి పిలుచుకువచ్చిన దుర్గన్న మరుసటి రోజు సోమవారం ఉదయం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాడు. బాలున్ని ప్రశ్నించిన పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన యాదయ్య, మూసమ్మ దంపతుల కుమారుడు సురేష్. మూసమ్మ చనిపోవడంతో తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కుమారుడు, కూతురు ఉంది. ప్రతిరోజు సవతి తల్లి వేధిస్తుండడంతో భరించలేక పారిపోయి వచ్చినట్లు బాలుడు తెలిపాడు. పోలీసులు బాలుడు సురేష్‌ను సంరక్షణ నిమిత్తం కర్నూలు చైల్డ్‌లైన్‌కు అప్పగించారు. -
సవతి తల్లికీ మనోవర్తి చెల్లించవలసిందే!
కేస్ స్టడీ భారతమ్మకు 60 సంవత్సరాలు. భర్త చనిపోయి మూడేళ్లయింది. చనిపోయేముందు ఆస్తిపంపకాలు చేసి, భార్య బాధ్యతను కొడుకులకు అప్పగించి వెళ్లాడామె భర్త. కొడుకులు భార్యను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారని ఆయన ప్రగాఢ నమ్మకం. అందుకే ఆమెకు చిల్లుగవ్వ కూడా ఇవ్వలేదు. దినవారాలు అయిన తర్వాత ముగ్గురు కొడుకులూ మూటాముల్లే సర్దుకుని ఎవరి ఊర్లకు వాళ్లు వెళ్లిపోయారు. పనిలో పనిగా వారికి తండ్రి రాసిచ్చిన పొలాలను అమ్మేసి సొమ్ము చేసుకున్నారు తల్లి కోర్టుకు వెళుతుందనే భయంతో. ఇంటిగలాయన రెండు నెలలు చూసీ చూడనట్లుండి, అద్దె బకాయి పడగానే, ఇల్లు ఖాళీ చేయమని గొడవ ప్రారంభించాడు. పాపం భారతమ్మ పరిస్థితి ఘోరమైంది. కొడుకులపై మెయిన్టెనెన్స్ కేసు వేయమని ఎవరో సలహా ఇచ్చారు. అది కొడుకుల చెవిన పడింది. అసలు భారతమ్మ తమ కన్నతల్లి కాదని, సవతి తల్లి అనీ అందుకని ఆమెకు ఆ ఆస్తిలో భాగం రాదని ఆమెను హెచ్చరించారు. కళ్లనీళ్ల పర్యంతమైంది భారతమ్మ. నిజమే, తాను వారి సవతి తల్లి. కానీ, వారి తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో వాళ్ల నాన్న రెండోపెళ్లి చేసుకున్నాడు తనను. అప్పటినుంచి వాళ్లే తమ బిడ్డలని కళ్లల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేసింది. తనకు పిల్లలు వద్దని కూడా నిర్ణయించుకుంది. మరి స్వార్థపరుడైన భర్తవల్ల, ఆమె అమాయకత్వం వల్ల ఈనాడు ఆమెకు ఈ గతి పట్టింది. అసలు చట్టం ఏమి చెబుతుందో అని ఒక స్వచ్ఛంద సంస్థకు చెందిన న్యాయవాదిని అడిగింది. ఆమె చెప్పిన విషయాలేమిటంటే... సవతి తల్లి కూడా సెక్షన్ 125 సిఆర్పీసీని అనుసరించి మనోవర్తి పొందవచ్చు. తమను తాము పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్న స్త్రీలకు పిల్లలకు, తలిదండ్రులకు న్యాయం అందాలనే ఉద్దేశ్యంతో ఈ నిబంధన ఏర్పరచడం జరిగింది. దీనిప్రకారం సవతి తల్లి కూడా అనాథగా మారకుండా చూడవలసిన బాధ్యత కొడుకుపై ఉంటుంది. అయితే సవతి తల్లి సవతి కొడుకు నుండి మనోవర్తి కోరేటప్పుడు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. 1. ఆమెకు వీరుగాక ఇతరత్రా ఎటువంటి సంతానం ఉండకూడదు. ఆమె విధవరాలు అయి ఉండాలి. భర్త జీవించి ఉంటే, అతడు పోషించలేని పరిస్థితుల్లో ఉండాలి. భారతమ్మకు ముగ్గురూ సవతి కొడుకులే. ముగ్గురినీ మనోవర్తి కేసులో పార్టీలుగా చేయవచ్చని తెలుసుకుని కేసు వేయడానికి సహాయపడమని ఆ న్యాయవాదిని వేడుకుంది భారతమ్మ. తప్పకుండా కేసు వేస్తామని, ఆమెను ఆదుకుంటామరని మాటిచ్చారు వాళ్లు. -
బొబ్బిలిలో మరో ప్రత్యూష
మానసిక వికలాంగురాలికి సవతి తల్లి వేధింపులు మరుగుదొడ్డి వద్ద ఉంచుతూ నిత్యం చిత్రవధ స్థానికులు ఫిర్యాదుతో కదిలిన ఐసీడీఎస్ అధికారులు బొబ్బిలి: తెలంగాణలో సవతి తల్లి వేధింపుల నుంచి బయటపడిన ప్రత్యూష పరిస్థితి ఇంకా కళ్ల ముందు కదలాడుతుండగానే ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలిలో అలాంటి సంఘటన వెలుగుచూసింది. బొబ్బిలి మున్సిపాలిటీలో బిల్ కలె క్టరుగా పనిచేస్తున్న కాంతారావుకు ముగ్గురు పిల్లలు. భార్య చారుమతిదేవి 2008లో మృతి చెందింది. తల్లితో రెండో కూతురు విజయలక్ష్మికి మంచి అనుబంధం ఉంది. అగ్రికల్చరల్ బీఎస్సీ పూర్తి చేసిన ఆమె, తల్లిలేని జీవితాన్ని ఊహించుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించడంతో మెడ నరాలు దెబ్బతిని మానసిక వికలాంగురాలైంది. భర్తలేని దేవి అనే మహిళను కాంతారావు మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. వీరి వద్దే విజయలక్ష్మి ఉంటోంది. సవతి తల్లి దేవి విజయలక్ష్మిని సరిగా చూడకపోవడమే కాకు ండా, మరుగుదొడ్డి వద్ద ఉంచి, అక్కడే తిండి పెట్టడం, నిత్యం కొడుతూ వేధిస్తుండడంతో స్థానికులు ఎప్పటికప్పుడు నిలదీసేవారు. ఇటీవల ప్రత్యూష ఘ టన వెలుగులోకి రావడంతో స్పందించిన స్థానికులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారమివ్వడంతో వారు చర్యలకు ఉపక్రమించారు. -
ప్రత్యూషకు రూ. 5 లక్షల చెక్కు సిద్ధం
- హైకోర్టుకు నివేదించిన తెలంగాణ ప్రభుత్వం - ఆమె పేరిట ఫిక్స్డ్ చేయాలని సూచించిన ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి చేతుల్లో తీవ్ర హింసకు గురైన ప్రత్యూషకు ఇవ్వాలని నిర్ణయించిన రూ.5 లక్షలను ఆమె పేర బ్యాంకు లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని హైకోర్టు గురువారం టీ సర్కార్‌ను ఆదేశించింది. ప్రత్యూష తల్లికి చెందిన ఇంటి అద్దె కూడా ఇకపై ఆమెకే దక్కేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. తండ్రికి వచ్చే జీతం నుంచి కొంత మొత్తాన్ని అందించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, ఈ విషయాలన్నింటిపై ఓ అఫిడవిట్‌ను తమ ముందుంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యూషను సవతి తల్లి తీవ్రంగా హింసించి, ఆమె చేత యాసిడ్ తదితర ప్రమాదకర రసాయనాలు తాగించినట్టు పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన పిటిషన్‌ను ధర్మాసనం గురువారం మళ్లీ విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.శరత్‌కుమార్ స్పందిస్తూ, ప్రత్యూషకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. ఐదు లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు సంబంధించిన చెక్కు సిద్ధంగా ఉందని, కోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు తగిన విధంగా వ్యవహరిస్తామన్నారు. రూ. ఐదు లక్షలను ప్రత్యూష పేర ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలన్న ధర్మాసనం, బాలికల రక్షణ కోసం ఇప్పుడున్న చట్టాలను సమర్ధవంతంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ వ్యాఖ్యానించింది. ప్రత్యూష కోసం ఏం చేయాలనుకుంటున్నారో వివరిస్తూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. -
చిన్నారులపై చిత్రహింసలు
సవతి తల్లి కర్కశత్వం * భరించలేక ఆత్మహత్యకు సిద్ధమైన ఇద్దరు చిన్నారులు మిరుదొడ్డి: పుస్తకాలు పట్టాల్సిన ఆ చిన్నారి చిట్టి చేతులు నీళ్ల బిందెలతో కాయలు కట్టాయి. కట్టెల కోసం ఆ చిన్నారి కాళ్లు అడవి బాట పట్టాయి. తిండిలేని నీరసం కడుపులో మంటలు రేపుతున్నా.. కూలిపనికి వెళ్లాల్సివచ్చిన ఆ చిన్నారి బాల్యం కంట నీరు దిగమింగుకుంది. కాలిలో దిగిన ముళ్లు బాధ పెడుతుంటే.. ఆటపాటల్లేని బాల్యం వెక్కిరిస్తుంటే.. తల్లిదండ్రుల ప్రేమకు నోచని బాధను తట్టుకోలేక.. చివరికి చావే శరణ్యమనుకునే దుస్థితికి వచ్చింది. కనికరం లేని సవతి తల్లి, బాధ్యత గుర్తెరగని తండ్రి ప్రవర్తనతో చిత్ర హింసలు అనుభవించిన కరుణాకర్ (12), చిట్టి (10) అనే ఇద్దరు అన్నాచెల్లెళ్ల దీన గాథ ఇది. వీరు మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన రాజలింగం, శ్యామల కుమారుడు, కుమార్తె. అక్కడి ప్రాథమికోన్నత పాఠశాలలో 7, 6 తరగతులు చదువుతున్నారు. శ్యామల అనారోగ్యం పాలవడంతో రాజలింగం పద్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి శ్యామల మరణించగా.. పద్మ ఈ చిన్నారులను చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టింది. తండ్రి ఆమెకే వంతపాడాడు. దీంతో మనసు చలించిన చిన్నారులు ఆత్మహత్యకు సిద్ధమయ్యారు. ఇది తెలిసిన పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు వారిని వారించి.. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. దీంతో డిప్యూటీ తహసీల్దార్ ఉమారాణి, ఎస్సై సతీష్, ఎంఈవో కనకయ్య పాఠశాలకు చేరుకుని తల్లిదండ్రులు, గ్రామస్తుల సమక్షంలో విచారణ చేపట్టారు. ఈ సమయంలో సవతి తల్లి పద్మ, తండ్రి రాజలింగం అధికారులపై ఊగిపోయారు. పిల్లలను కొట్టలేదని బుకాయించారు. అయితే చిన్నారులు తాము వారితో ఉండలేమంటూ స్పష్టం చేయడంతో పాటు, అధికారులు, గ్రామస్తులు కూడా వారిని అక్కడ ఉంచడం క్షేమకరం కాదని భావించి.. హాస్టళ్లకు తరలించారు. చిట్టిని మిరుదొడ్డిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో, 7వ తరగతి చదువుతున్న కరుణాకర్‌ను చెప్యాల-అల్వాల గురుకుల సాంఘిక పాఠశాల వసతి గృహంలో చేర్పించారు. కాగా.. చిన్నారులను చిత్ర హింసలకు గురి చేయడంతోపాటు అధికారులతో దురుసుగా ప్రవర్తించిన పద్మ, రాజలింగంలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని మిరుదొడ్డి ఎస్సై సతీశ్ తెలిపారు. సెలవు వచ్చిందంటే భయమే.. ‘‘మా తండ్రి రాజలింగం ఆటో నడుపుతుంటాడు. ఐదేళ్ల కింద మా అమ్మ శ్యామల అనారోగ్యంగా ఉన్నప్పుడు నాన్న సిద్దిపేటకు చెందిన పద్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజులకు మా అమ్మ చనిపోయింది. ఆ తర్వాత నుంచి సవతి తల్లి పద్మ మమ్మల్ని చిత్రహింసలు పెడుతోంది. పొద్దున లేవగానే నీళ్లు తీసుకురావాలి, పాచి పనులు చేయాలె. ఉదయం తిండి పెట్టదు. రోజూ కడుపు నిండ మంచి నీళ్లు తాగే బడికి వెళతాం. బడిలో పెట్టే మధ్యాహ్న భోజనమే మాకు దిక్కు. ఇక రాత్రి ఆమె తినగా మిగిలింది తినాలి. లేదంటే పస్తులుండాల్సిందే. రోజూ అడవికి వెళ్లి కట్టెలు తేవాలి. బీడీలు చేయాలి. లేదంటే దెబ్బలు తప్పవు. ఆదివారం గానీ, సెలవుగానీ వస్తే మాకు భయమే. సెలవు రోజుల్లో కూలీ పనులకు పంపుతుంది, వ చ్చిన డబ్బులు తీసుకుంటుంది. అన్నం కూడా సరిగ్గా పెట్టదు. ఇంట్లో డబ్బులు పోయాయని మాపై నిందలు వేసి చాలాసార్లు కట్టేసి కొట్టింది. మా నాన్న మమ్మల్ని సరిగా పట్టించుకోడు. సెలవులు వచ్చాయంటే సిద్దిపేటలోని గోదాములో కూలీ పనులు చేయిస్తాడు, జ్వరం వచ్చినా పట్టించుకోరు. పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వరు. రోజురోజుకు బాధలు ఎక్కువైతున్నయి. ఈ బాధలు తట్టుకోలేక ఇద్దరం చనిపోదామనుకున్నం. ఈ విషయం స్కూల్ హెడ్మాస్టర్ తెలుసుకుని.. ఊరివాళ్లకు చెప్పింది. అందరు కలిసి అధికారులకు చెప్పి, పిలిపించారు..’’ అని కరుణాకర్, చిట్టి వాపోయారు. -
నీకు నేనున్నా!
ప్రత్యూషతో సీఎం కేసీఆర్ * కష్టపడి చదివి పైకి రావాలమ్మా * ధైర్యంగా ఉండు.. ఇకపై నీ జోలికి ఎవరూ రారు సాక్షి, హైదరాబాద్: ‘‘జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి సపోర్టు దొరికింది. దీన్ని ఉపయోగించుకోవాలి. బాగా చదవాలి. పైకి రావాలి. నిన్ను బాధపెట్టిన వారికి నువ్వు వేసే శిక్ష అదే. ఇకపై నీ తెరువుకెవరూ రారు. ధైర్యంగా ఉండు. అన్నింటికీ నేనున్నా. ఎప్పుడైనా నా ఇంటికి రావొచ్చు.. పోవచ్చు. నాకు ఫోన్ చేయవచ్చు...’’ అని కన్నతండ్రి, సవతి తల్లి చేతిలో చిత్రహింసకు గురైన ప్రత్యూషకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. తీవ్ర గాయాలపాలై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ప్రత్యూషను ఇటీవలే సీఎం దంపతులు పరామర్శించిన సంగతి తెలిసిందే. కోలుకున్న తర్వాత తమ ఇంటికి రావాలని సీఎం ఆహ్వానించారు. దీంతో బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ప్రత్యూషను హైకోర్టులో హాజరుపరిచిన అధికారులు అక్కడ్నుంచి నేరుగా సీఎం ఇంటికి తీసుకొచ్చారు. సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ ఆమెను సాదరంగా ఆహ్వానించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యూషను సీఎం తనతో పాటు కూర్చోబెట్టుకొని భోజనం చేశారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ నేత పెద్ది సుదర్శన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యూషతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రత్యూష చదువు బాధ్యతంతా ప్రభుత్వమే భరించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కడియం శ్రీహరిని ఆదేశించారు. ప్రత్యూష చదువు, వసతి, ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు తెలుసుకొని అండగా ఉండాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్‌లను ఆదేశించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రత్యూషకు రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. బ్యాంకులో ఆమె పేరుతో అకౌంట్ తీసి ఆ డబ్బులు జమ చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత ఫోన్ నంబర్లు ప్రత్యూషకు ఇచ్చిన సీఎం.. తాను అండగా ఉన్నానన్న సంగతి మరవొద్దని చెప్పారు. అనంతరం ప్రత్యూషను కీసర మండలంలోని ఓ వసతి గృహానికి తరలించినట్లు తెలిసింది. -
సవతి తల్లి దాష్టీకం
మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదేళ్ల చిన్నారికి చిత్రహింసలు గట్టు: ఓ సవతి తల్లి దాష్టీకానికి ఐదేళ్ల చిన్నారి విలవిల్లాడింది. ఆమె పెట్టే చిత్రహింసలతో గాయాలపాలైన ఆ బాలిక ప్రస్తుతం ఆస్పత్రి పాలైంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా గట్టుకు చెందిన చిన్న మల్లేష్, శంకరమ్మలకు కుమారుడు వీరేష్, కూతురు జయలక్ష్మి (05)లు ఉన్నారు. భార్య శంకరమ్మ చనిపోవడంతో మల్లేష్ సుజాతను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కొడుకు వీరేష్, కుమార్తె జయలక్ష్మి (5)లను సుజాత కొన్నాళ్ల నుంచి చిత్రహింసలకు గురిచేస్తోంది. అయితే, స్థానికుల సహాయంతో వీరేష్‌ను కొన్నాళ్ల క్రితం హాస్టల్లో చేర్పించారు. జయలక్ష్మి మాత్రం సవతి తల్లి దగ్గరే ఉంటుంది. బుధవారం జయలక్ష్మి చెంపపై, నడుంపై కాలిన గాయాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతుండగా అంగన్వాడీ కేంద్రానికి చెందిన ఆయా ఆ బాలికను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం చేయించి, మళ్లీ అంగన్వాడీ కేంద్రానికి తీసుకెళ్లింది. అయితే బాలిక ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రికి చేరుకుంది. చీకటి పడినా ఆమె ఇంటికి వెళ్లడానికి నిరాకరిస్తూ ఆస్పత్రిలోనే ఉండిపోయింది. ఈ విషయమై అంగన్వాడీ వర్కర్లు, ఎస్ఐ రాంబాబు బాలిక పరిస్థితిపై ఆరా తీసి వివరాలు సేకరిం చారు. మెరుగైన వైద్యం అందించేందుకు గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు. -
సవతితల్లి చిత్రహింసలు
- రైల్‌విహార్ కాలనీలో యువతికి వేధింపులు - బాలల హక్కుల కమిషన్ చొరవతో వెలుగుచూసిన వైనం కుషాయిగూడ: మొన్న ప్రత్యూష..నిన్న భవాని..తాజాగా స్వప్న అనే యువతి సవతి తల్లి, తండ్రి వేధింపులతో ఇబ్బందులు పడుతున్న ఘటన మంగళవారం వెలుగుచూసింది. దీనిపై సమాచారం అందడంతో బాలలహక్కుల కమిషన్ సభ్యులు పోలీసులతో సహా ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రైల్‌విహార్ కాలనీకి చెందిన ఏఎస్ఎన్ బెనర్జీ రైల్వేలో పని చేసి రిటైర్ అయ్యారు. అతని మొదటి భార్య శకుంతల అనారోగ్యంతో 2008లో మృతి చెందింది. వీరికి హేమలత, స్వప్న ఇద్దరు సంతానం. పెద్ద కూతురు హేమలతకు బ్రహ్మం అనే వ్యక్తితో వివాహం జరిపించారు. చిన్న కూతురైన స్వప్న (28)ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో 2009లో బెనర్జీ, లక్ష్మి అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే గతకొంత కాలంగా సవతి తల్లి లక్ష్మి, తండ్రి బెనర్జీ స్వప్న శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నట్లు బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందడంతో కమిషన్ సభ్యులు అచ్యుతరావు ఆమె ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అయితే స్వప్న పోలీసుల వెంట వెళ్లేందుకు నిరాకరించడంతో వారు వెనుదిరిగారు. విచారణలో వాస్తవాలు వెలుగుచూస్తాయి: అచ్యుతరావు అనంతరం అచ్యుతరావు విలేకరులతో మాట్లాడుతూ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఆరోగ్యంగా ఉంటూ సరదాగా ఉండే స్వప్న గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆమెను నిర్లక్ష్యం చేసి, సరైన ఆహా రం ఇవ్వకుండా మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేశారని, పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూస్తాయన్నారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బాగా చూసుకుంటున్నాం : బెనర్జీ ( స్వప్న తండ్రి) కూతురు స్వప్నను మేము బాగా చూసుకుంటున్నాం. ఆరోగ్యంగా ఉండే నా కూతురు గత 10 ఏళ్లుగా మూర్చ వ్యాధితో బాధపడుతుంది. ఎవరో గిట్టనివారు మాపై ఫిర్యాదు చేశారు. ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఫిర్యాదు చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తాను. కాగా ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఇన్స్పెక్టర్ వెంకటరమణ తెలిపారు. -
ప్రత్యూష బాధ్యతలు నావే: సీఎం
-
ప్రత్యూష బాధ్యతలు నావే: సీఎం
నేడు సతీసమేతంగా పరామర్శించనున్న కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడిన ప్రత్యూష బాధ్యతలను పూర్తిగా స్వీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆమె ఆలనాపాలనా చూడటంతో పాటు చదువుకు అయ్యే ఖర్చునూ భరించాలని నిర్ణయించారు. మీడియాలో వచ్చిన ప్రత్యూష కథనాలు చూసి ఆయన చలించిపోయారు. అధికారుల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. తల్లిని కోల్పోయిన ప్రత్యూషను బంధువులు ఎవరూ చేరదీయకపోవడం పట్ల సీఎం ఆవేదన చెందారు. సవతి తల్లి, కన్నతండ్రి పెట్టిన చిత్రహింసలు భరిస్తూ ఆమె నరకం చూసిందంటూ శుక్రవారం ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రెండు రోజులుగా ప్రత్యూష దైన్యం తనకు తరచూ గుర్తుకొస్తోందన్నారు. ప్రత్యూషకు సంబంధించిన అన్ని విషయాలను ఇకపై ప్రభుత్వం తరపున తానే పర్యవేక్షిస్తానని చెప్పారు. సరూర్‌నగర్‌లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను శనివారం సీఎం కేసీఆర్ సతీసమేతంగా కలవనున్నారు. నేను అండగా ఉంటా: పోసాని ప్రత్యూష పరిస్థితి చూసి తన హృద్రయం ద్రవించిపోయిందని సినీనటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆమె సంరక్షణ బాధ్యతను చూసేందుకు ప్రభుత్వం, బంధువులెవరూ ముందుకు రాకపోతే...ఆ బాధ్యతను తాను తీసుకుంటానని శుక్రవారం ‘సాక్షి’కి చెప్పారు. కాగా, ప్రత్యూషను అక్కున చేర్చుకునేందుకు దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రి, ఆంధ్రమహిళా సభ సంస్థలు ముందుకు వచ్చాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రత్యూషకు హాస్టల్ వసతితో పాటు చదువుకునే అవకాశం కల్పిస్తామని ప్రకటించాయి. -
ప్రత్యూషకు నేతల అండ
ఆస్పత్రికి వచ్చి పరామర్శించిన ఎంపీ కవిత ఉచిత వైద్యం, విద్యతో పాటు ఉద్యోగం కల్పిస్తామని హామీ రూ. 20 వేలు అందజేసిన మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హైదరాబాద్: సవతి తల్లి పైశాచికత్వానికి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష (16) పై శుక్రవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి నేతలు స్పందించారు. అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను శనివారం రాత్రి నిజామాబాద్ ఎంపీ కవిత వచ్చి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలికకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. చదువుతో పాటు ఉద్యోగం కూడా కల్పిస్తుందని స్పష్టం చేశారు. చిత్రహింసల నుంచి బాలికను కాపాడిన బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అచ్యుతరావును ఆమె ఈ సందర్భంగా అభినందించారు. అలాగే, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు కూడా ఆస్పత్రికి వచ్చి సంఘటన జరిగిన తీరును ప్రత్యూషను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఉచితంగా వైద్య సేవలు అందించిన అవేర్ గ్లోబల్ ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యూషకు చేయవలసిన సహాయ, సహకారాలు త్వరలో అందిస్తామని చెప్పారు. ఎల్బీనగర్ వూజీ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రత్యూషను పరామర్శించి ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 20 వేలు, మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి రూ. 5 వేలను ఆస్పత్రి సీఈఓ వేమూరి విజయకుమార్‌కు అందజేశారు. ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, ఎల్బీ నగర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి ముద్దగోని రామ్మోహన్ గౌడ్ తదితరులు ప్రత్యూషను పరామర్శించారు. -
పిన్ని కాదు... పిశాచి
-
మమతను చంపి.. మానవత మరచి
♦ ఓ సవతి తల్లి పైశాచికం.... సహకరించిన తండ్రి ♦ ఏడాది పాటు యువతి గృహనిర్బంధం... ♦ బతికుండగానే నరకం చూపించిన వైనం.... ♦ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చొరవతో విముక్తి హైదరాబాద్ : మానవత్వం మరిచిపోయి తనలోని పైశాచికత్వాన్ని ఓ యువతిపై ప్రదర్శించి ప్రత్యక్ష నరకం చూపించింది ఆ సవతి తల్లి. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి సైతం కన్నకూతురిని బాధలు పెడ్తుంటే సహకరించడంతో ఓ యువతి ఏడాదిగా నరకం చూసింది. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు అచ్యుతరావు బుధవారం ఎల్బీనగర్ ఎస్ఐ నర్సింహారెడ్డి సాయంతో బాధితురాలు ఉంటున్న ఇంటిపై దాడి చేసి యువతికి విముక్తి కల్పించారు. పోలీసుల కథనం మేరకు చిప్ప రమేష్ నాగోలు బండ్లగూడ ఆనంద్‌నగర్‌లో నివాసముంటూ జూనియర్ టెలికం అధికారిగా పనిచేస్తున్నారు. 1991లో పుత్లీబౌలి ప్రాంతానికి చెందిన సరళాదేవితో అతనికి వివాహమైంది. వీరికి ప్రత్యూష జన్మించింది. భార్యాభర్తల మధ్య స్పర్థ్ధలు రావడంతో 2003లో విడిపోయారు. అనంతరం రమేష్ 2008లో సికిం ద్రాబాద్‌కు చెందిన చాముండేశ్వరి అలియాస్ శ్యామలను రెండో వివాహం చేసుకున్నారు. 2010లో మొదటి భార్య చనిపోవడంతో ప్రత్యూషను ఆమె కుటుంబీకులు మూసాపేటలోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పించారు.దీంతో మైనార్టీ తీరిన పాపను 2014లో తండ్రి రమేష్ తన ఇంటికి తీసుకొచ్చారు. ఇది నచ్చని అతని రెండో భార్య చాముండేశ్వరి అప్పటి నుంచి ప్రత్యూషను గృహనిర్బంధం చేసి చిత్రహింసలు పెడుతోంది. ఇనుప చువ్వలను కాల్చి వాతలు పెట్టేది. యువతి శరీరమంతా కత్తితో గాయపరిచింది.ఆమెతో బలవంతంగా టాయిలెట్లు శుభ్రపరిచే హార్పిక్, యాసిడ్, సర్ఫ్ వంటి వాటిని తాగించేది. ఆహారం కూడా సరిగా పెట్టకపోవడంతో ప్రత్యూష శారీరకం గా, మానసికంగా దయనీయస్థితికి చేరుకుంది. ఈ విషయాలన్నీ తెలిసినా తండ్రి రమేష్ భార్యకే వత్తాసు పలికేవాడు. ఇది ప్రత్యూషను మరింత కుంగదీసింది. ఏడాదిగా సాగిన ఈ అకృత్యాల వల్ల ప్రత్యూష నడవలేని, మాట్లాడలేని దుస్థితికి చేరింది. బాధలకు తాళలేక పలుమార్లు ఇంట్లో నుంచి పారిపోదామని యత్నించినా చాముండేశ్వరి చితకబాది అడ్డుకునేది. ఈ సమాచారం అందుకున్న బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు అచ్యుతరావు, ఎల్బీనగర్ పోలీసులు బుధవారం ఉదయం వారి ఇంటిపై దాడి చేసి ప్రత్యూషకు విముక్తి కల్పించారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రత్యూషపై లైంగిక దాడులు జరిగాయా... అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎల్బీనగర్ పోలీసులు చాముండేశ్వరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. తండ్రి రమేష్ కోసం గాలిస్తున్నా రు. వీరిపై హత్యాయత్నం, అక్రమ నిర్బంధం, తీవ్రంగా గాయపరిచినందుకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వేధించిన ఇద్దరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి: అచ్యుతరావు ప్రత్యూషను గృహ నిర్బంధం చేసి చిత్రహింసలకు గురిచేసిన తండ్రి రమేష్, మారుతల్లి చాముండేశ్వరిలపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యుడు అచ్యుతరావు పోలీసులను ఆదేశించారు. కాగా ప్రత్యూష ఎల్బీనగర్ అవేర్‌గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. దుస్తులు కూడా సరిగా లేవు. మందులు, ఆహారం, దుస్తులు అవసరం. సహాయం చేయదలిచిన దాతలు వస్తు రూపంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు నేరుగా అప్పగించవచ్చని, మరిన్ని వివరాలకు 9866342424 ఫోన్ నెంబర్‌కు సంప్రదించాలని అచ్యుతరావు తెలిపారు. -
పిన్ని కాదు పిశాచి!
-
సవతి తల్లి చేతిలో బాలుడి హతం
రెబ్బెన : తనకు పుట్టబోయే పిల్లల ఆస్తికి అడ్డుపడతాడేమో అనే దురుద్దేశంతో పసిపిల్లాడు అని కూడా చూడకుండా కన్న కొడుకు లాంటి బాలుడిని ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా హతం చేసిందో ప్రబుద్ధురాలు. మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన వివరాలివి.. రెబ్బెనకు చెందిన పిట్టల ప్రభాకర్ ఐకేపీ సీఏగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇతని మొదటి భార్య కీర్తన అనారోగ్యంతో ఐదేళ్ల క్రితం చనిపోయింది. వీరికి కుమారుడు జయసూర్య (6) ఉన్నా డు. ఈ క్రమంలోనే ఆరు నెలల క్రితం ప్రభాకర్ వేమనపల్లి మండలం బొమ్మ న గ్రామానికి చెందిన సునీతను రెండో వివాహం చేసుకున్నాడు. ఈనెల 16న ప్రభాకర్ పనినిమిత్తం మం చిర్యాలకు వెళ్లగా.. అతని తల్లి రాజమ్మ ఉపాధిహామీ పని కోసం వెళ్లింది. ఈ క్రమంలోనే తమ ఆస్తి అంతా జయసూర్యకే దక్కుతుందని, తనకు పుట్టబోయే పిల్లలకు ఏమీ రాదనే దురుద్దేశంతో మానవత్వాన్ని మరిచి జయసూర్య ముక్కు, నోరు మూసి ఊపిరి ఆడకుండా చేసి అంతమొందించింది. ఆపై తనకేమీ తెలియదన్నట్లు ఉండిపోయింది. మంచిర్యాల నుంచి ఇంటికి వచ్చిన ప్రభాకర్‌కు జయసూర్య బాత్రూంలో పడిపోయి మృతి చెందాడని చెప్పి నమ్మించింది. నిజ మని నమ్మిన ప్రభాకర్‌తోపాటు అతని తల్లి శుక్రవారం జయసూర్యకు అంతక్రియలు నిర్వహించారు. విషయం బయటపడింది ఇలా.. బాలుడిని అంతమొందించిన సునీత ప్రవర్తనలో అనుమానం రావడంతో భర్త ప్రభాకర్‌తోపాటు బంధువులు శనివారం ఉదయం నిలదీశారు. దీంతో జయసూర్యను తానే ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు ఒప్పుకుంది. భవిష్యత్తులో తనకు పుట్టబోయే పిల్లల ఆస్తికి జయసూర్య అడ్డుతగులుతాడనే ఉద్దేశంతోనే ఈ హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో ప్రభాకర్ ఫిర్యాదు మేరకు సునీతపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై మేరాజొద్దీన్ తెలిపారు. -
అన్నం పెట్టదు.. అట్లకాడతో కాల్చేది
చిట్టి తల్లికి ఎంతకష్టమొచ్చిందో.. ఐదేళ్ల వయసు. అల్లారు ముద్దుగా సాగాల్సిన బాల్యం. అయితే విధి ఆ పాపపై విషం చిమ్మింది. మూడేళ్ల క్రితం తల్లి తనువుచాలించింది. ప్రేమ పంచాల్సిన సవతితల్లి మానసికంగా.. శారీరకంగా వేధించింది. ఆ బాధలను మంగళవారం మేజిస్ట్రేట్ ముందు చెమ్మగిల్లిన కళ్లతో చెప్పుకుంది చిన్నారి. శరీరంపై ఒక్కొక్క గాయం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటూ చివురుటాకులా వణికిపోయింది. ఒంగోలు టౌన్ : ‘అన్నం సరిగా పెట్టదు.. అడిగితే కొట్టేది.. సంక్రాంతి పండుగ రోజు అట్లకాడతో చెయ్యి కాల్చింది. ఒకసారి తలపై కర్రతో కొడితే రక్తమొచ్చింది. బుగ్గ మీద కర్రతో కొడితే ఎర్రగా కందిపోయింది. నేను ఇంటికి వెళ్లను.. ఇక్కడే ఉంటాను.’ అని ఒంగోలు నగరంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన ఐదేళ్ల చిన్నారి మహేశ్వరి చెమ్మగిల్లిన కళ్లతో చెప్పిన మాటలివి. సవతి తల్లి చిత్ర హింసలకు గురవుతున్న చిన్నారి గురించి పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి చలించిపోయిన జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ జె.శ్రావణ్‌కుమార్ మంగళవారం సాయంత్రం స్వయంగా స్థానిక బాలసదన్‌కు వెళ్లి ఆ చిన్నారితో మాట్లాడారు. చిన్నారి శరీరంపై ఉన్న గాయాల గురించి ఒకటొకటిగా అడిగారు. ఆ గాయాల తాలూకు చేదు జ్ఞాపకాలను చిన్నారి అమాయకంగా చెబుతుంటే మేజిస్ట్రేట్ చలించిపోయారు. ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావుకు ఫోన్‌చేసి వెంటనే బాలసదన్‌కు రావాలని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించి చిన్నారి తండ్రి, సవతి తల్లిని అరెస్టు చేయాలని ఆదేశించారు. మేజిస్ట్రేట్ వెంట చైల్డ్‌లైన్ (1098) ప్రతినిధి బీవీ సాగర్, మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ కె.లీలావతి, ఐసీడీఎస్ డీసీపీవో ఎన్.జ్యోతి సుప్రియ తదితరులు ఉన్నారు. -
చిన్నారికి ఎంత కష్టం
అభం, శుభం తెలియని చిన్నారి...తిట్టినా, కొట్టినా, ఏమి చేసినా ప్రశ్నించలేని పసి మనసు... కన్నీళ్లే తప్ప కోపం ఎరుగని ఐదారేళ్ల వయసు... కన్ను తెరిచిన రెండేళ్లకే కన్న తల్లి కన్నుమూసింది... పినతల్లే పెద్ద దిక్కయింది... పెంచిన ప్రేమే గొప్పదనే ఆర్యోక్తికి తూట్లు పొడిచింది... లేలేత శరీరానికి చిత్ర హింసలు పెట్టింది సున్నిత ప్రదేశాలపై కారంపొడి చల్లి తన కర్కశ హృదయాన్ని చాటుకుంది... - చిన్నారిపై సవతి తల్లి వేధింపులు - స్థానికుల ఫిర్యాదుతో పోలీసుల రంగప్రవేశం ఒంగోలు క్రైం: అభం.. శుభం.. తెలియని ఐదేళ్ల చిన్నారిపై సవతి తల్లి వేధింపులు ఎక్కువయ్యాయి. ఆ పాపను వేధిస్తున్న తీరును గమనించిన పరిసర ప్రాంతాల వారు తాలూకా పోలీసులు, చైల్డ్‌లైన్ ప్రతినిధులకు సోమవారం ఫోన్ చేసి చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన చైల్డ్‌లైన్ ప్రతినిధులు నగరంలో సమతానగర్‌లో ఉన్న శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఐదేళ్ల ఆ పాప ఇంటికి వెళ్లారు. ఆ పాపను, సవతి తల్లిని, కుటుంబ సభ్యులను తాలూకా పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. సమాచారం తెలుసుకున్న శ్రీనగర్ కాలనీ వాసులు అధిక మొత్తంలో తాలూకా పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. శ్రీనగర్ కాలనీలో ఉంటున్న ఐదేళ్ల ఆ పాప తల్లి భవాని మూడేళ్ల క్రితం మృతి చెందింది. అయితే ఆ పాప తండ్రి శ్రీనివాసులు పరమేశ్వరి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. పాప స్థానిక అంగన్వాడీలో చదువుకుంటోంది. అయితే సవతితల్లి పరమేశ్వరి తరచూ పాపను చిత్రహింసలు పెడుతూ ఉండేది. రోజూ కొట్టడం, తిట్టడం లాంటివి నిత్యకృత్యంగా మారాయి. సోమవారం కారం తీసుకొని చెప్పరాని చోటల్లా పోస్తానని బెదిరించింది. కారం పోసేందుకు కూడా ప్రయత్నించింది. ఈ లోగా పరిసర ప్రాంతాల వారు చూసి పోలీసులకు చెప్పటంతో సవతి తల్లితో పాటు పాపను స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆ పాపను చైల్డ్‌లైన్ ప్రతినిధులు బీవీ సాగర్, ఎం.కిశోర్‌కుమార్, దేవకుమారి బాలల సంక్షేమ కమిటీ సభ్యుల ముందు సోమవారం రాత్రి హాజరుపరిచారు. దీంతో వారి ఆదేశాల మేరకు ఆ పాపను బాలసదన్‌కు తరలించారు. -
మా డాడ్స్ వైఫ్!
స్టెప్ మదర్ శ్రీదేవి గురించి ఇప్పటి వరకూ ఎక్కడా మాట్లాడని హీరో అర్జున్‌కపూర్ తొలిసారి పెదవి విప్పాడు. ‘కాఫీ విత్ కరణ్ జోహార్’లో అటుతిరిగి ఇటు తిరిగి టాపిక్ అతని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. శ్రీదేవితో తన పంథా ఎప్పటికీ మారదన్నాడు. ఆమె ఎప్పటికీ తన తండ్రి భార్యేనని... తనకు తల్లి కాబోదని తెగేసి చెప్పేశాడు. వారితో కలసి జీవించే ప్రసక్తే లేదన్నాడు. ‘మా అమ్మ మోనా ఎవర్నీ కించపరిచేలా ప్రవర్తించవద్దని ఎప్పుడూ చెబుతూ ఉండేది. అందుకే శ్రీదేవిని ఎప్పుడూ అగౌరవ పరచేలా మాట్లాడలేదు’ అన్నాడు అర్జున్. అలాగని శ్రీతో తనకెలాంటీ విభేదాలూ లేవన్నాడు. -
బాలిక పై కిరోసిన్ పోసి నిప్పంటించిన సవతి తల్లి