మైఖేల్ జాక్సన్, లియో బ్లాంకో
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా..? అయ్యో అదేం ప్రశ్న ఆ మాత్రం తెలియదా.. మైఖేల్ జాక్సన్ కదా.. ఆయనో కింగ్ ఆఫ్ పాప్.. అంటూ స్టార్ట్ చేయకండి. ఆయన మైఖేల్ జాక్సన్ అనుకుంటే.. మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అది మైఖేల్ జాక్సన్ ఫొటో కాదు. అతడి పేరు లియో బ్లాంకో. వయసు 22 ఏళ్లు. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌కు చెందిన వ్యక్తి. మరేంటి అచ్చు మైఖేల్ జాక్సన్ లాగే ఉన్నాడు అనుకుంటున్నారా..? అవును అలాగే ఉన్నాడు. కానీ అలా కనిపించేందుకు ఏడేళ్లుగా బీభత్సమైన ప్లాస్లిక్ సర్జరీలు చేయించుకున్నాడట మనోడు.
అందుకోసం దాదాపు రూ.22 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడట. 11 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడట. అయితే ఇంకా పర్‌ఫెక్ట్‌గా జాక్సన్‌లాగా కనిపించాలని ఇంకా కొన్ని సర్జరీలు చేయించుకుంటానని చెబుతున్నాడు. బ్లాంకో తల్లి మాట్లాడుతూ.. ఒక్కోసారి తానే గుర్తుపట్టలేక ఆశ్చర్చపోతానని, తన కొడుకు చివరికి ఏమైపోతాడోనని చాలా ఆందోళనగా ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment