![Michael Jackson Predicted Coronavirus Like Pandemic Will Ruin World Says Ex Bodyguard - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/26/mickel.jpg.webp?itok=WOc1FITF)
మైకేల్ జాక్సన్ (ఫైల్)
లాస్ ఏంజిల్స్ : కరోనా వైరస్‌లాంటి మహమ్మారి ప్రపంచాన్ని నాశనం చేయబోతోందని కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్ ముందే ఊహించారా? తను బ్రతికున్నంత కాలం వైరస్‌ల బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్త పడ్డారా?... అవునని అంటున్నాడు ఆయన దగ్గర దశాబ్దకాలం పనిచేసిన బాడీగార్డ్ మ్యాట్ ఫిడ్డెస్. కరోనా కారణంగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై స్పందించిన మ్యాట్ ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో.. ‘ కరోనాలాంటి మహమ్మారి ప్రమాదం ఉందని మైకేల్ జాక్సన్ ముందుగానే భావించారు. ఏదో ఒకరోజు ప్రమాదకర సూక్ష్మ జీవుల బారిన పడి ప్రపంచం తుడిచిపెట్టుకుపోతుందని చెప్పేవారు. అందుకే ఎల్లప్పుడు ఫేస్‌మాస్క్, గ్లౌజులు ధరించేవారు. ‘మ్యాట్ నేను అనారోగ్యానికి గురికాను. నా అభిమానులను నిరాశపర్చను. ( కోవిడ్: నిమిషాల్లోనే నిర్ధారణ! )
నాకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఓ కారణంమీదే నేను ఈ భూమిపై జన్మించాను. నేను నా గొంతును పాడుచేసుకోదల్చుకోలేదు. ప్రతినిత్యం ఎలాంటి వారు ఎదురుపడతారో.. ఎలాంటివాటిని నేను దాటుకెళుతానో తెలియద’ని చెప్పేవారు. ఆయన బ్రతికుంటే ఏం చెప్పేవారో అదే నేను చెబుతున్నాను. ఇలాంటి మాటలు చెప్పినపుడు ఆయన చుట్టూ ఉండేవారు పెద్ద సీరియస్‌గా తీసుకునేవారు కాదు.. ఎగతాళి చేసేవార’ని చెప్పారు. ( అమల్లో ఉంది లాక్‌డౌనా, కర్ఫ్యూనా? )
Comments
Please login to add a commentAdd a comment