మైఖెల్ జాక్సన్ బెస్ట్ ఫ్రెండ్ కన్నుమూత | Michu Meszaros, who played the alien ALF, dies at 76 | Sakshi
Sakshi News home page

మైఖెల్ జాక్సన్ బెస్ట్ ఫ్రెండ్ కన్నుమూత

Published Tue, Jun 14 2016 2:19 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

మైఖెల్ జాక్సన్ బెస్ట్ ఫ్రెండ్ కన్నుమూత - Sakshi

మైఖెల్ జాక్సన్ బెస్ట్ ఫ్రెండ్ కన్నుమూత

లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటుడు, సర్కస్ ప్రదర్శన కళాకారుడు మిచ్చు మెస్జారోస్(76) కన్నుమూశారు. ఒకప్పుడు ఎలియన్ వంటి పాత్రలో సైతం మైమరిపించిన ఆయన గత కొద్ది రోజులుగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చనిపోయారు. కాలిఫోర్నియాలోని టోరేన్స్ లోగల మేరీ మెడికల్ సెంటర్ లో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఆయన సహాయకుడు తెలిపారు.

కుక్కలాంటి కాస్ట్యూమ్స్ ధరించి చేసిన పలు పాత్రలకు ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. బుడాపెస్ట్లో జన్మించిన మిచు తన పద్నాలుగేళ్ల వయసులో సర్కస్ చేయడం ప్రారంభించారు. అనంతరం బైలీ సర్కస్ లో 1973లో చేరాడు.మైఖెల్ జాక్సన్ కూడా ఇతడి ప్రదర్శనను చూసి అబ్బురపడిపోయి బెస్ట్ ఫ్రెండ్ గా మార్చుకున్నాడు. పలుసార్లు వారిద్దరు కూర్చొని సాఫ్ట్ డ్రింక్ కూడా తాగరంట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement