నెటిజన్లపై మైఖెల్ జాక్సన్ కూతురు కన్నెర్ర | Paris Jackson slams critics | Sakshi
Sakshi News home page

నెటిజన్లపై మైఖెల్ జాక్సన్ కూతురు కన్నెర్ర

Published Wed, Jun 22 2016 12:58 PM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

నెటిజన్లపై మైఖెల్ జాక్సన్ కూతురు కన్నెర్ర

నెటిజన్లపై మైఖెల్ జాక్సన్ కూతురు కన్నెర్ర

లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ రాక్ స్టార్, పాప్ సింగర్ మైఖెల్ జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్(18) నెటిజన్లపై మండిపడింది. ఫాదర్స్ డే రోజు ఆమె కనీసం ఒక్క పోస్ట్కూడా పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లపై గుడ్లెర్రజేసింది. అది మీకు అంతముఖ్యమైన విషయమా.. అసలు మీకేంటి సంబంధం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఫాదర్స్ డే జరిగిన విషయం తెలిసిందే.

అయితే, ఆరోజు ఎంతోమంది తమ ఫాదర్స్కు శుభాకాంక్షలు చెబుతూ సామాజిక అనుసంధాన వేదికల్లో పోస్ట్ చేయగా ప్రఖ్యాతిగాంచిన మైఖెల్ జాక్సన్ ను ఉద్దేశించి ఆయన కూతురు ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. దీంతో పలువురు ఆమెను విమర్శించారు. ఆ విమర్శ చూసి ఆగ్రహంతో ఊగిపోయిన పారిస్ 'ఒక సెలవు దినం (ఫాదర్స్ డే) సందర్భంగా ఆన్లైన్ లో పోస్ట్ చేస్తూ ఒకరిని వేధించాలని మీరు అనుకుంటే.. ముందు అసలు అది మీరు చేయాల్సిన పనేనా కాదా అని మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. దురదృష్టం కొద్ది నెగిటివ్ థింగ్సే ఎక్కువగా ప్రచారం అవుతాయి' అని చెప్పింది. మైఖెల్ చనిపోయినప్పుడు పారిస్ వయసు పదకొండేళ్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement