paris jackson
-
స్త్రీలోక సంచారం
మైఖేల్ జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్ మీద మనసు పారేసుకుని నిరంతరం ఆమెను వెంబడిస్తూ, ఓసారైతే.. ఆమె దర్శనం కోసం ఆమె రికార్డింగ్ స్టూడియో బయట పదిహేను గంటలపాటు వేచివున్న నికోలాస్ లీవైజ్ స్టీవెన్స్ అనే ఆగంతకుడిని మళ్లీ వచ్చే వాయిదా వరకు ఆమెకు కనీసం 91.44 మీటర్ల దూరంలో ఉండాలని కోర్టు ఆదేశించింది. పారిస్ జాక్సన్‌ను వెంబడించడమే కాక, ఆమె ఫొటోను ట్విట్టర్లో పెట్టి, ‘ఈమె నా ఆత్మసఖి’ అని నికోలాస్ కామెంట్ పెట్టడంతో భయపడిన పారిస్, అతడి నుంచి తనకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించారు ::: కోల్‌కతా నుంచి వస్తున్న ప్రముఖ గాయని సొమెరిటా మల్లిక్ ఈ నెల 14 సాయంత్రం 5 గంటలకు బంజారాహిల్స్ రోడ్ నెం.1 లోని ‘జీవీకే వన్’ మాల్కి ఎదురుగా ఉన్న ‘లామకాన్’లో తన సంగీత విభావరితో అలరించనున్నారు. రవీంద్రనాథ్ టాగోర్, ఖాజీ నజ్రూల్ ఇస్లాంల శ్రావ్యగీతాలకు తన గాత్రంలోని మాధుర్యాన్ని రంగరించి శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చెయ్యడానికి సంసిద్ధురాలైన మీదటే ఆమె హైదారాబాద్ వస్తున్నారు. అమెరికన్ రియాలిటీ టెలివిజన్ పర్సనాలిటీ, మోడల్, ఆంట్రప్రెన్యూర్, సోషలైట్.. కైలీ జెన్నర్ అత్యంత ప్రమాదకరమైన ‘లిప్ చాలెంజ్’ని సోషల్ మీడియా మీదకు విసిరారు. చిన్న మూతి గల గాజు గ్లాసులలో, సీసాలలో పెదవులను చొప్పించి, వాటిని ఉబ్బించడమనే ఈ సాహసం విఫలమైతే పెదవులలోని రక్తనాళాలు ఉబ్బి, పెదవులు చిట్టి, రక్తం కారడమే కాకుండా, ఆ గాయం మానడానికి చాలా సమయం పడుతుంది కాబట్టే అదొక ప్రాణాంతకమైన సవాలుగా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇరవై ఏళ్లకే తల్లి అయిన కైలీ జెన్నర్.. ఇంకా నడకైనా రాని తన ఐదు నెలల కూతురి కోసం 22 వేల డాలర్ల (15 లక్షల 17 వేల రూపాయలు) ఖరీదైన చెప్పుల్ని కొనడం కూడా మరొక విశేషం. ::: రాంచీలో ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ నేతృత్వంలోని ‘నిర్మల్ హృదయ్’ హోమ్‌లో ఉంటున్న నన్.. సిస్టర్ కన్సీలియాను, అనిమా ఇంద్వార్ అనే ఒక సహాయకురాలిని పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. హోమ్‌లోని ‘అవివాహిత తల్లుల వార్డు’కు పర్యవేక్షకురాలిగా ఉన్న సిస్టర్ కన్సీలియా.. హోమ్‌లో పుట్టిన ఒక శిశువును విక్రయించారన్న ఆరోపణలపై ఆమెతో పాటు, ఆమె సహాయకురాలిపై కేసు నమోదు అయింది ::: అమెరికాలో పుట్టిన స్విస్ సూపర్‌స్టార్ గాయని, గేయ రచయిత్రి, డాన్సర్, నటి, కథకురాలు 78 ఏళ్ల టీనా టర్నర్.. పుత్ర శోకంలో మునిగిపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా లాజ్ ఏంజెల్స్‌లో ప్రసిద్ధుడైన టీనా 59 ఏళ్ల కుమారుడు క్రెయిగ్ రేమండ్ దేహంలో బులెట్ దిగిన గాయం ఉండడంతో అతడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. లాస్ వెగాస్‌లో ‘సూపర్ ఈటర్’గా ప్రఖ్యాతురాలైన మికీ సుడో అనే యువతి వరుసగా ఐదో ఏడాది కూడా ఆహార పోటీలలో విజేతగా నిలిచారు. ప్రసిద్ధ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ల గొలుసు సంస్థ ‘నథాన్స్ ఫేమస్’ అమెరికా స్వాతంత్య్ర దినం అయిన జూలై 4న ఏటా నిర్వహించే ఈ ఈటింగ్ పోటీలలో ఈ ఏడాది.. పది నిముషాలలో 37 హాట్‌డాగ్స్, బన్స్ తిని టాప్ ప్రైజ్ గెలుచుకున్న మికీ సుడో గత ఏడాది 41 హాట్ డాగ్స్ లాగించారు ::: ప్రసిద్ధ వినియోగ వస్తూత్పత్తుల బహుళజాతి సంస్థ ‘యూనీలివర్’ చీఫ్ హెచ్.ఆర్. ఆఫీసర్ లీనా నాయర్ (49) నేతృత్వంలో ఆ కంపెనీ.. సామాజిక ప్రయోజనం కోసం ‘డిఫరబిలిటీ’ అనే డిజేబిలీటి కార్యక్రమాన్ని భారతదేశంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించబోతోంది. లీనా యూనీలివర్‌కు తొలి మహిళా చీఫ్ హెచ్.ఆర్. మాత్రమే కాదు, అతి చిన్న వయసులో ఈ స్థాయికి చేరుకున్న మహిళ కూడా ::: ట్రంప్ ‘జీరో టాలరెన్స్’ పాలసీలో భాగంగా అక్రమ వలసల నిఘా అధికారులు తల్లిదండ్రుల నుంచి వేరు చేసి నిర్బంధ శిబిరాలలో ఉంచిన బాలల సంఖ్య సుమారు మూడు వేల వరకు ఉందని తాజాగా ప్రకటించిన యు.ఎస్. హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్.. తొమ్మిది రోజుల క్రితం విడుదల చేసిన నివేదికలో ఆ సంఖ్య రెండు వేలు మాత్రమే ఉండడాన్ని బట్టి చూస్తే తల్లుల్నుంచి, పిల్లల్ని వేరు చేసే కార్యక్రమం మరింత ముమ్మరం అయిందని తెలుస్తోంది. (నిర్బంధ శిబిరం నుంచి 61 రోజుల తర్వాత విడుదలైన బిడ్డ, తన తల్లిని కలుసుకున్న దృశ్యాన్ని ‘తల్లీబిడ్డ’ అనే ఫొటోలో చూడవచ్చు). -
నా దృష్టిలో నగ్నంగా ఉండటం ప్రకృతి: నటి
లాస్ ఎంజెల్స్: అప్పుడప్పుడు తాను దిగంబరంగా ఫొటోలకు పోజులివ్వడాన్ని ప్రముఖ హాలీవుడ్ యువనటి, దివంగత స్టార్ పాప్ డ్యాన్సర్ మైకెల్ జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్(19) సమర్థించుకుంది. నగ్నత్వాన్ని లైంగికంగా చూడొద్దంటూ హితవు పలికింది. ఇటీవల తన సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రమ్‌లో టాప్ లెస్‌గా ఓ సొఫాలో కూర్చుని సిగరెట్ తాగుతున్న ఫొటో పంచుకోవడంపట్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శించారు. తండ్రి పరువు తీస్తోందంటూ కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలో స్పందించిన పారిస్ జాక్సన్ ‘నన్ను, నా తీరును ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారికి మరోసారి స్పష్టంగా చెబుతున్నాను. తిరిగి ప్రకృతితో కలిసిపోయే ఒక ఉద్యమంలాగా నగ్నత్వం ప్రారంభమైంది. ఇదొక స్వేచ్చా స్వాతంత్ర్యానికి అభివ్యక్తీకరించే చర్య, ఆరోగ్యంగా ఉండటం, ఇంకా చెప్పాలంటే ఇదొక ఫిలాసపీ.. ఏదీ మనల్ని మనుషులుగా తీర్చిదిద్దిందో అందులో నగ్నంగా ఉండటమనేది ఒక భాగం. ప్రత్యేకంగా నాకు సంబంధించి ఇది చాలా అందమైనది. మీ దేహాన్ని ఒక ఆలయంలాగా ఉంచుకోవడం కాదు.. దాన్ని పూజించాలి కూడా. ఒక యువతి తనను తాను తనకు నచ్చినదారిలో వ్యక్తీకరించుకోవడం ఫెమినిజంలో భాగం’ అని కూడా ఆమె రాసుకొచ్చింది. -
బాలీవుడ్లో మైకేల్ జాక్సాన్ కూతురు
ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హాలీవుడ్ నటులు కనిపించారు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్లో బాలీవుడ్ సినిమాలో నటించనుంది. ఇప్పటికే పారిస్‌ను సంప్రదించిన మూవీ టీం ఆమె అంగీకారం పొందారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. బాలీవుడ్ బ్యూటి రిచా ఛడ్డా, పాకిస్తానీ నటుడు అలీ ఫజల్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమాలో పారిస్ జాక్సన్ కీలక పాత్రలో నటించనుంది. ప్రధానంగా ఇంగ్లీష్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను భారతీయ సినిమాగానే తెరకెక్కిస్తున్నారు. పారిస్ జాక్సన్‌కు జంటగా ఓ హాలీవుడ్ నటుణ్ని సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
‘మా నాన్నది హత్యే.. నన్ను కూడా చంపేస్తారు’
న్యూయార్క్: తన తండ్రి ప్రముఖ, అమెరికన్ పాప్ సింగర్, గ్రేట్ డ్యాన్సర్ మైఖెల్ జాక్సన్‌ను చంపేశారని ఆయన కూతురు ప్యారిస్ జాక్సన్ ఆరోపించారు. 2009లో తన తండ్రి చనిపోయిన సమయంలో జరిగిన పరిణామాలన్నీ కూడా ఒక సెటప్ అని, ఆ రోజు ఓ కట్టుకథ చెప్పి తన నోరు మూయించారని అన్నారు. ఆమె తొలిసారి ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా భావోద్వేగానికి లోనవుతూ ఈ విషయం చెప్పారు. శక్తిమంతమైన అనాస్తెటిక్ ప్రొపొఫోల్ ఓవర్ డోస్‌గా తీసుకోవడంవల్లే మైఖెల్ జాక్సన్ చనిపోయాడని ఇప్పటివరకు అందరికీ తెలిసిన విషయం. అయితే, ఉద్దేశ పూర్వకంగానే జాక్సన్ వైద్యుడు అతి డోస్ ఉండే మాత్రలు ఇచ్చి ఆయన చావుకు కారణమయ్యారని కేసులు నమోదు చేశారు. కానీ, జాక్సన్ కూతురు ప్యారిస్ జాక్సన్ మాత్రం జనాలను తప్పుదోవ పట్టించేందుకు అలా ఓవర్ డోస్ అంటూ చెప్పారని, వాస్తవానికి తన తండ్రిని చంపేశారని, తనను కూడా ఏదో ఒకరోజు హత్య చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ మాత్రం అనుమానం లేకుండా తన తండ్రి హత్యకు గురయ్యాడని, ఇదంతా కూడా ఒక పెద్ద కుట్ర అని.. జాక్సన్ కుటుంబ సభ్యులకు ఆయన అభిమానులకు ఈ విషయాలు తెలుసని, ఆరోజు జరిగిందంతా కూడా ఓ సెటప్ అని స్పష్టం చేశారు. -
నెటిజన్లపై మైఖెల్ జాక్సన్ కూతురు కన్నెర్ర
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ రాక్ స్టార్, పాప్ సింగర్ మైఖెల్ జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్(18) నెటిజన్లపై మండిపడింది. ఫాదర్స్ డే రోజు ఆమె కనీసం ఒక్క పోస్ట్‌కూడా పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లపై గుడ్లెర్రజేసింది. అది మీకు అంతముఖ్యమైన విషయమా.. అసలు మీకేంటి సంబంధం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఫాదర్స్ డే జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఆరోజు ఎంతోమంది తమ ఫాదర్స్‌కు శుభాకాంక్షలు చెబుతూ సామాజిక అనుసంధాన వేదికల్లో పోస్ట్ చేయగా ప్రఖ్యాతిగాంచిన మైఖెల్ జాక్సన్ ను ఉద్దేశించి ఆయన కూతురు ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. దీంతో పలువురు ఆమెను విమర్శించారు. ఆ విమర్శ చూసి ఆగ్రహంతో ఊగిపోయిన పారిస్ 'ఒక సెలవు దినం (ఫాదర్స్ డే) సందర్భంగా ఆన్లైన్ లో పోస్ట్ చేస్తూ ఒకరిని వేధించాలని మీరు అనుకుంటే.. ముందు అసలు అది మీరు చేయాల్సిన పనేనా కాదా అని మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. దురదృష్టం కొద్ది నెగిటివ్ థింగ్సే ఎక్కువగా ప్రచారం అవుతాయి' అని చెప్పింది. మైఖెల్ చనిపోయినప్పుడు పారిస్ వయసు పదకొండేళ్లు.