నా దృష్టిలో నగ్నంగా ఉండటం ప్రకృతి: నటి
లాస్ ఎంజెల్స్: అప్పుడప్పుడు తాను దిగంబరంగా ఫొటోలకు పోజులివ్వడాన్ని ప్రముఖ హాలీవుడ్ యువనటి, దివంగత స్టార్ పాప్ డ్యాన్సర్ మైకెల్ జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్(19) సమర్థించుకుంది. నగ్నత్వాన్ని లైంగికంగా చూడొద్దంటూ హితవు పలికింది. ఇటీవల తన సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రమ్‌లో టాప్ లెస్‌గా ఓ సొఫాలో కూర్చుని సిగరెట్ తాగుతున్న ఫొటో పంచుకోవడంపట్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శించారు. తండ్రి పరువు తీస్తోందంటూ కూడా విమర్శించారు.
ఈ నేపథ్యంలో స్పందించిన పారిస్ జాక్సన్ ‘నన్ను, నా తీరును ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారికి మరోసారి స్పష్టంగా చెబుతున్నాను. తిరిగి ప్రకృతితో కలిసిపోయే ఒక ఉద్యమంలాగా నగ్నత్వం ప్రారంభమైంది. ఇదొక స్వేచ్చా స్వాతంత్ర్యానికి అభివ్యక్తీకరించే చర్య, ఆరోగ్యంగా ఉండటం, ఇంకా చెప్పాలంటే ఇదొక ఫిలాసపీ.. ఏదీ మనల్ని మనుషులుగా తీర్చిదిద్దిందో అందులో నగ్నంగా ఉండటమనేది ఒక భాగం. ప్రత్యేకంగా నాకు సంబంధించి ఇది చాలా అందమైనది. మీ దేహాన్ని ఒక ఆలయంలాగా ఉంచుకోవడం కాదు.. దాన్ని పూజించాలి కూడా. ఒక యువతి తనను తాను తనకు నచ్చినదారిలో వ్యక్తీకరించుకోవడం ఫెమినిజంలో భాగం’ అని కూడా ఆమె రాసుకొచ్చింది.