nudity
-
నగ్న చిత్రం ప్రతిదీ అసభ్యకరం కాదు
ముంబై: నగ్నంగా ఉండే ప్రతి పెయింటింగ్ అశ్లీలంగా ఉందని చెప్పలేమని బాంబే హైకోర్టు పేర్కొంది. ప్రముఖ చిత్రకారులు ఎఫ్ఎన్ సౌజా, అక్బర్ పదమ్సీ గీసిన కళాఖండాలను వారికి తిరిగిచ్చేయాలంటూ కస్టమ్స్ విభాగం అధికారులను ఆదేశించింది. ఈ ఏడాది జూలైలో ముంబై కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ జస్టిస్ ఎంఎస్ సొనక్, జస్టిస్ జితేంద్ర జైన్ డివిజన్ బెంచ్ శుక్రవారం తీర్పు వెలువరించింది. నగ్నంగా అగుపించేంది ఏదైనా సరే అశ్లీలమైనదనే వ్యక్తిగత అవగాహన ఆధారంగా మాత్రమే ఆ అధికారి నిర్ణయం తీసుకున్నారని, నిపుణుల అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదని పేర్కొంది. ముంబై వ్యాపారవేత్త ముస్తాఫా కరాచీవాలాకు చెందిన బీకే పాలిమెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2022లో లండన్‌లో జరిగిన రెండు వేర్వేరు వేలాల్లో ఎఫ్ఎన్ సౌజా, అక్బర్ పదమ్సీ గీసిన ఏడు పెయింటింగ్‌లను సొంతం చేసుకుంది. వీటిని 2023 ఏప్రిల్‌లో ముంబైకి తీసుకురాగా కస్టమ్స్ విభాగం స్పెషల్ కార్గో కమిషనరేట్ వీటిని అసభ్యకర వస్తువులని అభ్యంతరం చెబుతూ స్వాధీనం చేసుకుంది. 2024లో అసిస్టెంట్ కమిషనర్ వీటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించడంతోపాటు ఆ కంపెనీకి రూ.50వేల జరిమానా సైతం విధించారు. ఈ చర్యలను బీకే పాలిమెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో సవాల్ చేసింది. -
మితిమీరితే ఒప్పుకోం.. ఓటీటీ కంటెంట్‌పై కేంద్రం సీరియస్!
ఇటీవల ఓటీటీలో అశ్లీలత, అసభ్య పదజాలంతో కూడిన కంటెంట్ పెరుగుతోందన్న సంగతి తెలిసిందే. సినిమాలకు ఉన్నట్లుగా సెన్సార్ కత్తెర ఓటీటీ కంటెంట్లకు లేకపోవడంతో వీళ్లు హద్దలు దాటి ప్రవర్తిస్తున్నారని కొందరి వాదన. అయితే తాజాగా దీనిపై కేంద్రం స్పందించింది. ఓటీటీకి ఇచ్చిన స్వేచ్ఛ క్రియేటివిటీ కోసమని.. అశ్లీలత, అసభ్య పదజాలం వాడేందుకు కాదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఎవరైనా పరిమితి దాటితే జోక్యం చేసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడదని ఆయన ఘటుగా స్పందించారు. నాగ్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చర్యలు తీసుకునేందుకు వెనకాడబోం ఓటీటీ ప్లాట్‌ఫారంలు చేస్తున్న దుర్వినియోగం, అశ్లీల కంటెంట్‌పై ఇటీవల ఫిర్యాదులు వచ్చాయన్న ఆయన.. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. ఈ ప్లాట్‌ఫారంకు ఇచ్చిన స్వేచ్ఛ సృజనాత్మకత కోసం తప్ప అశ్లీలత లేదా దుర్వినియోగం కోసం కాదని, ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇందులో మార్పులు తీసుకురావడానికి నిబంధనల్లో ఏమైనా మార్పులు అవసరమవుతాయా అనే కోణాన్ని ఐటీశాఖ పరిశీలిస్తుందని తెలిపారు. వీటిపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో, నిర్మాతలు ముందుగా ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రి సూచించారు. ఇటీవల వెబ్ సిరీస్ "కాలేజ్ రొమాన్స్" గురించి ఢిల్లీ హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజుల తర్వాత ఠాకూర్ వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. వెబ్ సీరిస్ కంటెంట్‌లో అసభ్యకర పదజాలం వంటి భాష విస్తృతంగా ఉన్నందున అవి ప్రజలను ప్రభావితం చేయగలదని కోర్టు పేర్కొంది. क्रिएटिविटी के नाम पर गाली गलौज, असभ्यता बर्दाश्त नहीं की जा सकती। ओटीटी पर बढ़ते अश्लील कंटेंट की शिकायत पर सरकार गंभीर है।अगर इसको लेकर नियमों में कोई बदलाव करने की ज़रूरत पड़ी तो @MIB_India उस दिशा में भी पीछे नहीं हटेगा। अश्लीलता, गाली गलौज रोकने के लिए कड़ी कार्यवाई करेगा। pic.twitter.com/6pOL66s88L — Anurag Thakur (@ianuragthakur) March 19, 2023 -
స్మార్ట్ కోరల్లో చిక్కి..
నగర శివారులోని ఓ సంక్షేమ గృహంలో ఉండే బాలిక నీలిచిత్రాలు చూస్తుండగా వార్డెన్ పట్టుకున్నాడు. అప్పటి నుంచి అందరికీ చెబుతానని బెదిరించి బాలికను లైంగికంగా వేధిస్తున్నాడు. విషయం పదిమందికీ తెలియడంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. పోలీసుల సలహా మేరకు వారు మరో ఊరుకు మకాం మార్చారు. ఎనిమిదో తరగతి చదువుతున్నఓ బాలుడు మాదాపూర్‌లో ఓ లేడీస్ హాస్టల్లో మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు తీశాడు. అతని ట్యాబ్‌లో ఏకంగా 3,000 వీడియోలు దొరికాయి. ఇదంతా ఎలా తీశావంటే.. యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నానని చెబితే విస్తుపోవడం పోలీసుల వంతైంది. 50 ఏళ్లున్న ఓ పెద్దమనిషి ఫేస్బుక్లో ఓ బాలికను మాయమాటలతో మభ్యపెట్టి, ఆమె నగ్నచిత్రాలు తస్కరించి వేధించడం ప్రారంభించాడు. విషయం సైబర్ పోలీసుల దాకా వెళ్లడంతో బాలిక అపాయం నుంచి బయటపడింది. సాక్షి, హైదరాబాద్: నగరం.. ఉరుకుల పరుగుల జీవితం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా పిల్లలు, స్కూలు, ఇల్లు, ఉద్యోగాలు అంటూ ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు మినీ యుద్ధమే చేస్తారు. ఈ క్రమంలో పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? అన్న విషయాలపై శ్రద్ధ లేకపోవడమే సమస్యకు ప్రధాన కారణం. ఇంట్లో ఇంటర్నెట్, ట్యాబ్, స్మార్ట్ ఫోన్ వదిలి వెళ్తున్నాం, మా పిల్లలెలా ఉన్నారో వీడియో కాల్ ద్వారా చూసి ఆనందపడుతున్నాం అనుకుంటున్నారు కానీ.. వారు గాడ్జెట్లతో ఏం చేస్తున్నారన్నది పోలీస్‌స్టేషన్ నుంచి పిలుపొచ్చే దాకా తల్లిదండ్రులకు తెలియట్లేదు. ఇలాంటి ఘటనలు వారిని తలెత్తుకోనీకుండా చేస్తున్నాయి. భవిష్యత్తును నాశనం చేస్తున్న ఫోన్లు.. మొన్నటిదాకా బ్లూవేల్ గేమ్‌ల పేరుతో ప్రాణాలు తీసుకున్న పిల్లలు, ఇపుడు పబ్జీ గేమ్‌ల పేరుతో 24 గంటలూ గ్రూపులుగా గేమ్‌లోనే మునిగిపోతున్నారు. ఓవైపు సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నా.. ఎవరిలోనూ ఎలాంటి ఆందోళనా లేదు. అర్ధరాత్రి ఒంటిగంట లేదా తెల్లవారుజామున 4 గంటల దాకా గ్రూపులుగా ఉండి మరీ ఈ వీడియో గేములు ఆడుతున్నారు. తీరా రిజల్ట్ వచ్చేసరికి బ్యాక్‌లాగ్స్‌తో తెల్లమొహాలు వేస్తున్నారు. ఇంటర్లో 90 శాతం తెచ్చుకున్న విద్యార్థులంతా ఇంజనీరింగ్, డిగ్రీకి వచ్చేసరికి బండెడు బ్యాక్‌లాగ్స్ పెట్టుకోవడం తల్లిదండ్రులను, పాఠాలు చెప్పే గురువులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. మొత్తానికి స్మార్ట్‌ఫోన్ ఎడిక్షన్లో కూరుకుపోయిన పిల్లలు తమ తప్పు తెలుసుకునేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. స్మార్ట్ ఎడిక్షన్ లక్షణాలు.. ►ఇది టీనేజీ పిల్లల్లో అధికం. స్మార్ట్‌ఫోన్ లేకుండా క్షణం ఉండరు తినేటప్పుడు, పడుకునేటప్పుడు, తరగతి గదిలో, చివరికి బాత్రూంలోనూ ఇది లేకుండా ఉండలేని స్థితికి చేరుకుంటారు ►డిప్రెషన్‌కు లోనవడం, చీటికీమాటికీ చిరాకుపడటం ►అశ్లీల సాహిత్యం, వీడియోలకు బానిసవడం, ఇంటర్నెట్ లేకపోతే మౌనంగా కూర్చోవడం, ఎవరితోనూ కలవలేకపోవడం ► మిత్రులపై గాసిప్స్ క్రియేట్ చేయడం, వాటిని షేర్ చేయడం ►ఏకాంతంగా ఉండటం, చదువుపై శ్రద్ధ చూపకపోవడం ► పదేపదే అద్దంలో చూసుకోవడం, తమలో తామే నవ్వుకోవడం, బాధపడటం. అందంగా ఉన్నవాళ్లతో తమను పోల్చి చూసుకోవడం ► నిత్యం కొత్తదనం కోసం తపించడం, హింసాత్మక గేమ్‌లు ఆడటం ఇది నిశ్శబ్ద ప్రమాదం: ఎండ్ నౌ ఫౌండేషన్ స్మార్ట్‌ఫోన్ దుర్వినియోగం ఇప్పుడు ఒక వ్యసనంగా మారింది. దీనిపై స్పందించకుంటే భవిష్యత్తులో ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు ‘ఎండ్ నౌ’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ రాచమల్ల. లేత వయసులో ఇలాంటి ఘటనలు పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. సమాజంలో వారిని తలెత్తుకోనీయకుండా చేయడంతో బాగా కుంగిపోతారు. కానీ, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. పిల్లలకు స్మార్ట్‌ఫోన్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఎందుకంటే వారి తరువాత ఇలాంటి ఘటనల్లో రెండో బాధితులు తల్లిదండ్రులే. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ విషసంస్కృతిపై అందరం పోరాడాలి. ఇలాగే వదిలేస్తే ఇది దేశ భవిష్యత్‌ని కబళిస్తుంది. అందుకే ఆన్లైన్ భద్రత, సైబర్ సమస్యలు, సోషల్ మీడియా దుష్ప్రభావాలు, స్మార్ట్‌ఫోన్‌ను ఎంతవరకు వినియోగించాలి? వాటి దుష్ప్రభావాలపై విద్యార్థులకు కౌన్సెలింగ్, పోలీసులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. స్మార్ట్‌ఫోన్‌కు బానిసలైన పిల్లలకు మేం కౌన్సెలింగ్ ఇస్తున్నాం. వాటివల్ల సమాజంలో బంధాలు, బాంధవ్యాలు ఎలా నాశనమవుతాయో, వారి కెరీర్ ఎలా విచ్ఛిన్నమవుతుందో వివరిస్తున్నాం. ఈ ప్రయత్నంలో మా సంస్థ సైనికులు కూడా విద్యార్థులే కావడం విశేషం. మాతోపాటు సంస్థలో జస్టిస్ ఈశ్వరయ్య, విశ్రాంత ఐపీఎస్ కాశీనాథ్ బత్తిన, డాక్టర్ విజయ్‌కుమార్ తదితరులు భాగస్వాములుగా ఉన్నారు. ఎలా అరికట్టాలి..? ►వీటిని నివారించాలంటే.. ప్రతి జిల్లాలోనూ ఇలాంటి కేసుల స్వీకరణకు పోలీసులు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి ► విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చి సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలి ► యువత, టీనేజర్లకు చైనా తరహాలో ‘స్మార్ట్ డీ–ఎడిక్షన్’ సెంటర్లు ఏర్పాటు చేసి చికిత్స అందించాలి ► ఆన్లైన్ వేధింపులకు శిక్షలు కఠినతరం చేయాలి ► ప్రమాదకరంగా మారిన గేమింగ్ సైట్లను ఎప్పటికపుడు గుర్తించి నిషేధించాలి ► అశ్లీలం, హింసను ప్రేరేపించే సైట్లపై పర్యవేక్షణ ఉంచాలి ►చిన్నారులపై ఆన్లైన్ ద్వారా వేధింపులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలి -
నగ్నత్వమే ఆమె ఆయుధం
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఆదివాసి తెగకు చెందిన ఓ సంతాల్ యువతిని పోలీసు స్టేషన్లో పోలీసులు వరుసగా అత్యాచారం చేస్తారు. వారు తమ కామక్రీడను ముగించుకున్నాక ఆమెకు కట్టుకోవడానికి బట్టలిస్తారు. ఆమె ఆ బట్టలను చించిపారేసి తొడల మధ్య నుంచి రక్తం కారుతుండగా వీధిలోకి నగ్నంగా పరుగెత్తుతుంది. ఎదురు పడిన ఓ పోలీసు ఉన్నతాధికారి చేతుల్లోకి ఒంట్లో శక్తిలేక ఒరిగి పోతుంది. భయమంటే తెలియని ఆ పోలీసు అధికారి ఆమె పరిస్థితి చూసి జీవితంలో తొలిసారి భయపడతారు.’ ఇది ప్రముఖ రచయిత్రి మహాశ్వేతా దేవీ రాసిన ‘ద్రౌపది’ షార్ట్ స్టోరీ ముగింపు సన్నివేశం. అలా ఆమె బట్టలు చించేసి వీధిలోకి పరుగెత్తి రావడానికి కారణం సిగ్గులేని ప్రపంచాన్ని సిగ్గుపడేలా చేయడం కోసం. ఇంతవరకు ఇది కథయితే నిజ జీవితంలో కొంత మంది మణిపూర్ మహిళలు 2004లో తమ నగ్న శరీరాలనే ఆయుధంగా చేసుకున్నారు. అస్సాం రైఫిల్స్‌కు చెందిన పోలీసులు మనోరమ అనే యువతిని రేప్ చేసి చిత్రహింస పెట్టినందుకు సంఘీభావంగా వారంతా నడి వీధిలో, రైఫిల్స్ భవనం ముందు నగ్నంగా నిరసన ప్రదర్శన చేశారు. దమ్ముంటే ఇప్పుడు తమపై అత్యాచారం చేయడంటూ సవాల్ విసిరారు. ఆనాడు ఈ సంఘటన దేశాన్నే కుదిపేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా చేసింది. ఇప్పుడు టాలీవుడ్‌కు చెందిన నటి శ్రీరెడ్డి హైదరాబాద్ రోడ్డుపై పట్ట పగలు బట్టలు విప్పుకొని తెలుగు సినీ పరిశ్రమ గుడ్డలూడదీశారు. ఇక్కడ కూడా నగ్న శరీరమే ఆయుధంగా మారింది. ‘మీరంతా వినాలంటే నాకు ఇదొక్కటే మార్గంగా కనిపించింది. సినీ పరిశ్రమలో పాత్రల కోసం నేను ఎంతో మంది ముందు నగ్నంగా నిలబడాల్సి వచ్చింది. పాత్రలు ఇస్తానన్న వారు మోసం చేశారు. నాకు జరిగిన అన్యాయం గురించి గొంతెత్తి అరిచాను. నా ఒక్కదానికే కాదు, సినిమా ఛాన్స్‌లు ఇస్తామంటూ ఎంతో మంది మహిళలను మోసం చేస్తున్నారు. సినిమా కళాకారుల సంఘం నుంచి సరైన సమాధానం ఇప్పటికీ రాకపోవడంతో ఈ విషయం అందరి దృష్టికి తీసుకరావడం కోసమే నేను పబ్లిగ్గా బట్టలిప్పడానికి సిద్ధపడ్డాను’ అంటూ శ్రీరెడ్డి మనో వ్యధను వెల్లడించారు. అందుకని ఆమెకు సంస్కారం లేదంటూ ఉంటున్న ఇంటి నుంచి ఖాళీ చేయమన్నారు. శ్రీరెడ్డికి జరిగిన అన్యాయం సినిమా ఇండస్త్రీలో ఎంతో మందికి జరిగే ఉంటుంది. వారంతా ఒక్కొక్కరుగానైనా బయటకు వచ్చినప్పుడే పరిశ్రమలో ప్రక్షాళన ప్రారంభం అవుతుంది. అమెరికా ప్రముఖ నిర్మాత హార్వి వైన్‌స్టీన్ సెక్స్ స్కామ్ గురించి న్యూయార్క్ టైమ్స్ గతేడాది బయటపెట్టగానే ఇప్పటివరకు 85 మంది బాధితులు ‘మీ టూ’ అంటూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. వారిలో ఎంజెలినా జోలి, కేట్ బెకిన్సలే, లిసెట్టి ఆంథోని, గ్వినెథ్ పాల్ట్రో, మీరా సార్వినో, డెరిల్ అన్నా లాంటి ప్రముఖ తారలెందరో ఉన్నారు. ప్రస్తుతం వైన్‌స్టీన్ మీద లాస్ ఏంజెలిస్, న్యూయార్క్ సిటీ, లండన్ నగరాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. - నరేందర్ రెడ్డి -
నా దృష్టిలో నగ్నంగా ఉండటం ప్రకృతి: నటి
లాస్ ఎంజెల్స్: అప్పుడప్పుడు తాను దిగంబరంగా ఫొటోలకు పోజులివ్వడాన్ని ప్రముఖ హాలీవుడ్ యువనటి, దివంగత స్టార్ పాప్ డ్యాన్సర్ మైకెల్ జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్(19) సమర్థించుకుంది. నగ్నత్వాన్ని లైంగికంగా చూడొద్దంటూ హితవు పలికింది. ఇటీవల తన సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రమ్‌లో టాప్ లెస్‌గా ఓ సొఫాలో కూర్చుని సిగరెట్ తాగుతున్న ఫొటో పంచుకోవడంపట్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శించారు. తండ్రి పరువు తీస్తోందంటూ కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలో స్పందించిన పారిస్ జాక్సన్ ‘నన్ను, నా తీరును ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారికి మరోసారి స్పష్టంగా చెబుతున్నాను. తిరిగి ప్రకృతితో కలిసిపోయే ఒక ఉద్యమంలాగా నగ్నత్వం ప్రారంభమైంది. ఇదొక స్వేచ్చా స్వాతంత్ర్యానికి అభివ్యక్తీకరించే చర్య, ఆరోగ్యంగా ఉండటం, ఇంకా చెప్పాలంటే ఇదొక ఫిలాసపీ.. ఏదీ మనల్ని మనుషులుగా తీర్చిదిద్దిందో అందులో నగ్నంగా ఉండటమనేది ఒక భాగం. ప్రత్యేకంగా నాకు సంబంధించి ఇది చాలా అందమైనది. మీ దేహాన్ని ఒక ఆలయంలాగా ఉంచుకోవడం కాదు.. దాన్ని పూజించాలి కూడా. ఒక యువతి తనను తాను తనకు నచ్చినదారిలో వ్యక్తీకరించుకోవడం ఫెమినిజంలో భాగం’ అని కూడా ఆమె రాసుకొచ్చింది. -
నాకు సిగ్గులేదు, నగ్నంగా నటిస్తా!
‘నా శరీరం నాకు కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఆ విషయంలో ఎలాంటి సిగ్గుపడను. నిజానికి చెప్పాలంటే శారీరకంగా నగ్నంగా నటించడం నాకేం పెద్ద విషయం కాదు. ఒక నటుడిగా మీకు అత్యంత సన్నిహితం కావడానికి నేను ప్రయత్నిస్తాను. నా ఆత్మను మీముందు స్వచ్ఛంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా నగ్నత్వం ఏముంటుంది. దానితో పోల్చుకుంటే భౌతిక నగ్వత్వం అనేది ఎంత?’ అంటూ తన అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టాడు బాలీవుడ్ బాజీరావు రణ్‌వీర్‌సింగ్. హిందీ చిత్ర పరిశ్రమలో అనతికాలంలోనే హీరోగా తనదైన ముద్రవేసిన రణ్‌వీర్‌సింగ్ తాజాగా ‘బేఫిక్రే’ సినిమాతో ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. ఈ సినిమాలో తను అండర్వేర్లో నటించడంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా తెలిపాడు. ఈ సినిమాలో రణ్వీర్ అండర్వేర్ సీన్‌పై ఇటీవల షారుఖ్ కూడా ‘కాఫీ విత్ కరణ్’ షోలో స్పందించాడు. -
ఇంటర్నెట్, నైట్ లైఫ్, న్యూడిటీ..!
సముద్ర తీరంలో తీరొక్క రీతిలో ఎంజాయ్ చేస్తారు జనం. అప్పుడు మొబైల్ గిబైల్ పక్కనపెట్టి ఆనందంలో మునిగితేలుతారు. అయితే భారతీయులు మాత్రం అలా ఎంజాయ్ మెంట్ లో పూర్తిగా మునిగిపోవడానికి ఇష్టపడట్లేదు. ఆ..ఆనందాన్ని నలుగురితో షేర్ చేసుకోవాలనుకుంటారు. అందుకే బీచ్ టూర్లలో సైతం ఇంటర్నెట్ ను వదిలిపెట్టట్లేదు. నైట్ లైఫ్, న్యూడిటీ కూడా భారతీయ పర్యాటకుల ప్రాధాన్యతల్లో ముఖ్యమైనవి. ప్రఖ్యాత ట్రావెల్ పోర్టల్ ఎక్స్ పీడియా తాజాగా 12 వేల మందితో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 24 దేశాల్లో పర్యాటకులను పరిశీలించి, ప్రశ్నలు వేసి రూపొందించిన ఎక్స్ పీడియా ఈ రిపోర్టు తయారు చేసినట్లు చెబుతోంది. దాని ప్రకారం తీర ప్రాంతాలకు టూర్లకు వెళ్లేవారిలో థాయిలాండ్ వాసుల(82 శాతం) తర్వాతి స్థానం భారతీయులదే. ఇండియన్ టూరిస్టులలో 81 శాతం మంది బీచ్ లలో గడిపేందుకు ఇష్టపడుతున్నారట. వారిలో 39 శాతం మంది నైట్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేయగలిగే ప్రాంతాలను ఎంచుకుంటామనగా, బీచ్ లలో న్యూడిటీని ఎంజాయ్ చేస్తామని 24 శాతం మంది చెప్పుకొచ్చారు. ప్రతీ నలుగురు ఇండియన్ టూరిస్టుల్లో ఒకరు హాలీడేస్ లో కూడా ఆఫీస్ ఈ మెయిల్స్ కు సమాధానాలివ్వడం, 24 గంటలూ ట్యాబ్ ను క్యారీ చేయడం వంటివి తప్పనిసరిగా భావిస్తారట. అలానే ప్రతి 10 మందిలో నలుగురు బీచ్ లలో కూడా వైఫై అందుబాటులో ఉండాలని, తద్వారా ఎప్పటికప్పుడు స్టేటస్ పోస్ట్ చేసుకునే వీలుంటుందని కోరుకుంటున్నారట. భలే ఉందికదూ.. భారతీయ టూరిస్టుల వ్యవహారం! -
పబ్లిసిటీ కోసం కాదు: అమీర్ ఖాన్
ముంబయి: తన తాజా చిత్రం 'పీకే' పోస్టర్‌పై నటుడు అమీర్ ఖాన్ స్పందించాడు. పబ్లిసిటీ కోసం ఆ పోస్టర్‌ను విడుదల చేయలేదని ఆయన తెలిపాడు. సినిమా చూస్తేగానీ ఆ పోస్టర్ సినిమాలో ఎందుకుందో అర్థం అవుతుందని అమీర్ వ్యాఖ్యానించాడు. అమీర్ ఖాన్ ఒంటిమీద నూలు పోగులేకుండా రైలు పట్టాలపై నిలబడి కోపంగా చూస్తున్నట్టుగా పోస్టర్‌ను శుక్రవారం పత్రికల్లో విడుదలైన విషయం తెలిసిందే. కళాత్మకమే తప్ప, అశ్లీలం కాదని అమీర్ పేర్కొన్నాడు. కాగా పీకే పోస్టర్లో ఒక పాత టేప్ రికార్డర్ ను మాత్రమే అమీర్ అడ్డుపెట్టుకున్నాడు. దాంతో అమీర్ ఖాన్‌పై చర్యలు తీసుకోవాల్సింది కోరుతూ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ కోర్టులో కేసు నమోదైంది. అక్టోబర్ 15న ఈ కేసు విచారణ ఆరంభం కానుంది. మరోవైపు పీకే పోస్టర్‌ను మరో పోస్టర్ నుంచి కాపీ కొట్టారనే అంశం నేషనల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 1973 సంవత్సరంలో తన ఆల్బమ్ ప్రమోషన్ కోసం పోర్చుగీస్ సంగీత కారుడు క్విమ్ బారీయోరోస్ రూపొందించిన పోస్టర్ ను పోలీవుందని ఇంటర్నెట్ లో కథనాలు వెలువడ్డాయి. క్విమ్ పోస్టర్ ను స్పూర్తిగా తీసుకుని పీకే పోస్టర్ రూపొందించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న 'పీ.కే.' సినిమాలో అమీర్ గ్రహాంతరవాసిగా కనిపించనున్నాడు. అమీర్ ఖాన్ తో పాటు ఈ చిత్రంలో సంజయ్ దత్, అనుష్కా శర్మ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఆగస్ట్ 15న విడుదల కానుంది.