‘మా నాన్నది హత్యే.. నన్ను కూడా చంపేస్తారు’ | My father was murdered: Paris Jackson | Sakshi
Sakshi News home page

‘మా నాన్నది హత్యే.. నన్ను కూడా చంపేస్తారు’

Published Wed, Jan 25 2017 4:49 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

‘మా నాన్నది హత్యే.. నన్ను కూడా చంపేస్తారు’ - Sakshi

‘మా నాన్నది హత్యే.. నన్ను కూడా చంపేస్తారు’

న్యూయార్క్‌: తన తండ్రి ప్రముఖ, అమెరికన్‌ పాప్‌ సింగర్‌, గ్రేట్‌ డ్యాన్సర్‌ మైఖెల్‌ జాక్సన్‌ను చంపేశారని ఆయన కూతురు ప్యారిస్‌ జాక్సన్‌ ఆరోపించారు. 2009లో తన తండ్రి చనిపోయిన సమయంలో జరిగిన పరిణామాలన్నీ కూడా ఒక సెటప్‌ అని, ఆ రోజు ఓ కట్టుకథ చెప్పి తన నోరు మూయించారని అన్నారు. ఆమె తొలిసారి ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా భావోద్వేగానికి లోనవుతూ ఈ విషయం చెప్పారు. శక్తిమంతమైన అనాస్తెటిక్‌ ప్రొపొఫోల్ ఓవర్‌ డోస్‌గా తీసుకోవడంవల్లే మైఖెల్‌ జాక్సన్‌ చనిపోయాడని ఇప్పటివరకు అందరికీ తెలిసిన విషయం.

అయితే, ఉద్దేశ పూర్వకంగానే జాక్సన్ వైద్యుడు అతి డోస్‌ ఉండే మాత్రలు ఇచ్చి ఆయన చావుకు కారణమయ్యారని కేసులు నమోదు చేశారు. కానీ, జాక్సన్‌ కూతురు ప్యారిస్‌ జాక్సన్ మాత్రం జనాలను తప్పుదోవ పట్టించేందుకు అలా ఓవర్‌ డోస్‌ అంటూ చెప్పారని, వాస్తవానికి తన తండ్రిని చంపేశారని, తనను కూడా ఏదో ఒకరోజు హత్య చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ మాత్రం అనుమానం లేకుండా తన తండ్రి హత్యకు గురయ్యాడని, ఇదంతా కూడా ఒక పెద్ద కుట్ర అని.. జాక్సన్‌ కుటుంబ సభ్యులకు ఆయన అభిమానులకు ఈ విషయాలు తెలుసని, ఆరోజు జరిగిందంతా కూడా ఓ సెటప్‌ అని స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement