
మళ్లీ తెలుగులో...
ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరొందిన ఏకైక కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. బాలీవుడ్‌లో దర్శకునిగా తనదైన ముద్ర వేస్తున్న ప్రభుదేవా దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెర మీద మెరవనున్నారు. ‘గ్రీన్ సిగ్నల్’ ఫేం విజయ్ మద్దాల చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నారని సమాచారం. రోడ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ ప్రధానంగా అమెరికాలో జరగనున్నట్లు భోగట్టా.