వేలానికి మైకేల్ జాక్సన్ వస్తువులు! | Michael Jackson, Jackson family treasures and sex toys going up for auction | Sakshi
Sakshi News home page

వేలానికి మైకేల్ జాక్సన్ వస్తువులు!

Published Sun, Sep 14 2014 10:14 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM

వేలానికి మైకేల్ జాక్సన్ వస్తువులు!

వేలానికి మైకేల్ జాక్సన్ వస్తువులు!

లాస్ ఏంజెలిస్: పాప్ సంగీత రారాజు మైకేల్ జాక్సన్, ఆయన కుటుంబానికి చెందిన వ్యక్తిగత వస్తువులు ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచారు. వీటిలో అనేక స్మారక వస్తువులతో పాటు జాక్సన్‌కు చెందిన సాక్స్, అండర్‌వియర్ వంటి వస్తువులూ ఉన్నాయి. జాక్సన్ కుటుంబానికి చెందిన ఫొటో ఆల్బమ్‌లు, ఆయన పెంపుడు చింపాంజీ బబుల్స్ ధరించిన జాకెట్, రికార్డింగులు ఉన్న 56 టేపులు కూడా వేలం వేయనున్నారు.

 

ఇవన్నీ అందరి ఇళ్లలోనూ ఉండే సాధారణ వస్తువులే కానీ.. జాక్సన్‌కు చెందినవి కాబట్టి ఇవి చరిత్రాత్మకమయ్యాయని ‘గాట్టా హ్యావ్ ఇట్ కలెక్టిబుల్స్’ వేలం సంస్థ పేర్కొంది. జాక్సన్ వస్తువులను ఈ నెల 19 వరకూ వేలానికి ఉంచుతామని, ప్రస్తుతం అన్ని వస్తువులకూ కనిష్టంగా 100 డాలర్ల నుంచి బిడ్‌లు దాఖలు కాగా, మాస్టర్ టేపులకు మాత్రం కనిష్టంగా వెయ్యి డాలర్ల నుంచి బిడ్‌లు వేశారని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement