మిస్టరీ కేసు: ఆన్‌లైన్‌ వేలంలో కొన్న సూట్‌కేసులో ఏముందంటే... | Two Children Bodies Found In Suitcase Bought An Online Auction | Sakshi
Sakshi News home page

మిస్టరీ కేసు: ఆన్‌లైన్‌ వేలంలో కొన్న సూట్‌కేసులో ఏముందంటే...

Published Sat, Aug 20 2022 1:11 PM | Last Updated on Sat, Aug 20 2022 1:31 PM

Two Children Bodies Found In Suitcase Bought An Online Auction - Sakshi

New Zealand police investigating the suspected murder: ఆన్‌లైన్‌ వేలంలో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఉంటున్న ఒక కుంటుంబం ఒక సూట్‌కేసుని కొనుగోలు చేసింది. ఐతే ఆ సూట్‌కేస్‌ ఇంటికి డెలివరీ అయ్యాక లాకర్‌తో ఓపెన్‌ చేసి చెక్‌ చేసుకుంటున్నారు. పాపం ఎంత ఆత్రుతగా ఆ సూట్‌ కేసు తెరిచి చూస్తే... వారికి గుండె ఆగినంత పని అయ్యింది. ఇంతకీ అందులో ఏముందంటే... ఆ సూట్‌కేసులో ఇద్దరు చిన్నారుల మృతదేహా అవశేషాలు ఉన్నాయి.

దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా భయబ్రాంతులకు లోనై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి ఆ సూట్‌కేసుని పరిశీలించి నరహత్య జరిగిందేమోనన్న కోణంలో విచారించడం మొదలు పెట్టారు. మృతి చెందిన చిన్నారులిద్దరు ఐదు నుంచి 10 ఏళ్ల మధ్య వయసు ఉంటుందని , కొంతకాలం క్రితమే చనిపోయినట్లు వెల్లడించారు.

ఈ సూట్‌కేసులు చాలా కాలం పాలు నిల్వలో ఉన్నాయని, దీని మాన్యుఫ్యాక్చరింగ్‌ వివరాలు జోడించకుండా ఆన్‌లైన్‌లో అమ్మాకానికి పెట్టినట్లు తెలిపారు. ఆ పిల్లలు ఎవరనేది అధికారికంగా గుర్తించాల్సి ఉందని అన్నారు. ఆ పిల్లల కుటుంబాలకు వారు చనిపోయినట్లు బహుశా తెలియకపోవచ్చు అని అన్నారు. పిల్లలు ఎలా చనిపోయారు, ఏం జరిగింది అనే దానిపై పూర్తి స్థాయిలో పోలీసులు విచారించడం ప్రారంభించారు.

(చదవండి: పైలట్లు ఇద్దరూ నిద్రపోయారు.. గమ్యస్థానం దాటేసిన తర్వాత మేలుకున్నారు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement