Bappi Lahiri- Michael Jackson: 1996లో కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ ముంబై వచ్చారు. ఆ సందర్భంలోనే బప్పీ లహిరిని చూశారాయన. ముఖ్యంగా బప్పీ మెడలో ఉన్న వినాయకుడి లాకెట్‌ని చూసి, ‘‘ఓ మై గాడ్.. అద్భుతం. మీ పేరేంటి’’ అని అడిగారు మైఖేల్. బప్పీ తన పేరు చెప్పారు. ‘‘మీరు కంపోజరా?’’ అడిగారు మైఖేల్. ‘‘అవును.. ‘డిస్కో డ్యాన్సర్’ చేశాను’’ అన్నారు బప్పీ. వెంటనే ఆ సినిమాలోని పాట ‘జిమ్మీ’ని ప్రస్తావించి, ‘‘నాకు మీ ‘జిమ్మీ జిమ్మీ..’ పాట చాలా ఇష్టం’’ అన్నారు మైఖేల్. మామూలుగా కొన్ని సందర్భాల్లో బప్పీ బంగారు గొలుసులను కొందరికి బహుమతిగా ఇస్తుంటారు.
అయితే ఆ రోజు మైఖేల్‌కి వినాయకుడి లాకెట్ నచ్చినప్పటికీ ఆయనకు ఇవ్వలేదు. దానికి కారణాన్ని ఓ షోలో స్వయంగా చెప్పారు బప్పీ. ‘‘ఆ లాకెట్ మా ఆవిడ కొనిచ్చింది. నా లక్కీ లాకెట్. ఆయన (మైఖేల్)కు అన్నీ ఉన్నాయి. కానీ నా దగ్గర ఉన్నది ఈ బంగారం మాత్రమే. అది నా అదృష్టం. నేను కోల్‌కతాలో పుట్టాను. కానీ నన్ను మహారాష్ట్ర మట్టి ఆశీర్వదించింది. ఒకవేళ మైఖేల్‌కు నేను గణేశుడి లాకెట్ ఇచ్చి ఉంటే.. ఆ ఆశీర్వాదాలు నన్ను వదిలి వెళ్లిపోయి ఉండేవేమో’’ అని ఆ షోలో బప్పీ అన్నారు. అయితే 2009లో మైఖేల్ చనిపోయినప్పుడు ఆయన మీద ఉన్న ఇష్టంతో ప్రత్యేకంగా ఓ పాట కంపోజ్ చేశారు బప్పీ.
– కె
చదవండి: Rashmika Mandanna: అతడే నా భర్త, ఇంట్లో చెప్పే ప్రేమ పెళ్లి చేసుకుంటా: రష్మిక
Comments
Please login to add a commentAdd a comment