
వారసుడొస్తున్నాడు..!
పాప్ రారాజు మైకేల్ జాక్సన్ వారసుడొస్తున్నాడు. పదిహేడేళ్ల మైకేల్ తనయుడు ప్రిన్స్... అతడి స్నేహితుడు, సింగర్ జస్టిన్ బైబర్‌తో కలసి ఓ సరికొత్త మ్యూజిక్ కాన్సెప్ట్ కోసం శ్రమిస్తున్నాడు. ప్రొఫెషనల్ బాక్సర్ ఫ్లాయిడ్ మెవెదర్ జూనియర్ ఈ మెగా ప్రాజెక్ట్‌కు సహకారం అందిస్తున్నాడు. ప్రిన్స్, ఇరవై ఏళ్ల బైబర్‌లు ఈ ఆల్బమ్ కోసం రాత్రింబవళ్లూ కష్టపడుతున్నారని... ప్రస్తుతానికి ఇంతకంటే వివరాలు బయటకు రాలేదని న్యూయార్క్ పోస్ట్ కథనం. ఈ ఇద్దరూ కాలిఫోర్నియాలోని ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్నారట.