కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల విజయం సాధించారు. ఆయన గతేడాది చేపట్టిన జోడో యాత్ర మంచి ఫలితాన్నిచి ఈ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి మెజార్టీ సీట్లను గెలుచుకునేలా చేసింది. ఈ నేపథ్యంలో మంచి ఫిట్‌నెస్ మెయింటెయిన్ చేసే రాహుల్ ఇష్టపడే ఆహార పదార్థాలేంటో చూద్దామా..!
రాహుల్ గాంధీ ఒక జర్నలిస్ట్‌తో కలిసి రాజధాని ఢిల్లీలోని ఒక ఐకానిక్ రెస్టారెంట్‌లో ఫుడ్‌ని ఆస్వాదిస్తూ కనిపించారు. ఆ జర్నలిస్ట్‌తో జరిపిన సంభాషణలో తనకు ఇష్టమైన ఆహార పదార్థాల గురించి పంచుకున్నాడు. తనకు బటర్ చికెన్, సీక్ కబాబ్ రోట్ అంటే మహా ఇష్టమని చెప్పారు. ఆలూ టిక్కకి తన ఇష్టమైన స్నాక్ ఐటెం అని చెప్పారు. తాను బోర్డింగ్‌స్కూల్‌లో ఉన్నప్పడు తన స్నేహితులతో కలిసి సమీపంలో ఉన్న ట్రక్ షాప్ నుంచి ఈ ఆలూ టిక్కిని ఇష్టంగా కొనుక్కుని తినేవాడనని అన్నారు.
అంతేగాదు ఆ సంభాషణలో తాను తన చిన్నతనంలో తన తండ్రితో కలిసి చైనీస్ రెస్టారెంట్ ఫుజియాకు వెళ్లి ఇష్టంగా తిన్న నాటి మధురానుభూతలను కూడా షేర్ చేసుకున్నారు. ఇక తాను ఇలా ఢిల్లీలో స్నాక్ ఐటెమ్స్ తిని రెండేళ్లు అవుతుందని అన్నారు. తనకు కుల్ఫీ అంటే కూడా మహా ఇష్టమని అన్నారు.
అలాగే ప్రాంతీయ వంటకాల వద్దకు వచ్చేటప్పటికీ దక్షిణ భారతీయ వంటకాలను ఇష్టంగా తింటనని, ముఖ్యంగా పంజాబీ వంటకాల్లో చోలే భటుర్, పరాఠాలు అంటే నాకు మహా ఇష్టమని అన్నారు. ఇష్టమైన కర్రీ దగ్గరకు వచ్చేటప్పటికీ బటర్ చికెన్, తందూరి చికెన్ అంటే ఇష్టమని తెలిపారు. రోజుని మంచి ఘుమఘమలాడే కాఫీతో ప్రారంభిస్తానని, సాయంత్రం మంచి టీ తప్పనిసరి అని చెప్పుకొచ్చారు.
(చదవండి: పోలాండ్‌లోని రహదారులకు, స్కూళ్లకు భారతీయ రాజు పేరు ఎందుకు పెట్టారో తెలుసా..!)
Comments
Please login to add a commentAdd a comment