![Sambhaji Maharaj Is The Real Reason How South Indian Sambar Got Its Name](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/sambar.jpg.webp?itok=kALEYhZG)
దక్షిణ భారత వంటకం సాంబార్ ఎంత ఫేమస్ రెసిపీనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భోజనంలోకే కాదు, బ్రేక్‌ఫాస్ట్‌లోనూ అది ఉండాల్సిందే. అలాంటి ఈ రెసిపీ తయారీని ఎవరు కనుగొన్నారు. దానికి ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దామా..
దేశవ్యాప్తంగా బాలీవుడ్ మూవీ చావా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో అందిరి దృష్టి మహారాష్ట్ర చారిత్రక రాజు శంభాజీ మహారాజ్ పైనే ఉంది. ఆ మూవీలో మరాఠా రాజు శంభాజీ రాజు పాత్రలో హీరో విక్కీ కౌశల్ ఒదిగిపోయాడు. ఇక్కడ చావా అంటే సింహం పిల్ల అని అర్థం. ఆ శంభాజీ మహారాజు జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, విజయాలు ఆధారంగా తీసిన సినిమా ఇది.
అయితే ఆ మహారాజు పేరు మీదనే దక్షిణ భారత వంటకం ఉంది. ఆ మరాఠా పాలకుడి పేరు మీదగానే సాంబార్ అనే రెసిపీ వచ్చిందట. దాదాపు 400 ఏళ్ల క్రితం తంజావూరు రాజ వంటగదిలో తయారయ్యిందట. ఆహారప్రియుడైన రాజు శంభాజీకి మహారాష్ట్ర వంటకం అమీ(పుల్లని పప్పు) అంటే చాలా ఇష్టం. దీన్ని కోకుమ్ అనే పుల్లని పండుతో తయారు చేస్తారు. అయితే ఒకరోజు కోకుమ్ అయిపోయింది.
వంటగదిలో ఉన్న వంటవాళ్లు ఎలా వండాలతో తెలియక ఆందోళనకు గురవ్వుతారు. అప్పుడే ఆ విషయాన్ని వణికిపోతు మహారాజుకి విన్నవించుకుంటారు. అప్పుడు శంభాజీ స్థానికంగా దొరికే చింతపండుతో ఎందుకు తయారు చేయకూడదు అని అన్నారు. అలా ఆయన సూచన మేరకు కందిపప్పు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలతో తయరు చేయగా దానికి శంభాజీ మహారాజు పేరుమీదుగా సాంబార్ అని పేరు పెట్టారని కథనం.
అయితే దక్షిణ భారతదేశంలో మరొక కథనం ప్రకారం శ్రీ కృష్ణుడు కొడుకు సాంబుడి తీవ్ర అనారోగ్యం బారినపడ్డాడని. ఆ వ్యాధి తగ్గాలంటే రోజు సూర్యుడిని ఆరాధించాలని మునులు చెప్పడంతో రోజుకో నైవేద్యం చేసే నివేదించేవాడట. ఆ క్రమంలోనే ఇలా కందిపప్పు, కూరగాయలతో చేసిన వంటకం సూర్యుడికి నివేదించగా..ఆయన ప్రీతి చెంది సాంబుడికి వ్యాధిని నయం చేశాడని చెబుతారు.
అలా ఆయన పేరు మీదుగా సాంబర్ వంటకం వచ్చిందన్న కథనం కూడా ప్రచారంలో ఉంది. అయితే మరాఠా మూలం నుంచి వచ్చిందంటే కొందరూ పాక నిపుణులు ఎందుకనో అంగీకరించారు. ఏదీఏమైనా ఈ రుచికరమైన వంటకాన్ని తమిళులు మునగకాయలతో చేసుకోగా మహారాష్ట్ర ప్రజలు ప్రత్యేక మసాలాతో తయారు చేస్తారు. ఇక కేరళ వాళ్లు, క్యారెట్లు, బంగాళదుంపలు వేసి చేస్తారు. ప్రస్తుతం ఈ రెసిపీ మనలో భాగమైపోయింది.
(చదవండి: కాఫీ బ్రేక్, మ్యాంగో మూడ్ చాక్లెట్లు గుర్తున్నాయా..? అవెలా వచ్చాయంటే..)
Comments
Please login to add a commentAdd a comment