sambar cooking
-
దక్షిణ భారత వంటకం 'సాంబార్'కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..!
దక్షిణ భారత వంటకం సాంబార్ ఎంత ఫేమస్ రెసిపీనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భోజనంలోకే కాదు, బ్రేక్‌ఫాస్ట్‌లోనూ అది ఉండాల్సిందే. అలాంటి ఈ రెసిపీ తయారీని ఎవరు కనుగొన్నారు. దానికి ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దామా..దేశవ్యాప్తంగా బాలీవుడ్ మూవీ చావా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో అందిరి దృష్టి మహారాష్ట్ర చారిత్రక రాజు శంభాజీ మహారాజ్ పైనే ఉంది. ఆ మూవీలో మరాఠా రాజు శంభాజీ రాజు పాత్రలో హీరో విక్కీ కౌశల్ ఒదిగిపోయాడు. ఇక్కడ చావా అంటే సింహం పిల్ల అని అర్థం. ఆ శంభాజీ మహారాజు జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, విజయాలు ఆధారంగా తీసిన సినిమా ఇది. అయితే ఆ మహారాజు పేరు మీదనే దక్షిణ భారత వంటకం ఉంది. ఆ మరాఠా పాలకుడి పేరు మీదగానే సాంబార్ అనే రెసిపీ వచ్చిందట. దాదాపు 400 ఏళ్ల క్రితం తంజావూరు రాజ వంటగదిలో తయారయ్యిందట. ఆహారప్రియుడైన రాజు శంభాజీకి మహారాష్ట్ర వంటకం అమీ(పుల్లని పప్పు) అంటే చాలా ఇష్టం. దీన్ని కోకుమ్ అనే పుల్లని పండుతో తయారు చేస్తారు. అయితే ఒకరోజు కోకుమ్ అయిపోయింది. వంటగదిలో ఉన్న వంటవాళ్లు ఎలా వండాలతో తెలియక ఆందోళనకు గురవ్వుతారు. అప్పుడే ఆ విషయాన్ని వణికిపోతు మహారాజుకి విన్నవించుకుంటారు. అప్పుడు శంభాజీ స్థానికంగా దొరికే చింతపండుతో ఎందుకు తయారు చేయకూడదు అని అన్నారు. అలా ఆయన సూచన మేరకు కందిపప్పు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలతో తయరు చేయగా దానికి శంభాజీ మహారాజు పేరుమీదుగా సాంబార్ అని పేరు పెట్టారని కథనం. అయితే దక్షిణ భారతదేశంలో మరొక కథనం ప్రకారం శ్రీ కృష్ణుడు కొడుకు సాంబుడి తీవ్ర అనారోగ్యం బారినపడ్డాడని. ఆ వ్యాధి తగ్గాలంటే రోజు సూర్యుడిని ఆరాధించాలని మునులు చెప్పడంతో రోజుకో నైవేద్యం చేసే నివేదించేవాడట. ఆ క్రమంలోనే ఇలా కందిపప్పు, కూరగాయలతో చేసిన వంటకం సూర్యుడికి నివేదించగా..ఆయన ప్రీతి చెంది సాంబుడికి వ్యాధిని నయం చేశాడని చెబుతారు. అలా ఆయన పేరు మీదుగా సాంబర్ వంటకం వచ్చిందన్న కథనం కూడా ప్రచారంలో ఉంది. అయితే మరాఠా మూలం నుంచి వచ్చిందంటే కొందరూ పాక నిపుణులు ఎందుకనో అంగీకరించారు. ఏదీఏమైనా ఈ రుచికరమైన వంటకాన్ని తమిళులు మునగకాయలతో చేసుకోగా మహారాష్ట్ర ప్రజలు ప్రత్యేక మసాలాతో తయారు చేస్తారు. ఇక కేరళ వాళ్లు, క్యారెట్లు, బంగాళదుంపలు వేసి చేస్తారు. ప్రస్తుతం ఈ రెసిపీ మనలో భాగమైపోయింది.(చదవండి: కాఫీ బ్రేక్, మ్యాంగో మూడ్ చాక్లెట్లు గుర్తున్నాయా..? అవెలా వచ్చాయంటే..) -
వంటగది అన్నం పెడుతోంది
స్నేహ సిరివర... ఈ అమ్మాయి ముఖం చూస్తే అమ్మ చేసిన సాంబార్‌ను అన్నంలో కలుపుకుంటూ ‘అమ్మా! సాంబార్ ఏ పిండితో వండుతారు?’ అని అడిగేటట్లు ఉంది. ఈ అమ్మాయే కాదు, ఈ తరంలో చాలామంది అమ్మాయిల పరిస్థితి ఇలాగే ఉంది. మూడేళ్లు నిండేలోపు ప్లే క్లాస్, ఆ తర్వాత నర్సరీ, ఎల్‌కేజీతో మొదలైన విద్యా ప్రస్థానం మినిమమ్ బీటెక్ దగ్గర ఆగుతోంది. ఈ మధ్య కాలమంతా పిల్లలు వంటగదిలోకి అడుగుపెట్టేది అమ్మ సర్దిన లంచ్‌బాక్స్ తీసుకోవడానికి మాత్రమే. ఇలా తయారైన తరానికి పెళ్లయిన వెంటనే వంటగది భూతంలా భయపెడుతుంది. స్నేహ సిరివర మాత్రం ‘‘నాకు రుచిగా భోజనం చేయడం చాలా ఇష్టం. అందుకోసం జీవితకాలమంతా వంటగదిలోనే గడిపేస్తాను. ఇతర ఉద్యోగాలు– వ్యాపారాల్లో బిజీగా ఉండే వాళ్లకు సహాయంగా ఉంటాను. జీవితం వంటగదికి బానిసైపోతోందని బాధపడే గృహిణులకు కావలసినంత వెసులుబాటు ఇచ్చి వాళ్లు తమకు ఇష్టమైన వ్యాపకాన్ని కొనసాగించుకునే సౌకర్యం కల్పిస్తాను. నాకు ఇష్టమైన వంటగదితోనే ఉపాధి పొందుతాను’’ అంటోంది. ఇంజనీర్ ఉద్యోగం వద్దు స్నేహ సిరివర ఈ మాటలు అనడమే కాదు. ఆచరణలో నిరూపించింది కూడా. కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చేసిన స్నేహ ఒక ఏడాదిపాటు విప్రో కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసింది. ‘‘ఆ ఏడాది కాలంలో తరచుగా నా కెరీర్ ఇది కాదు... అనిపిస్తుండేది. దాంతో మా అమ్మానాన్నలను ఒప్పించి 2013లో మా కారు గ్యారేజ్‌లోనే నా యూనిట్‌ని ప్రారంభించాను. నా తొలినాటి ఉత్పత్తులు సాంబార్ పొడి, రసం పొడి, బిసిబేళాబాత్ మసాలా, పులియోగరే మిక్స్. వీటినే ఎంచుకోవడానికి కారణం ఉంది. నా ఫ్రెండ్స్, బంధువులు చాలా మంది విదేశాల్లో ఉన్నారు. వాళ్లకు అక్కడ ఇండియా ఉత్పత్తుల దుకాణాల్లో ఇండియన్ మసాలా పొడులంటే ఉత్తరాది రాష్ట్రాల మసాలా పొడులే దొరుకుతాయట. అక్కడి దుకాణాల వాళ్లకు దక్షిణాది రుచులు వేరే ఉంటాయనే సంగతే తెలియదని చెప్తూ ఇక్కడ నుంచి ఏడాదికి సరిపడిన పొడులు చేయించుకుని వెళ్లేవాళ్లు. అలా తొలుత మా కన్నడ రుచులతో కెరీర్ ప్రయోగం చేశాను. సక్సెస్ అయింది. తర్వాత చట్నీపొడి, పచ్చళ్లు, పదిహేను శాతం చికోరీతో ఫిల్టర్ కాఫీ పొడి కూడా సొంతంగా చేశాను. తమిళ కోడలు నేను తమిళ కోడల్ని కావడం అనుకోకుండా జరిగిపోయింది. మా అత్తగారి దగ్గర మోర్ కొళంబు, మురుకు, అప్పళం, నిప్పట్టు వంటి గ్రామీణ రుచులను నేర్చుకుని నా ఉత్పత్తులలో చేర్చాను. ఈ ఏడేళ్లలో నేను గ్రహించినదేమిటంటే... ప్రతి వంటకానికీ దానికంటూ ప్రత్యేకమైన రుచి ఉంటుంది. మనం వేసే మసాలా పొడి ఆ రుచిని పరిరక్షించగలగాలి. నేను ముడిసరుకుగా ఉపయోగించే దినుసులు యాభై రకాలకు మించవు. వాటి నిష్పత్తులను, కాంబినేషన్లను మారుస్తూ వందల రకాల ఘుమఘుమలను, రుచులను తీసుకురావచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే... భోజనానికి రమ్మని వంటగది పిలవాలి. మసాలా పొడులు ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఎటువంటి రంగులనూ వాడకపోవడం కూడా నా ఉత్పత్తులకు మంచి పేరు తెచ్చి పెట్టింది’’ అని చెప్పింది స్నేహ సిరివర. స్నేహ ‘సాంబార్ స్టోరీస్’ అనే తన చిన్న యూనిట్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా అందుకునే నెల జీతంకంటే మంచి రాబడినే చూస్తోంది. అయితే ఆమెకు యూనిట్ నిర్వహణలో సవాళ్లేమీ ఎదురు కాలేదనుకుంటే పొరపాటే. కుటుంబంలో ఎవరూ వ్యాపార రంగంలో లేకపోవడంతో ముడిసరుకు ఎక్కడ దొరుకుతుందో సూచించేవాళ్లు కూడా లేరు. తల్లిదండ్రులు ఇంట్లో ఆమెకు సహాయంగా ఉండేవాళ్లు. ముడిసరుకు సేకరణ నుంచి ఉత్పత్తులను ప్యాకింగ్ చేయించి, కొరియర్ చేయించడం వరకు ఆమె సొంతంగా చేసుకునేది. ఇప్పటికీ అలాగే యూనిట్‌ని ఒంటి చేత్తో నిర్వహిస్తోంది. ‘వన్ మ్యాన్ ఆర్మీ’ అని వింటుంటాం. ‘ఒన్ ఉమన్ ఆర్మీ’ని స్నేహలో చూస్తున్నాం. -
ముంబయ్ అమ్మాయ్ సాంబార్ చేసిందోయ్!
వాట్... హన్సిక సాంబార్ చేశారా? అని నోరెళ్లబెట్టొద్దు! ఎందుకంటే... సాంబార్ ఒక్కటే కాదు, పన్నీర్ బటర్ మసాలా కూడా హన్సిక కుకింగ్ మెనూలో స్పెషల్ డిష్!! ఎప్పుడూ షూటింగులు, ప్యాకప్ చెప్పిన తర్వాత లగేజ్ ప్యాకింగులు, కాస్త ఖాళీ దొరికితే స్క్రిప్టు మీటింగులు... ఎప్పుడో గానీ హన్సికకు ఫ్రీ–టైమ్ దొరకదు. కానీ, శనివారం లక్కీగా కాస్త టైమ్ దొరికింది. వెంటనే కిచెన్‌లోకి వెళ్లి కుకింగ్ మొదలెట్టారు. ఏదో పార్ట్–టైమ్ షెఫ్లా గరిటె తిప్పలేదట! మాస్టర్ షెఫ్లా మారి సాంబార్, పన్నీర్ బటర్ మసాలా చేశానని హన్సిక పేర్కొన్నారు. స్టవ్ మీదనుంచి దించిన తర్వాత సాంబార్, పన్నీర్ బటర్ మసాలాలకు మేకప్ కూడా చేశారండోయ్! కుకింగ్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే... కొత్తిమీరతో గార్నిష్ చేయడం అన్నమాట! ఇక్కడ ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే... హన్సికది ముంబయ్. కానీ, ఆమె ఎక్కువగా నటిస్తున్నది సౌతిండియన్ సిన్మాల్లోనే. ఇక్కడ షూటింగులు చేస్తున్నప్పుడు చెన్నై సాంబర్ రుచి చూశారు. విపరీతంగా నచ్చేయడంతో అప్పుడప్పుడూ ముంబయ్ వెళ్లినప్పుడు ఇంట్లో సరదాగా సాంబార్ చేసుకుని తింటుంటారట!!