
లాస్ ఏంజెల్స్: బాలీవుడ్ నుంచి వెళ్లి హాలీవుడ్‌ను ఏలుతూ గ్లోబల్ నటిగా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా.. తన ప్రియుడు నిక్ జోనాస్‌కు ఇష్టమైన భారతీయ వంటకంపై, అలాగే తాను లాస్ ఏంజెల్స్‌లో ఉంటూ మిస్ అవుతున్న భారతీయ వంటకాలపై క్లారిటీనిచ్చింది. తాజాగా ఇచ్చిన ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో ఆమె, ఆమె భర్త జీహ్వకు సంబంధించిన విశేషాలను వెల్లడించింది. ఇంతకీ ఈ ముద్దు గుమ్మ మిస్సవుతున్న వంటకాలేంటో తెలుస్తే షాకవుతారు. ఆమె మిస్సవుతుంది భారతీయ సాంప్రదాయ వంటకాలైన దాల్, రోటీలనట. ఆమె ప్రతిరోజు వీటిని చాలా మిస్సవుతున్నట్లు వెల్లడించింది. ఇక తన భర్త నిక్‌కు ఇష్టమైన భారతీయ వంటకంపై ఆమె స్పందిస్తూ.. ఆయన ఫేవరెట్ ఇండియన్ ఫుడ్ కచ్చితంగా ఏదో ఒక పనీర్ ఐటం అయ్యింటుందన్నారు. ప్రియాంకకు ఇష్టమైన వంటకాల జాబితాలో బిర్యానీ, కబాబ్, చాట్ తదితర ఐటమ్స్ ఉన్నట్టు తెలిపారు. కాగా, ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ మూవీ 'టెక్స్స్ట ఫర్ యూ' షూటింగ్ నిమిత్తం లండన్‌లో బిజీగా గడుపుతున్నారు. అలాగే ఓటీటీ వేదికగా త్వరలో విడుదలకానున్న తన తాజా చిత్రం 'వైట్ టైగర్' చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment