సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. టెక్నాలజీని వాడుకుంటూ ప్రతీ అంశంపై ఎప్పటికప్పడు స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ చిన్నారి హోంవర్క్ సంబంధించిన ఓ పత్రాన్ని షేర్ చేస్తూ కేటీఆర్ ఓ ఫన్నీ ట్వీట్ చేశారు. ‘జీవితంలో షార్ట్‌కట్స్ లేవని ఎవరన్నారు?. ఈ చిన్నారి ఎంత స్మార్ట్... చిన్నారితో పాటు ఆ టీచర్ కూడా అంతే స్మార్ట్.’ అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ నవ్వులు పూయిస్తోంది.
ఓ చిన్నారికి తన హోంవర్క్ సంబంధించి ఆకలితో ఉన్న పిల్లి ఏ మార్గం గుండా వెళ్లి పాలు తాగుతుందో దారి చూపించండి అని ఓ ఫజిల్ అడిగారు. దానికి చిన్నారి ఫజిల్ లోపల ఎలా వెళ్లాలనేదాని గురించి ఆలోచించకుండా, పిల్లి నుంచి పాలకు షార్ట్‌కట్‌గా గీత గీసి ఫజిల్ పూర్తి చేసింది. విద్యార్థి జవాబుకి టీచర్ కూడా రైట్ మార్కు వేసి.. స్టార్ సింబల్ కూడా ఇచ్చారు. అందుకే ఈ చిన్నారి తెలివితేటలకు ఫిదా అయిన కేటీఆర్ ట్వీటర్ ద్వారా ఆ విషయాన్ని పంచుకున్నారు. ఇపుడా ఆ ట్వీట్ వైరల్‌గా మారింది.
Who said there are no shortcuts in life?
— KTR (@KTRTRS) June 21, 2018
Gotta love this smart kid 😀 and the teacher is equally smart it appears 😀 pic.twitter.com/tjNBt7gnDa
Comments
Please login to add a commentAdd a comment