
సాక్షి,హైదరాబాద్: ఈ కార్ రేస్ వ్యవహారంలో తనపై కేసు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు మంగళవారం(డిసెంబర్17) ఎక్స్(ట్విటర్)లో కేటీఆర్ స్పందించారు.
30సార్లు ఢిల్లీకి పోయినా మూడు పైసలు తేలేదు కాని..మూడు కేసులు పెట్టి శునకానందం పొందాలనుకుంటే గుడ్‌లక్ అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసులు పెట్టండి..వాటిని న్యాయపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
కాగా, బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన ఈ కార్ రేసు ఏర్పాట్లలో నిధుల గోల్‌మాల్ జరిగిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈవ్యవహారంలో అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌పై దర్యాప్తు చేయడానికి గవర్నర్ ఆమోదాన్ని కోరగా ఇందుకు ఆయన ఓకే అన్నారు. దీంతో కేటీఆర్‌పై కేసు పెట్టనున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం కేబినెట్ భేటీ తర్వాత సంకేతాలిచ్చారు. తాజాగా దీనిపై కేటీఆర్ స్పందించారు.
బీజేపీతో ఢిల్లీలో చిట్టి గారి కాళ్ళ బేరాలు, జైపూర్ లో అదానీతో డిన్నర్ రిజల్ట్ వచ్చినట్టుంది
30 సార్లు ఢిల్లీకి పోయిన 3 పైసలు తేలేదు కానీ, మూడు కేసులు పెట్టి శునకానందం పొందాలనుకుంటే, మీ ఖర్మ
Good luck Chitti Naidu & Co
Will face you legally. Bring it on 👍— KTR (@KTRBRS) December 17, 2024