సాక్షి,హైదరాబాద్:వంద రోజుల్లో ప్రతి గ్యారెంటీ నెరవేరుస్తామన్న మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ మేరకు సోమవారం(నవంబర్ 4) ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు.
‘మూడు వందల ముప్పై రోజులు ముగిసింది. ఏడాది నిండడానికి 35 రోజులే మిగిలింది. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అంటున్నారు నిరుద్యోగులు. ఎకరాకు రూ.15000 రైతు భరోసా ఏమైంది అంటున్నారు రైతన్నలు.పెంచిన రూ.4 వేల పెన్షన్ ఎక్కడంటున్నారు అవ్వ తాతలు.నెల నెల ఇస్తామన్న రూ.2500 ఎక్కడబోయాయంటున్నారు అడబిడ్డలు. ఉద్యోగులు మా పీఆర్సీ ఎక్కడ, మా డీఏలు ఎక్కడని సమ్మెలకు సై అంటున్నారు.
కౌలు రైతులు రూ.15000 ఎక్కడ, రైతు కూలీలు రూ. 12000 ఎక్కడ అంటున్నారు.తులం బంగారం ఎక్కడా అంటున్నారు మా బంగారు తల్లులు.చెప్పిన హామీలన్నీ బూడిదలో పన్నీరయ్యే.. చెప్పని మూసీలో లక్షల కోట్ల మూటలాయే. ఏడాది కాలమంతా అటెన్షన్ డైవర్షన్ తో పబ్బం గడిపిన మూసీ సర్కార్. ఏముంది ఈ ప్రజా పాలనలో గర్వకారణం ధర్నాలు,రాస్తారోకోలు తప్ప’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: 8న యాదాద్రికి సీఎం రేవంత్
Comments
Please login to add a commentAdd a comment