సోషల్ మీడియా వేదికగా సామాన్యులు కూడా బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తులతో కనెక్ట్ అవుతారు. ఈ క్రమంలో ఎదురయ్యే సంభాషణలు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ రచయిత్రి ప్రీతి షెనాయ్‌ని ఓ విద్యార్థి వింతైన సహాయం చేయమని కోరాడు. ఇది చూస్తే.. ఈ రోజుల్లో పిల్లలే ఇంత.. చాలా క్రేజీ.. అని అనుకోకుండా ఉండలేరు.
పదో తరగతి చదువుతున్న విద్యార్థి ప్రీతిని హోం వర్క్ చేసిపెట్టమని సహాయం కోరారు. కాంపిటీషన్‌లో భాగంగా స్కూల్‌లో పది లైన్ల పద్యం రాసుకురమ్మన్నారట టీచర్. ఏదీ గుర్తుకు రావడం లేదట. దీంతో ఏకంగా ప్రముఖ రచయిత్రి ప్రీతిని అడిగారు. రచయిత్రి కాదా..! బాగా రాస్తుందనుకున్నారో ఏమో మరి..! అయితే.. స్టుడెంట్ అడిగిన సహాయాన్ని ప్రీతి సున్నితంగా తిరస్కరించారు. స్టుడెంట్ అడిగిన సహాయాన్ని ప్రీతి స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అది కాస్త.. నెట్టింట తెగ వైరల్ అయ్యింది.
ఈ పోస్టుపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. అది హోం వర్క్ కాదు.. కాంపిటీషన్.. ఏకంగా ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దామనే ప్లాన్ చేశారా స్టుడెంట్ అంటూ స్పందించారు. 10వ తరగతి విద్యార్థి అంటే ఇంకా చిన్నపిల్లలేం కాదు.. తిరస్కరించినందుకు ధన్యవాదాలు అంటూ మరికొందరు కామెంట్ చేశారు. చాట్ జీపీటీని అడుగొచ్చు కదా..! ఇలా అడగడం ఎందుకు? అని మరికొందరు ఫన్నీగా సలహాలు ఇచ్చారు.
And look at this message I received just now ! A kid wants me to do their homework for them! 🤷🏻♀️🤷🏻♀️🤷🏻♀️ pic.twitter.com/T6yv6dE8N4
— Preeti Shenoy (@preetishenoy) June 29, 2023
ఇదీ చదవండి: బీచ్ రోడ్‌లో 'బిగ్ బీ' పాటకు వృద్ధ జంట స్టెప్స్.. ఆనంద్ మహేంద్ర ట్వీట్.. వీడియో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment