High School Student
-
అరే..! హై స్కూల్ స్టుడెంట్.. ప్రముఖ రచయిత్రిని అడగకూడందే అడిగారే..!
సోషల్ మీడియా వేదికగా సామాన్యులు కూడా బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తులతో కనెక్ట్ అవుతారు. ఈ క్రమంలో ఎదురయ్యే సంభాషణలు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ రచయిత్రి ప్రీతి షెనాయ్ని ఓ విద్యార్థి వింతైన సహాయం చేయమని కోరాడు. ఇది చూస్తే.. ఈ రోజుల్లో పిల్లలే ఇంత.. చాలా క్రేజీ.. అని అనుకోకుండా ఉండలేరు. పదో తరగతి చదువుతున్న విద్యార్థి ప్రీతిని హోం వర్క్ చేసిపెట్టమని సహాయం కోరారు. కాంపిటీషన్లో భాగంగా స్కూల్లో పది లైన్ల పద్యం రాసుకురమ్మన్నారట టీచర్. ఏదీ గుర్తుకు రావడం లేదట. దీంతో ఏకంగా ప్రముఖ రచయిత్రి ప్రీతిని అడిగారు. రచయిత్రి కాదా..! బాగా రాస్తుందనుకున్నారో ఏమో మరి..! అయితే.. స్టుడెంట్ అడిగిన సహాయాన్ని ప్రీతి సున్నితంగా తిరస్కరించారు. స్టుడెంట్ అడిగిన సహాయాన్ని ప్రీతి స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అది కాస్త.. నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ పోస్టుపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. అది హోం వర్క్ కాదు.. కాంపిటీషన్.. ఏకంగా ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దామనే ప్లాన్ చేశారా స్టుడెంట్ అంటూ స్పందించారు. 10వ తరగతి విద్యార్థి అంటే ఇంకా చిన్నపిల్లలేం కాదు.. తిరస్కరించినందుకు ధన్యవాదాలు అంటూ మరికొందరు కామెంట్ చేశారు. చాట్ జీపీటీని అడుగొచ్చు కదా..! ఇలా అడగడం ఎందుకు? అని మరికొందరు ఫన్నీగా సలహాలు ఇచ్చారు. And look at this message I received just now ! A kid wants me to do their homework for them! 🤷🏻♀️🤷🏻♀️🤷🏻♀️ pic.twitter.com/T6yv6dE8N4 — Preeti Shenoy (@preetishenoy) June 29, 2023 ఇదీ చదవండి: బీచ్ రోడ్లో 'బిగ్ బీ' పాటకు వృద్ధ జంట స్టెప్స్.. ఆనంద్ మహేంద్ర ట్వీట్.. వీడియో వైరల్.. -
అయ్యో బిడ్డా! ఏమైందిరా?
రణస్థలం (శ్రీకాకుళం): పదమూడేళ్ల కుర్రవాడు. అప్పటివరకు ఉత్సాహంగా ఉన్నవాడు. ఏమైందో ఏమో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. క్షణాల వ్యవధిలో ప్రా ణాలు వదిలేసి తల్లిదండ్రులకు శోకం మిగిల్చాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రంలోని జేఆర్ పురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బౌరోతు సంతోష్(13) ఏడో తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో బెంచీపై కూర్చుని ఉన్న సంతోష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు టీచర్‌కు చెప్పగా ఆయన స్కూల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. వెంటనే స్కూల్ వ్యాన్లోనే మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. నిమిషాల వ్యవధిలో ఇంత విషాదం చోటుచేసుకోవడంతో ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. దీనిపై బాలుడి తల్లి మణికి సమాచారం అందించగా.. ఆమె ఆస్పత్రికి వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. వీరు జేఆర్‌పురంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. బాలుడి తండ్రి జయరావు అరబిందో పరిశ్రమలో టెక్నికల్ కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు కూడా విషయం చెప్పడంతో ఆస్పత్రికి వచ్చి గుండెలవిసేలా రోదించారు. వీరి స్వగ్రామం విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలంలోని గొడుగువలస. మృతదేహాన్ని అక్కడకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. జేఆర్ పురం ఎస్ఐ జి.రాజేష్ ఆస్పత్రికి వచ్చి ఆరా తీశారు. అనంతరం ప్రైవేటు స్కూల్‌కు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడారు. (చదవండి: భార్య ప్రవర్తనపై అనుమానం.. భర్త ఎంతపని చేశాడంటే?) -
శిథిల దృశ్యం: అంతా బాగుంటే కొత్త డ్రెస్ వేసుకుని.. సందడి చేసేది, కానీ!
కీవ్: ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. నగరాలు, పట్టణాలను అధీనంలోకి తెచ్చుకునేందుకు మాస్కో సైన్యం ప్రణాళికలు రచిస్తుండగా ఉక్రెయిన్ ఆర్మీ తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తోంది. ఈక్రమంలో కార్యాలయాలు, పాఠశాలలు, పార్కులు, నివాసాలు నేలమట్టమవుతున్నాయి. మరోవైపు రష్యా సైన్యం దాడుల్లో నిత్యం 100 మంది దాకా తమ సైనికులు మరణిస్తున్నారని ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ తెలిపారు. రక్తపాతం బాధాకరమని ఫేస్బుక్లో పోస్టు చేశారు. తమ బిడ్డలను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి👉🏼 పాకిస్తాన్లో హిందూ జనాభా ఎంతో తెలుసా? ఈక్రమంలో ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో కలచివేస్తోంది. ‘అన్నీ బాగుంటే ఈ ఫొటోలో కనిపిస్తున్న అన్నా ఎపిసెవా ఈ ఏడాది తన హైస్కూల్ చదువును పూర్తి చేసేది. ఘనంగా జరిగే తన స్కూల్ వార్షిక సదస్సులో ఆమె, ఆమె స్నేహితులు పాల్గొని సందడి చేసేవారు. అందుకోసం వారంతా కొత్త బట్టలు కూడా కొని తెచ్చుకున్నారు. కానీ, పరిస్థితులు తల్లకిందులయ్యాయి. మాయదారి యుద్ధం కలలను కల్లలు చేసింది. దేశాన్ని, తమ పాఠశాలను సర్వనాశం చేసింది. శిథిలాలుగా మిగిలిపోయిన తన స్కూల్ వద్ద ఎపిసెవా కొత్త డ్రెస్సు ధరించి మౌన రోదన చేసేది కాదు!’ అని ఒలెక్సాండ్రా మాత్విచుక్ తన కజిన్ గురించి ఆవేదనభరితంగా ట్విటర్లో రాసుకొచ్చింది. ఎపిసెవా ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి👉🏼 ప్రవక్త కామెంట్లు: అజిత్ దోవల్ పేరుతో ‘గుణపాఠం ట్వీట్’.. కాసేపటికే డిలీట్ Anna Episheva: My niece was supposed to graduate this year from her high school. She and her friends bought dresses and were looking forward to this day. Then Russians came. Her school was directly hit and destroyed. Today she came back to what is left of her school and her plans pic.twitter.com/q9cJW2j8f0 — Oleksandra Matviichuk (@avalaina) June 7, 2022 -
హైస్కూల్ స్టూడెంట్ పనికి టీచర్ ఫిదా..
వాషింగ్టన్: ఇతరుల పట్ల మనిషికి కొంచెమైనా ఉదారత అవసరం. తనకు సరిపడా ఉన్నప్పుడు ఎదుటివారికి చేయూతనివ్వడమే ఉదారత. ఇక అమెరికాలోని ఓ విద్యార్థి చూపిన ఔదార్యం నెటిజన్ల ప్రశంసలు పొందుతోంది. హైస్కూల్ టాప్ విద్యార్థి ఒకరు పరీక్షలో తనకు వచ్చిన బోనస్ పాయింట్లను తక్కువ మార్కులు వచ్చిన వారికి జత చేయండని టీచర్‌కు విజ్ఞప్తి చేశాడు. ఈమేరకు ఎగ్జామ్ పేపర్‌పైనే రాసిపెట్టాడు. సదరు A+ స్టూడెంట్ పనికి క్లాస్ టీచర్ విన్స్టన్ లీ ఫిదా అయ్యాడు. సోషల్ మీడియాలో టీచర్ ఆ వివరాలను పోస్టు చేయడంతో వైరల్ అయింది. (చదవండి: బాంగ్రా డ్యాన్స్‌కు మెలానియా ట్రంప్ ఫిదా) ‘94 మార్కులు సాధించిన A+ విద్యార్థికి బోనస్‌గా ఐదు పాయింట్లు వస్తాయి. దాంతో అతని స్కోరు 99 అవుతుంది. కానీ, తమ తరగతిలో తక్కువ మార్కులు పొంది ఇబ్బంది పడుతున్నవారికి అతని బోనస్ పాయింట్లు జత చేయాలని A+ విద్యార్థి కోరాడు. అతని ప్రేమమయ ప్రవర్తన నాకు ముచ్చటేస్తుంది. కేవలం ఇతరులకు సాయం చేయాలనే తలంపే అతనికి ఈ ఆలోచన కల్పించింది. A+ విద్యార్థి విజ్ఞప్తి మేరకు ఓ బాలికకు ఆ 5 మార్కులు జత చేశాను. దాంతో ఆమె కూడా A+ గ్రేడ్ పొందింది. మామూలుగా ఇలా ఎవరూ చేయరు. కానీ, A+ విద్యార్థి విన్నపాన్ని కాదనలేకపోయాను’ అని విన్స్టన్ లీ చెప్పుకొచ్చారు. (ఆ చిన్నోడి కోసం 4 లక్షల డాలర్లు.. ఏం చేస్తారంటే..) -
నేరాన్ని అంగీకరించిన నికోలస్ క్రూజ్
పార్క్‌ల్యాండ్: నేరాన్ని అంగీకరించిన నికోలస్ క్రూజ్‌ని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న మేజరీ స్టోన్‌మన్ డగ్లస్ హై స్కూల్లో గురువారం కాల్పులు జరిపి 17 మంది మరణానికి కారణమైన మాజీ విద్యార్థి నికోలస్ క్రూజ్ తన నేరాన్ని అంగీకరించాడు. తుపాకీని తాను చట్టబద్ధంగానే కొన్నానని కోర్టుకు తెలిపాడు. కాగా, మానసిక బలహీనులే ఉన్మాదాలకు పాల్పడుతున్నారని, మానసిక ఆరోగ్యంపై దృష్టిపెడతామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. తుపాకుల అమ్మకాలపై నియంత్రణ విధించడాన్ని మాత్రం ఆయన తిరస్కరించారు. -
విద్యార్థినిపై అత్యాచారం.. హత్య, వెల్లువెత్తిన నిరసన
హైస్కూలు విద్యార్థిపై దారుణంగా అత్యాచారం చేసి, ఆమెను అత్యంత క్రూరంగా చంపడంతో అర్జెంటీనా వీధుల్లో వేలాదిమంది పౌరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నల్లటి దుస్తులు వేసుకుని వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో ఎక్కువమంది మహిళలు కనిపించినా, కొందరు పురుషులు కూడా వారికి తోడయ్యారు. లూసియా పెరెజ్ అనే హైస్కూలు విద్యార్థిని ఈనెల 8వ తేదీన మరణించింది. డ్రగ్ డీలర్లే ఆమెపై అత్యాచారం చేసి, ఆమెను ఒక స్పైక్‌తో పొడిచి చంపేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో అర్జెంటీనా పౌరులు తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 7.30 నుంచి గంట పాటు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అర్జెంటీనాలో ఇటీవలి కాలంలో మహిళలపై హింసాత్మక నేరాలు ఎక్కువయ్యాయి. ప్రతి 36 గంటలకు ఒక మహిళ హత్యకు గురవుతోంది. గత సంవత్సరం జూన్ నెలలో ముగ్గురు మహిళలను దారుణంగా చంపడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఒక కిండర్‌గార్టెన్ టీచర్‌ను ఆమె మాజీ భర్త క్లాసులో పిల్లల ఎదుటే గొంతు కోసి చంపేశాడు. 14 ఏళ్ల యువతి గర్భవతి కావడంతో ఆమె బోయ్‌ఫ్రెండు ఆమెను కొట్టి చంపేశాడు. మరో మహిళను పట్టపగలే బ్యూనస్ ఎయిర్స్‌లోని ఒక కేఫ్‌లో మహిలను ఆమె మాజీ బోయ్‌ఫ్రెండు కత్తితో పొడిచి హతమార్చాడు. ఇప్పుడు లూసియా పెరెజ్ వంతు వచ్చింది. బ్యూనస్ ఎయిర్స్ నగరంలో భారీగా వర్షం పడుతున్నా కూడా నిరసనకారులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా తమ ప్రదర్శన కొనసాగించారు. -
రోబోటిక్ చేయిని రూపొందించిన భారత సంతతి విద్యార్థి
న్యూయార్క్: అతి త క్కువ ఖర్చుతో రోబోటిక్ చేయిని రూపొందించి భారత సంతతి విద్యార్థి ప్రశంసలు అందుకున్నాడు. సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులో భాగంగా ఈ రోబోటిక్ చేయిని రూపొందించిన నిలయ్ మెహతా.. అమెరికా పాఠశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అందించే బ్లూ రిబ్బన్ అవార్డును అందుకున్నాడు. కాలిఫోర్నియాలోని ఇర్విన్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న మెహతా ఈ ప్రాజెక్టు కోసం నాలుగు నెలలుగా కష్టపడినట్లు చెప్పాడు. ఆరెంజ్ కంట్రీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫెయిర్‌కు అర్హత సాధించి నాలుగు మొదటి బహుమతులు కూడా అందుకున్నాడు. సాధారణంగా కృత్రిమ చేయి 35వేల డాలర్లు(సుమారు రూ.22 లక్షలు ) ఉంటుంది. నిలయ్ రూపొందించిన ఈ రోబోటిక్ ధర కేవలం 260 డాలర్లు(రూ. 16,500) మాత్రమే.