రోబోటిక్ చేయిని రూపొందించిన భారత సంతతి విద్యార్థి | High School Student 3D Prints Voice-Controlled Robotic Arm | Sakshi
Sakshi News home page

రోబోటిక్ చేయిని రూపొందించిన భారత సంతతి విద్యార్థి

Published Wed, Aug 5 2015 9:43 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

రోబోటిక్ చేయిని రూపొందించిన భారత సంతతి విద్యార్థి

రోబోటిక్ చేయిని రూపొందించిన భారత సంతతి విద్యార్థి

న్యూయార్క్: అతి త క్కువ ఖర్చుతో రోబోటిక్ చేయిని రూపొందించి భారత సంతతి విద్యార్థి ప్రశంసలు అందుకున్నాడు. సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులో భాగంగా ఈ రోబోటిక్ చేయిని రూపొందించిన నిలయ్ మెహతా.. అమెరికా పాఠశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అందించే బ్లూ రిబ్బన్ అవార్డును అందుకున్నాడు. కాలిఫోర్నియాలోని ఇర్విన్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న మెహతా ఈ ప్రాజెక్టు కోసం నాలుగు నెలలుగా కష్టపడినట్లు చెప్పాడు. ఆరెంజ్ కంట్రీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫెయిర్‌కు అర్హత సాధించి నాలుగు మొదటి బహుమతులు కూడా అందుకున్నాడు. సాధారణంగా కృత్రిమ చేయి 35వేల డాలర్లు(సుమారు రూ.22 లక్షలు ) ఉంటుంది. నిలయ్ రూపొందించిన ఈ రోబోటిక్ ధర కేవలం 260 డాలర్లు(రూ. 16,500) మాత్రమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement