హైస్కూల్‌ స్టూడెంట్‌ పనికి టీచర్‌ ఫిదా.. | US Student Request To Add His Bonus Points Who Scored Lowest | Sakshi
Sakshi News home page

హైస్కూల్‌ స్టూడెంట్‌ పనికి టీచర్‌ ఫిదా..

Published Fri, Feb 28 2020 5:00 PM | Last Updated on Fri, Feb 28 2020 5:31 PM

US Student Request To Add His Bonus Points Who Scored Lowest - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

వాషింగ్టన్‌: ఇతరుల పట్ల మనిషికి కొంచెమైనా ఉదారత అవసరం. తనకు సరిపడా ఉన్నప్పుడు ఎదుటివారికి చేయూతనివ్వడమే ఉదారత. ఇక అమెరికాలోని ఓ విద్యార్థి చూపిన ఔదార్యం నెటిజన్ల ప్రశంసలు పొందుతోంది. హైస్కూల్‌ టాప్‌ విద్యార్థి ఒకరు పరీక్షలో తనకు వచ్చిన బోనస్‌ పాయింట్లను తక్కువ మార్కులు వచ్చిన వారికి జత చేయండని టీచర్‌కు విజ్ఞప్తి చేశాడు. ఈమేరకు ఎగ్జామ్‌ పేపర్‌పైనే రాసిపెట్టాడు. సదరు A+ స్టూడెంట్‌ పనికి క్లాస్‌ టీచర్‌ విన్‌స్టన్‌ లీ ఫిదా అయ్యాడు. సోషల్‌ మీడియాలో టీచర్‌ ఆ వివరాలను పోస్టు చేయడంతో వైరల్‌ అయింది. (చదవండి: బాంగ్రా డ్యాన్స్‌కు మెలానియా ట్రంప్‌ ఫిదా)

‘94 మార్కులు సాధించిన A+ విద్యార్థికి బోనస్‌గా ఐదు పాయింట్లు వస్తాయి. దాంతో అతని స్కోరు 99 అవుతుంది. కానీ, తమ తరగతిలో తక్కువ మార్కులు పొంది ఇబ్బంది పడుతున్నవారికి అతని బోనస్‌ పాయింట్లు జత చేయాలని A+ విద్యార్థి కోరాడు. అతని ప్రేమమయ ప్రవర్తన నాకు ముచ్చటేస్తుంది. కేవలం ఇతరులకు సాయం చేయాలనే తలంపే అతనికి ఈ ఆలోచన కల్పించింది. A+ విద్యార్థి విజ్ఞప్తి మేరకు ఓ బాలికకు ఆ 5 మార్కులు జత చేశాను. దాంతో ఆమె కూడా A+ గ్రేడ్‌ పొందింది. మామూలుగా ఇలా ఎవరూ చేయరు. కానీ, A+ విద్యార్థి విన్నపాన్ని కాదనలేకపోయాను’ అని విన్‌స్టన్‌ లీ చెప్పుకొచ్చారు. (ఆ చిన్నోడి కోసం 4 లక్షల డాలర్లు.. ఏం చేస్తారంటే..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement