నడుస్తున్న కారుపై హోమ్‌వర్క్‌, వీడియో వైరల్‌ | Student Filmed Doing Homework On Roof Of Moving Taxi | Sakshi
Sakshi News home page

నడుస్తున్న కారుపై హోమ్‌వర్క్‌, వీడియో వైరల్‌

Published Mon, May 21 2018 6:04 PM | Last Updated on Fri, Nov 9 2018 5:06 PM

Student Filmed Doing Homework On Roof Of Moving Taxi - Sakshi

హెనాన్‌ ప్రావినెన్స్‌ : ముందు రోజు క్లాస్‌ టీచర్‌ ఇచ్చిన హోమ్‌వర్క్‌ చేయడం మర్చిపోతే ఏం చేస్తాం.. అమ్మ బ్రేక్‌ఫాస్ట్‌ తినిపించే సమయంలోనో.. లేదా ఏదైనా క్లాస్‌ ఖాళీగా ఉన్న సమయంలోనైనా చకాచక ముగించేస్తాం. కానీ చైనాలో ఓ అమ్మాయి అయితే తన హోమ్‌ వర్క్‌ ముగించడం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. నడుస్తున్న ట్యాక్సీలో నుంచి బయటికి కూర్చుని, కారు టాప్‌ను డెస్క్‌గా మార్చుకుని తన హోమ్‌వర్క్‌ ముగించేయాలని చూసింది. డ్రైవర్‌ సీట్‌లో కూర్చుని ట్యాక్సీ నడుపుతున్న ఆ అమ్మాయి తండ్రి తన స్నేహితుడితో మాట్లాడుతూ ఆ విషయాన్ని గమనించలేదు. పక్కనే వెళ్తున్న వారు, దాన్ని వీడియోగా తీసి సీజీటీఎన్‌ షోల్లో యూట్యూబ్‌లో పెట్టారు. ఆ బిజీ రోడ్డులో హోమ్‌వర్క్‌ కోసం ఆ అమ్మాయి చేసిన వింత సాహసాన్ని వివరించారు. 

తన కూతురి కారులో నుంచి బయటికి కూర్చుని అలా హోమ్‌వర్క్‌ చేయడం గమనించిన ఆమె తండ్రి వెంటనే అలర్ట్‌ అయి, కిందకి రప్పించాడు. ఆమె వెనుకాల విండో సీటులో కూర్చుని ఉందని, తాను అది గమనించకపోవడం నిజంగా తన నిర్లక్ష్యమేనని డ్రైవర్‌, అమ్మాయి తండ్రి ఛెంగ్‌ చెప్పారు. మరోసారి అలా చేయొద్దని తన కూతురికి వార్నింగ్‌ ఇచ్చినట్టు పేర్కొన్నాడు. అయితే నిర్లక్ష్యపూరిత వైఖరితో ఆ విషయం గమనించకపోవడంతో, అతని డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు అయింది. మరోసారి అతన్ని ట్యాక్సీలు నడుపుకుండా చర్యలు తీసుకున్నట్టు చైనా పేపర్‌ రిపోర్టు చేసింది. ఈ సంఘటన గత వారం సెంట్రల్‌ చైనా హెనాన్‌ ప్రావినెన్స్‌లోని షాంగ్క్యు లో చోటు చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement