విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అత్యాచారయత్నం | Shocking moment a high school teacher strips naked and tries to RAPE a female student in broad daylight | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అత్యాచారయత్నం

Published Wed, Mar 30 2016 2:26 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అత్యాచారయత్నం - Sakshi

విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అత్యాచారయత్నం

బీజింగ్: చైనాలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయుడి బుద్ధి పెడదోవ పట్టింది. పట్టపగలే పాఠశాలలో అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. చైనాలోని లింగ్షాన్ కౌంటీలోని ఉన్నత పాఠశాలలో చోటు చేసుకున్నఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పాఠశాలలోని విద్యార్థులు ఈ పరిణామంతో ఆందోళనకు గురయ్యారు.

కేసు పూర్వాపరాల్లోకి వెళితే నిందితుడు హూ అనే టీచర్ గతంలో మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో 2011 చికిత్స తీసుకున్నాడు.  రెండేళ్ల తరువాత పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని తేలిన  అనంతరం ఇటీవలే  విధుల్లో చేరాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థినిపై అత్యాచారానికి  ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఓ మహిళా టీచర్ ఉపాద్యాయుడి దుర్మార్గాన్ని పసిగట్టారు. వెంటనే ఇతర ఉపాధ్యాయులను అప్రమత్తం చేశారు. ఆ యువతిని అతడి బారినుంచి రక్షించి,  పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనను అక్కడి ప్రభుత్వ విభాగం ధ్రువీకరించింది. గత ఐదేళ్లుగా అతడిని పాఠశాలలో క్లాసులు చెప్పేందుకు అనుమతించలేదని, కేవలం లైబ్రరీలో పనిచేసేలా ఏర్పాటు చేశామంది. గత ఐదేళ్లుగా అతని ప్రవర్తన బాగానే ఉందని కానీ, మార్చి 28న ఓ విద్యార్థినిపై అత్యాచారానికి ప్రయత్నించాడని పేర్కొంది.  సదరు యువతికి ఎలాంటి గాయాలు కాలేదని  అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement