
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి శుక్రవారం సుప్రీం కోర్టు షాకిచ్చింది. రాష్ట్రంలోని డార్జిలింగ్, కలిమ్‌పోంగ్ జిల్లాల్లో మోహరించిన 15 కంపెనీల కేంద్ర సాయుధ పారామిలటరీ దళాల్లో(సీఏపీఎఫ్) 7 కంపెనీలను వెనక్కు తీసుకోవడానికి కేంద్రానికి అనుమతిచ్చింది. ఈ మేరకు బలగాలను కేంద్రం ఉపసంహరించకుండా కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రక్షణ ఏర్పాట్లకు బలగాలు అవసరమని కేంద్రం చేసిన విజ్ఞప్తిపై సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించింది. కేంద్రం విజ్ఞప్తిపై తమ స్పందనను వారం రోజుల్లోగా తెలియజేయాలనిబెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment