పండగకు ముందే ‘ఢాం... ఢాం’లు మొదలయ్యాయి. ఎప్పుడూ శబ్దాలు వినడమేనా, ఈసారి వాటి చరిత్ర కొంచెం తెలుసుకుందాం. లాంగ్ లాంగ్ ఎగో.... అనగా క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలో చైనాలో టపాసులు లేవు. అయిననూ ‘ఢాం... ఢాం’లు మాత్రం ఉండేవి. వెదురు గొట్టాలను మంటల్లోకి విసిరేవారు. వెదురు లోపల కణువుల మధ్య ఉన్న ఎయిర్ పాకెట్లు వేడెక్కి పేలి పోవడంతో పెద్ద శబ్దాలు వచ్చేవి.
పదవ శతాబ్దానికి చెందిన ఒక చైనీస్ ఆల్కెమిస్ట్ ద్వారా కొత్త పటాసులు రంగంలోకి వచ్చాయి. పొటాసియం నైట్రేట్, సల్ఫర్, బొగ్గును కలిసి వెదురు గొట్టాల్లో పోసి ‘ఢాం’ అనిపించేవారు. ఆయన తయారు చేసిన మిశ్రమం ఆ తరువాత కాలంలో ‘గన్ పౌడర్’గా ప్రసిద్ధి చెందింది. ఇది మానవ నిర్మిత మొదటి బాణసంచా అంటారు. ఈ ప్రమాదకరమైన, ప్రకాశవంతమైన ఆవిష్కరణలు సిల్క్ రూట్ గుండా ఐరోపా వరకు వెళ్లాయి. ఆ తరువాత కాలంలో వాటి తయారీకి సంబంధించిన సాంకేతికత పెరగడంతో విందులు, వినోదాలు, పండగలలో బాణసంచా పేల్చడం మామూలైపోయింది.
Comments
Please login to add a commentAdd a comment